జీమెయిల్, యాహూలపై నిషేధం! | Govt may ban Gmail, Yahoo! for official use | Sakshi
Sakshi News home page

జీమెయిల్, యాహూలపై నిషేధం!

Published Sat, Sep 13 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

Govt may ban Gmail, Yahoo! for official use

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పరిరక్షించడానికిగానూ అధికారిక కార్యకలాపాల్లో జీమెయిల్, యాహూలాంటి ఈమెయిల్ సర్వీసుల వినియోగాన్ని నిషేధించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ(డీఈఐటీవై) కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. దీనిపై కేంద్ర మంత్రివర్గం ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు, హ్యాకింగ్ ఘటనలు పెరిగడంతో డీఈఐటీవై ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. గూగుల్‌కు సంబంధించిన 50 లక్షల జీమెయిల్ యూజర్ నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయన్న వార్తలూ దీనికి దోహదం చేశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement