ప్రముఖ వీడియో గేమ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘యూనిటీ’ మరోసారి లేఆఫ్స్‌కు శ్రీకారం చేట్టుంది. వరల్డ్ వైడ్‌గా ఆసంస్థలో పనిచేస్తున్న 8 శాతంతో సుమారు 600మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
మెరుగైన ఫలితాలు సాధించేలా సంస్థలోని అన్నీ విభాగాల్లో పునర్నిర్మాణం అవసరమని భావిస్తున్నామని, కాబట్టే వరుసగా మూడో దఫా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో జాన్ రిక్సిటిఎల్లో (John Riccitiello) యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో తెలిపారు.
మూడు దఫాల్లో ఉద్యోగుల తొలగింపు
యూనిటీ’కి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 8 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది వ్యవధిలో మూడు సార్లు ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసింది. తొలిసారి గత ఏడాది జూన్‌లో 225 మంది సిబ్బందిని ఇంటికి సాగనంపగా.. ఈ ఏడాది ప్రారంభంలో 284 మందిని, తాజాగా 600 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు సీఈవో జాన్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపారు.
హైబ్రిడ్ వర్క్ అమలు
కోవిడ్ -19 అదుపులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలికాయి. ఉద్యోగులు కార్యాలయాల నుంచి విధులు నిర్వహించాలని పిలుపు నిచ్చాయి. అందుకు భిన్నంగా యూనిటీ యాజమాన్యం ఈ ఏడాది జూన్ నుంచి ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్‌ను అమలు చేస‍్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వచ్చే నెల నుంచి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది.
కంపెనీ చరిత్రలో లాభాలు..
ఎంగాడ్జెట్ నివేదిక ప్రకారం, కంపెనీ చరిత్రలో అత్యుత్తమ ఆర్థిక త్రైమాసికంగా నమోదు చేసింది. అయినప్పటికీ ఉద్యోగుల్ని తొలగించేందుకు మొగ్గు చూపింది. ఫిబ్రవరిలో విడుదల చేసిన ఫలితాల్లో క్యూ4లో కంపెనీ 451 మిలియన్ల ఆదాయాన్ని గడించింది. 2021లో ఇదే కాలంతో పోలిస్తే 43 శాతంతో వృద్ధి సాధించింది.
ఉద్యోగుల తొలగింపుకు కారణం
యూనిటీ గణనీయమైన వృద్ధిని సాధించినప్పటి ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంస్థ పనితీరు పెట్టుబడిదారుల్ని ఆకట్టులేదేని, ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆ సంస్థ స్టాక్ వ్యాల్యూ సుమారు 11 శాతం తగ్గినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
చదవండి👉 ఉద్యోగులపై వేలాడుతున్న లేఆఫ్స్ కత్తి.. 2.70 లక్షల మంది తొలగింపు!
Comments
Please login to add a commentAdd a comment