సాక్షిముంబై: టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత అప్రతిహతంగా కొనసాగుతోంది. అధిక ద్రవ్యోల్బణం, గ్లోబల్ మాంద్యం భయాలు, వ్యయాల నిర్వహణలో భాగంగా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకు తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన టెక్ కంపెనీ యాహూ ఉద్యోగాల కోతను ప్రకటించింది. తన యాడ్ టెక్ యూనిట్ ప్రధాన పునర్నిర్మాణంలో భాగంగా తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 20శాతం కంటే ఎక్కువ మందిని తొలగించాలని యోచిస్తోంది.
ఈ మేరకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను ఉటంకిస్తూ ఆక్సియోస్ గురువారం నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, యాహూ యాడ్ టెక్ ఉద్యోగులలో 50శాతం కంటే ఎక్కువ మందిపై కోతలు ప్రభావం చూపుతాయి. అంటే 1600 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment