ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించుకుంటున్నాయి.ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్ మరోసారి లేఆఫ్స్‌కు తెరతీసింది. ఈ ఏడాది ప్రారంభంలో 3,000 మందిని ఫైర్ చేసిన టెక్ దిగ్గజం..తాజాగా,ఆ సంస్థకు చెందిన హెల్త్ విభాగం యూనిట్ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది.
ఒరాకిల్ 2021 డిసెంబర్ నెలలో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నెర్‌ను 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అనంతరం అవుట్ పేషెంట్స్‌కు ట్రీట్మెంట్, ఆర్మీ అధికారులకు జీవితకాలం హెల్త్ కేర్ సర్వీస్‌లను అందించే యూఎస్ ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రాజెక్ట్‌కు దక్కించింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో నిర్వహణ సమయంలో సాఫ్ట్‌వేర్ సమస్యలు తలెత్తాయి. కారణంగా యూఎస్ డిపార్ట్‌మెంట్ పలువురు పెషెంట్లతో కుదుర్చుకున్న ఒప్పొందాలు రద్దయ్యాయి. ఈ ఒప్పందాలు ప్రాజెక్ట్ ఆగిపోయింది.
తాజాగా, ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఒరాకిల్ తన సెర్నెర్‌లో పనిచేసే ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పటికే ఆ విభాగంలో కొత్తగా నియమించుకునేందుకు ఉద్యోగులకు జారీ చేసిన జాబ్ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధిత ఉద్యోగులకు ఒరాకిల్ నెల రోజుల వేతనంతో పాటు, ప్రతి ఏడాది సర్వీసుకు గాను అదనంగా ఓ వారం వేతనం, వెకేషన్ డేస్‌కు చెల్లింపులతో కూడిన పరిహార ప్యాకేజ్‌ను ఒరాకిల్ ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment