
కాలిఫోర్నియా: యాహూ అభిమానులకు చేదువార్త. యాహూ మెసెంజర్ 20 ఏళ్ల ప్రస్థానానికి తెరదించుతూ యాహూ మెసేజింగ్ యాప్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని మాతృ సంస్థ ఓత్ ఐఎన్‌సీ వెల్లడించింది. ఇకపై యాహూ మెసెంజర్ పనిచేయదని ఓత్ తెలిపింది. అలాగే యాహూలో మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుందని పేర్కొంది.
అయితే యాహూ మెసెంజర్ సర్వీసులు ఇకపై స్క్విరల్ (Squirrel) అనే కొత్త ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌కి మళ్లిస్తున్నట్టు తెలిపింది. అలాగే యూజర్లు తమ చాట్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తునట్టు వెల్లడించింది. ఇందుకు ఆరు నెలల సమాయాన్ని కూడా ఇచ్చింది. https://messenger.yahoo.com/getmydata లింక్‌ను సందర్శిస్తే యూజర్లు తమ యాహూ మెసెంజర్ చాట్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment