ఐటీ,ఐటీయేతర కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోతలు ఆగడం లేదు. ఆయా సంస్థలు వరుసగా విసురుతున్న లేఆఫ్స్ కత్తులు టెక్కీలతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు భయంతో వణికిపోయేలా చేస్తున్నాయి. ఉద్యోగం నుంచి తొలగించినట్లు అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో వస్తున్న ఈ-మెయిల్స్ వారిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
తాజాగా విడుదలైన ఓ నివేదిక సైతం క్యూ1లో అమెరికాకు చెందిన కంపెనీలు మొత్తం 2.70లక్షల మందికి ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపింది. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగుల్లో ఐటీ రంగానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు తేలింది.
ఈ తరుణంలో చికాగోకు కేంద్రంగా ప్లేస్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్’ అనే సంస్థ ఉద్యోగాల తొలగింపులపై ‘ఛాలెంజర్ రిపోర్ట్’ పేరుతో ఏప్రిల్ 6న ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో జనవరి 2023 నుంచి మార్చి నెల ముగిసే సమయానికి 396 శాతంతో అమెరికాలో సుమారు 2,70,416 మంది ఉద్యోగుల్ని ఆయా సంస్థలు ఇంటికి పంపినట్లు తెలిపింది.
గత ఏడాది ఇదే సమయానికి మొత్తం 55,696 (క్యూ1) మందికి పింక్ స్లిప్‌లు జారీ చేయగా.. ఈ ఏడాది క్యూ1లో 2,70,416 ఉద్యోగాలు కోల్పోయినట్లు హైలెట్ చేసింది. ఇక జనవరిలో 102,943, ఫిబ్రవరిలో 77,770, మార్చి నెలలో 89,703 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ ఛాలెంజర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో కంపెనీలు సానుకూల దృక్పదంతో ఉన్నాయని, కాకపోతే పట్టిపీడిస్తున్న ముందస్తు ఆర్ధిక మాంద్యం భయాలు, వడ్డీరేట్ల పెంపు, కంపెనీల ఖర్చలు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ తొలగింపుల్లో టెక్నాలజీ రంగంలో ఎక్కువగా ఉన్నాయని సూచించారు. 2023 జనవరి - మార్చి సమాయానికి ఉద్యోగం కోల్పోయిన వారిలో 38 శాతంగా ఉన్నట్లు చెప్పారు.
ఉద్యోగుల తొలగింపులకు కారణం
ఈ సంవత్సరంలో 167,575 ఉద్యోగుల తొలగింపులకు మార్కెట్, ఆర్థిక పరిస్థితులే కారణమని తెలుస్తోంది. మరో 24,825 మందిని ఫైర్ చేయడానికి కాస్ట్ కటింగ్ కారణం కాగా డిపార్ట్‌మెంట్ మూసివేతతో 22,109 మంది, ఆర్ధిక అనిశ్చితితో 9,870 మంది, పునర్వ్యవస్థీకరణ కారణంగా 8,500 ఉద్యోగాలు పోయాయి. ఈ ఏడాది వరుసగా 7,944 ఉద్యోగాల కోతలకు డిమాండ్ తగ్గుదల కారణమైనట్లు ‘ఛాలెంజర్ రిపోర్ట్’ నివేదిక హైలెట్ చేసింది.
చదవండి👉 రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ గుడ్‌న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment