కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచదేశాలపై విరుచుకుపడుతోంది. కోవిడ్-19 ఉదృతి తగ్గముఖం పట్టడంతో ఆయా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి పలికే లోపే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చి పడింది. దీంతో పలు ఐటీ కంపెనీలు తిరిగి ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని చెప్పేశాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఆయా దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోంకే జై కొట్టాయి. కాగా జపాన్‌లోని ఉద్యోగుల కోసం సరికొత్త ప్రణాళికను యాహూ ప్రతిపాదించింది.
ఎక్కడ నుంచైనా పనిచేయండి..!
జపాన్‌లో పనిచేస్తోన్న 8,000 ఉద్యోగులకు యాహూ బంపరాపర్ ప్రకటించింది. కంపెనీ ఉద్యోగులు దేశంలో ఎక్కడనుంచైనా పనిచేసే వెసులబాటు యాహూ జపాన్ కల్పించింది. అంతేకాకుండా ఉద్యోగులు ఏదైనా అవసరం ఉంటే కార్యాలయాలకు వెళ్లొచ్చునని తెలిపింది. జపాన్‌లో ఇప్పటికే సంస్థకు చెందిన 90 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారని పేర్కొంది.
తిరిగేందుకు లక్ష వరకు..!
సంస్థ అవసరాల నిమిత్తం ఉద్యోగులు దేశంలోని ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకుగాను ఉద్యోగులకు కేటాయించే బడ్జెట్‌ను యాహూ జపాన్ భారీగా పెంచేసింది. విమానాల్లో తిరిగే సదుపాయాన్ని యాహూ జపాన్ తమ ఉద్యోగులకు కల్పించనుంది. ఈ ఆఫర్ 2022 ఎప్రిల్ 1 నుంచి అందుబాటులో రానుంది. ప్రయాణాల కోసం ఉద్యోగులకు నెలకుగాను 1500 డాలర్లను (సుమారు రూ. లక్ష వరకు) యాహూ జపాన్ ఇవ్వనుంది. ఈ చొరవతో ఉద్యోగులు మరింత కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రోత్సహకంగా నిలుస్తోందని, అంతేకాకుండా ఉద్యోగుల శ్రేయస్సుకు ఉపయోగపడుతోందని యాహూ జపాన్ అభిప్రాయపడింది.
చదవండి: బిగ్ బాస్కెట్, జియో మార్ట్‌లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..!
Comments
Please login to add a commentAdd a comment