Email Service
-
త్వరలో ఎన్జీటీలో ఈ–మెయిల్ పిటిషన్
గాంధీనగర్: ఆన్లైన్ ద్వారా పిటిషన్‌ను దాఖలు చేసేందుకు త్వరలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ తెలిపారు. గాంధీనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్దిపాటి కోర్టు ఫీజు చెల్లింపుతో దేశంలో ఎక్కడి నుంచైనా ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పిటిషర్ ముందుగా పర్యావరణ ఉల్లంఘన వివరాలు, అందుకు తగ్గ ఆధారాలు, ఉల్లంఘించిన వ్యక్తి లేదా సంస్థ వివరాలు తదితర అంశాలను పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం దరఖాస్తు రిజిస్టర్ అవ్వటంతోపాటు నంబర్‌ను కేటాయిస్తామన్నారు. -
ఐబీఎం కొత్త మెయిల్ సర్వీస్
న్యూఢిల్లీ: ఐబీఎం సంస్థ వ్యాపార సంస్థల కోసం వెర్స్ పేరుతో కొత్త ఈ మెయిల్ సర్వీస్‌ను ఆవిష్కరించింది. ఫైల్స్ షేరింగ్, ఎనలిటిక్స్, సోషల్ మీడియాలను సమ్మిళితం చేస్తూ సంస్థల ఉత్పాదకతను మెరుగుపరచడానికి తోడ్పడే నిమిత్తం ఈ కొత్త యాప్‌ను అందిస్తున్నామని ఐబీఎం పేర్కొంది. ఈ ఆప్‌తో కంపెనీ ఉద్యోగులు ఈ మెయిల్స్, కేలండర్స్, ఫైల్ షేరింగ్, ఇన్స్టంట్ మెసేజింగ్, సోషల్ అప్డేట్స్, వీడియో చాట్స్.... ఇవన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై యాక్సెస్ చేసుకోవచ్చని వివరించింది. ఈ మెయిల్స్‌లో కావలసిన కంటెంట్ ఉన్న మెయిల్స్‌ను సరిగ్గా సెర్చ్ చేసే ఫేసెటెడ్ సెర్చ్ ప్రత్యేకత ఈ వెర్స్ ఈమెయిల్ సర్వీస్‌కు ఉందని పేర్కొంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌ను అందిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, గూగుల్ ఇన్‌బాక్స్ ఈ మెయిల్ సర్వీసులకు ఇది గట్టిపోటీనివ్వగలదని నిపుణులంటున్నారు. రోజుకు 10,800 కోట్ల ఈ మెయిల్స్‌ను ఉద్యోగులు పంపుతున్నారని, దీంతో ఉద్యోగులు గంటకు 36 సార్లు తమ ఈ మెయిల్స్‌ను చెక్ చేస్తున్నారని అంచనా. అయితే వీటిల్లో 14 శాతం ఈ మెయిల్స్ మాత్రమే ముఖ్యమైనవి కావడం విశేషం. -
జీమెయిల్, యాహూలపై నిషేధం!
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పరిరక్షించడానికిగానూ అధికారిక కార్యకలాపాల్లో జీమెయిల్, యాహూలాంటి ఈమెయిల్ సర్వీసుల వినియోగాన్ని నిషేధించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ(డీఈఐటీవై) కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. దీనిపై కేంద్ర మంత్రివర్గం ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు, హ్యాకింగ్ ఘటనలు పెరిగడంతో డీఈఐటీవై ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. గూగుల్‌కు సంబంధించిన 50 లక్షల జీమెయిల్ యూజర్ నేమ్‌లు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయన్న వార్తలూ దీనికి దోహదం చేశాయి.