ఒక పక్క మాంద్యం భయాలకు తోడు.. వ్యయాలు తడిసిమో పెడవుతుండంతో టెక్నాలజీ కంపెనీలు గత ఏడాది నుంచే కొలువుల కోతకు తెరతీశాయి. ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. వాటి సంఖ్య ఇంకా కొనసాగుతుంది. దీంతో కోవిడ్ -19 సంక్షోభంలో రెండు చేతులా సంపాదించిన ఐటీ ఉద్యోగులకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పుండుమీద కారంలా తయారైంది.
వ్యయ నియంత్రణ పేరుతో కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. దీంతో చేసేదీ లేక లేఆఫ్స్ గురైన ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిలో మరి కొందరు మాత్రం కోరుకున్న రంగంలో నచ్చిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే బైక్ ట్యాక్సీలను నడుపుకుంటున్నారు.
తాజాగా, బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) జావా డెవలపర్ బైక్ ట్యాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆర్ధికమాంద్యం దెబ్బకు ఉన్న ఉద్యోగం ఊడిపోయి.. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బైక్ ట్యాక్స్ నడుపుతున్నట్లు తేలింది. ఆ బైక్ ట్యాక్సీని లవ్‌నీష్ ధీర్ బుక్ చేసుకున్నాడు.
చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్
మార్గమధ్యలో తన ర్యాపిడో డ్రైవర్ గురించి తెలుసుకొని లవ్‌నీష్ ఆశ్చర్యపోయాడు. ‘తాను సెప్టెంబర్ 2020లో హెచ్‌సీఎల్‌లో జావా డెవలపర్‌గా చేరినట్లు.. ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగం పోగొట్టుకున్నట్లు తెలిపారు. తన అనుభవానికి తగ్గట్లు మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాని, ర్యాపిడోలో పనిచేస్తే ఎక్కడ, ఏ సంస్థలో ఓపెనింగ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చని ఈ పనిచేస్తున్నట్లు లవ్‌నీష్‌కు తన స్టోరీని వివరించారు.
అంతే లవ్‌నీష్ సదరు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌కు ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. వెంటనే డ్రైవర్ స్టోరీతో పాటు అతని రెజ్యూమ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతను హెచ్‌సీఎల్ ఉద్యోగి. జావా డెవలపర్‌గా పనిచేశారు. మీకు తెలిసిన కంపెనీల్లో ఎక్కడైనా జావా డెవలపర్ ఓపెనింగ్స్ ఉంటే నాకు చెప్పండి. అతని వివరాలను మీకు డైరెక్ట్ మెసేజ్ చేస్తాను అని ట్వీట్ చేశాడు. ఆపోస్ట్ వైరల్ కావడంతో బైక్ ట్యాక్సీ ఉద్యోగి గురించి నెటిజన్లు ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
My Rapido guy is a Java developer recently laid off from HCL driving rapido to get leads for any java developer openings.
I have his cv. DM if you have any relevant openings.
My @peakbengaluru moment 🤯 pic.twitter.com/PUI7ErdKoU
— Loveneesh Dhir | Shardeum 🔼 (@LoveneeshDhir) June 22, 2023
చదవండి👉 వెయ్యి 'రెజ్యుమ్'లు పంపిస్తే.. ఒక్క ఉద్యోగం దొరకలే.. ఐటీ ఉద్యోగి ఆవేదన!
Comments
Please login to add a commentAdd a comment