బంధువు మరణంపై ఫోన్‌లో తన కుటుంబ సభ్యులతో హిందీలో మాట్లాడినందుకు టెక్కీ జాబ్ పోగొట్టుకున్నారు. అకారణంగా తనని జాబ్ నుంచి తొలగించినందుకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు న్యాయ పోరాటానికి దిగారు.
భారత్‌కు చెందిన 78 ఏళ్ల అనిల్ వర్ష్నే 2002 నుంచి అమెరికాలో శత్రుదేశాలు బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాల నుంచి యూఎస్ రక్షణదళాల్ని రక్షించేలా ఇంటిగ్రేటెడ్, లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ విభాగంలో అమెరికా ఫెడరల్ ఏజెన్సీ తరుపున పార్సన్స్ కార్పొరేషన్ అనే సంస్థలో పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో సెప్టెంబరు 26, 2022న ఆఫీస్‌లో తలా మునకలైన అనిల్‌కు అవతల వ్యక్తి నుంచి ఫోన్ కాల్. భారత్‌లోని బంధువులు చనిపోయారనేది ఆ కాల్ సారాంశం. ఫోన్ చేసింది ఆయన బావమరిదే. ఫోన్ కాల్ సంభాణ అంతా హిందీలో జరిగింది. అదే ఆయన చేసిన తప్పు. ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు. సంస్థ రహస్యాల్ని ఎవరికో షేర్ చేస్తున్నారు’ అంటూ భారత టెక్కీ ఫోన్ కాల్‌పై అనుమానంగా ఉంది అంటూ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో సమాచారం అందుకున్న యాజమాన్యం టెక్కీ అనిల్‌ను విధుల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
నాకు అన్యాయం జరిగింది
దీంతో అన్యాయంగా తనని ఉద్యోగం నుంచి తొలగించారంటూ బాధితుడు అనిల్ అలబామాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లోపార్సన్స్ కార్పొరేషన్, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్‌లపై దావా వేసినట్లు ఆలబామా స్థానిక మీడియా సంస్థ ఏఎల్. కామ్ నివేదించింది.
దావాలో ‘గత ఏడాది భారత్‌లో బంధువు మరణంపై బావమరిదితో దాదాపు రెండు నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడా. ఆ సమయంలో సంస్థలోని అత్యంత సున్నితమైన రహస్యాల్ని చేరవేస్తున్నానని తప్పుగా భావించిన శ్వేత జాతీయుడు ఫిర్యాదు చేశాడని, సహోద్యోగి ఫిర్యాదుతో కంపెనీ నన్ను విధుల నుంచి తొలగించిందని దావాలో పేర్కొన్నారు.
ఇక, ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడకూడదన్న నిషేదాజ్ఞలు కూడా లేవు. అయిననప్పటికీ నేను భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారని యాజమాన్యం తన ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు నా భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. అమెరికా మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ (MDA)తో కలిసి పనిచేయకుండా ఆంక్షలు విధించారని వాపోయారు.
మేం తప్పు చేయలేదు
తాజాగా ఈ ఏడాది జూలై 24న కోర్టుకు దాఖలు చేసిన ప్రతిస్పందనలో పార్సన్స్ తాము ఎలాంటి తప్పు చేయలేదని ఖండించింది. అంతేకాదు, వర్ష్నే వేసే దావాను కొట్టివేయాలని కోరింది. తన న్యాయవాదుల ఫీజులు, ఇతర ఖర్చులు సైతం ఖర్చులను చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది.
ఏల్.కామ్ ప్రకారం.. అనిల్ తన దావాలో తొలగించిన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని, సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించారని పేర్కొన్న రికార్డ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన ఉద్యోగాన్ని పునరుద్ధరించకపోతే జాబ్ నుంచి తొలగించినందుకు నష్టపరిహారం, న్యాయవాదుల రుసుములతో పాటు, ప్రయోజనంతో కూడిన ముందస్తు చెల్లింపులు, మానసిక వేదన అనుభవించినందుకు నష్టపరిహారాన్ని కోరనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి
అనిల్ వర్షి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 1968లో అమెరికాకు వలస వచ్చారు. అతను జూలై 2011 నుండి అక్టోబర్ 2022 వరకు పార్సన్స్ హంట్స్‌విల్లే కార్యాలయంలో పనిచేశాడు. సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో కాంట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు పొందాడు. భూమి ఆధారిత క్షిపణి రక్షణ కార్యక్రమంలో 5 మిలియన్లను ఆదా చేసినందుకు మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సిఫార్స్ లేఖను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment