సాఫ్ట్‌వేర్! ఈ జాబ్‌కు ఉన్న క్రేజే వేరే. చదువు పూర్తయిందా. బూమింగ్‌లో ఉన్న కోర్స్ నేర్చుకున్నామా? జాబ్ కొట్టామా? అంతే. వారానికి ఐదురోజులే పని. వీకెండ్‌లో పార్టీలు, భారీ ప్యాకేజీలు, శాలరీ హైకులు, ప్రమోషన్‌లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ఆర్ధిక మాంద్యం భయాలతో ఆయా సంస్థలు తొలగించిన ఉద్యోగులు ప్రస్తుతం అనుభవిస్తున్న వెతలు అన్నీ ఇన్నీ కావు.
ఈ ఏడాది ప్రారంభంలో (జవవరి 18న) తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10,000 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి నుంచి తొలగిస్తున్న వారికి సమాచారం అందించి మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. వారిలో అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన నికోలస్ నోల్టన్ ఒకరు.
సంస్థ లేఆఫ్స్‌తో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తూనే మరో కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వెయ్యి సార్లు జాబ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు.
'మైక్రోసాఫ్ట్‌లో నా ఉద్యోగం పోయింది. ఈ రోజే నా లాస్ట్ వర్కింగ్ డే. గత రెండు నెలలుగా కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను. ఇప్పటికే 1000కి పైగా రెజ్యూమ్‌లు పంపించా. అందులో 250 కిపైగా అప్లికేషన్లు సెలక్ట్, 57 రిక్రూటర్స్ కాల్స్, 15 హెరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూలు, 3 ఫైనల్ రౌండ్స్ ఇవన్నీ చేసినా.. ఒక్క ఆఫర్ రాలేదు’ అని వాపోయాడు. విచిత్రం ఏంటంటే ఆయా సంస్థలు లేఆఫ్స్ ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం, ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది.
చివరిగా.. ఆర్ధిక మాంద్యంలో సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నా సరే.. ఐటీ జాబ్ కొట్టాలనే సంకల్పంతో చాలా మంది యువత పోటీపడడం గమనార్హం.
ఇదీ చదవండి : ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment