గాంధీనగర్: ఆన్‌లైన్ ద్వారా పిటిషన్‌ను దాఖలు చేసేందుకు త్వరలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ తెలిపారు. గాంధీనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కొద్దిపాటి కోర్టు ఫీజు చెల్లింపుతో దేశంలో ఎక్కడి నుంచైనా ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పిటిషర్ ముందుగా పర్యావరణ ఉల్లంఘన వివరాలు, అందుకు తగ్గ ఆధారాలు, ఉల్లంఘించిన వ్యక్తి లేదా సంస్థ వివరాలు తదితర అంశాలను పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం దరఖాస్తు రిజిస్టర్ అవ్వటంతోపాటు నంబర్‌ను కేటాయిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment