messenger app
-
ఫేస్బుక్, మెసెంజర్, ఇన్‌స్టా యాప్స్‌కు తీవ్ర అంతరాయం
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర మెటా యాజమాన్య ప్లాట్‌ఫారమ్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటలకు మెటా యాప్స్ సర్వీసుల్లో అంతరాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు సోషల్ మీడియా నెట్వర్క్ ఔటేజ్ ట్రాకర్ ప్లాట్‌ఫాం డైన్ డిటెక్టర్ వెల్లడించింది. మరోవైన తోటి సోషల్ నెట్వర్క్ సైట్లలో అంతరాయాలను వెక్కిరిస్తూ ఎలోన్మస్క్ స్పందించారు. ‘మీరు(యూజర్లు) ఈ పోస్టును చదువుతున్నారంటే మా సర్వర్లు పక్కాగా పని చేస్తున్నాయని అర్థం’ అంటూ పోస్ట్ చేశారు. If you’re reading this post, it’s because our servers are working — Elon Musk (@elonmusk) March 5, 2024 ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ మెటా స్పోక్స్‌పర్సన్ ఆండీస్టోన్ స్పందిస్తూ తమ యూజర్లు మెటా యాప్స్ ద్వారా సమస్యను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. We're aware people are having trouble accessing our services. We are working on this now. — Andy Stone (@andymstone) March 5, 2024 -
లవ్‌చాట్.. మేడ్ ఇన్ ఆంధ్రా
సాక్షి, అనంతపురం: వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్.. ఇవన్నీ యువతకు సుపరిచితమే. ఇదే తరహాలో ఇప్పుడు కొత్తగా మరో యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటారా? ఇది మేడ్ ఇన్ ఆంధ్రా. ఇంకా చెప్పాలంటే.. మేడ్ ఇన్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురానికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి ఈ ‘లవ్‌చాట్’ మెసేజింగ్ యాప్‌ను రూపొందించాడు. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం విలేకరులకు వెల్లడించాడు. సాయికుమార్ నాన్న శేఖర్, అమ్మ నాగలక్ష్మి. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతను శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాళసముద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై సాయికుమార్‌కు ఆసక్తి ఎక్కువ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటేషనల్ థింకింగ్ ఉపాధ్యాయుడు త్యాగేశ్వర్ నాయక్ మార్గదర్శకత్వంలో appinventor.mit.edu అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుని యువతకు ఆకర్షణగా ‘లవ్‌చాట్’ అనే యాప్‌ను సాయికుమార్ రూపొందించాడు. 5 సార్లు ప్రయత్నించి విఫలమైన తర్వాత 6వ సారి యాప్ రూపకల్పనలో విజయవంతమయ్యాడు. ఇది మెసెంజర్ యాప్‌గా పని చేస్తుంది. వాట్సాప్ మాదిరిగానే లవ్చాట్లోనూ స్నేహితులు, బంధువులతో చాటింగ్, ఫొటో షేరింగ్, ఫోన్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు లవ్‌చాట్ యాప్‌ను 150 మందికి పైగా డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. https://appsgeyser. com/15260267 అనే లింకు ద్వారా గూగుల్ క్రోమ్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఫేస్బుక్ మాతృ సంస్థ పేరు మార్పు వెనుక అసలు కారణం ఇది?
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ "ఫేస్బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్" మాతృ సంస్థ పేరును ఫేస్బుక్ నుంచి మెటాగా మార్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక పై నుంచి ఈ యాప్స్ మాతృ సంస్థను మెటాగా వ్యవహరించాల్సి ఉంటుంది అని జుకర్‌బర్గ్ కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ మేరకు జుకర్‌బర్గ్ కనెక్ట్ ఈవెంట్లో తన కంపెనీ కొత్త పేరు, లోగోను ప్రకటించారు. నిజానికి చెప్పాలంటే పూర్తి పేరు మెటావర్స్. దీనిని సంక్షిప్తంగా మెటా అని నామకరణం చేశారు. గ్రీకు భాషలో 'మెటా' అంటే "అంతకు మించి" అని అర్ధం. అయితే, ఫేస్బుక్ పేరు మార్పు విషయంలో చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఇక నుంచి ఫేస్బుక్ పేరు మెటాగా మారనున్నట్లు అర్ధం చేసుకుంటున్నారు. కానీ, అది వాస్తవం కాదు. ఇప్పటి వరకు "ఫేస్బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్" అన్నీ యాప్స్ కి కలిపి మాతృ సంస్థగా ఫేస్బుక్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ మాతృ సంస్థ పేరును "మెటా"గా జుకర్‌బర్గ్ ప్రకటించారు. అంటే ఇకపై మెటా మాతృ సంస్థ కింద ఫేస్బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్ ఉంటాయన్నమాట. అయితే ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు ఈ మార్పు ఎందుకు?. Announcing @Meta — the Facebook company’s new name. Meta is helping to build the metaverse, a place where we’ll play and connect in 3D. Welcome to the next chapter of social connection. pic.twitter.com/ywSJPLsCoD — Meta (@Meta) October 28, 2021 (చదవండి: టాటా మోటార్స్ అస్సలు తగ్గట్లేదుగా!) అసలు కారణం ఇది అక్టోబర్ 28న జరిగిన కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పేరు మార్పు గురుంచి ఇలా మాట్లాడారు.. "భవిష్యత్తులో మన సంస్థ ఏం చేయబోతోందనే విషయాన్ని ఫేస్బుక్ అనే పదంతో నిర్వచించలేం. మన విస్తరణకు ఆ పదం చాలా చిన్నదైపోయింది. కొత్త పేరు ఫేస్బుక్ యాప్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రజలకు చేరువకావడానికి అన్నీ సంస్థలు యాప్స్ ను మాత్రమే వాడుకొనేవి, భౌతికంగా దగ్గర అయ్యే విధంగా అనుభూతి కలిగించే టెక్నాలజీ లేదు. అలాంటి లోటు పూడ్చడానికి రాబోయే రోజుల్లో సంస్థ భారీ ఎత్తున చేపట్టబోయే ఆగ్యుమెంట్, వర్చువల్ రియాలటీకి ప్రతిబింబంగా ఈ మెటా నిలుస్తుంది. మనం ఎవరు, మనం భవిష్యత్తులో ఏం నిర్మించాలనుకుంటున్నాం అనేది మెటా మీనింగ్" అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ ఆధారిత సేవలకు చిరునామాగా మారాలనే లక్ష్యాన్ని మెటా నిర్దేశించుకుంది. (చదవండి: దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!) మరో కారణం సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాతృ సంస్థ పేరు మార్పు విషయం గురుంచి ఇలా చెబుతున్నప్పటికీ మరోవైపు టెక్ నిపుణులు మాత్రం ఈ పేరు మార్పు వెనక ఇతర కారణాలున్నాయని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఫేస్బుక్ వివాదాలు ఎదుర్కొంటోంది. ఆ గొడవలు అటు ఇటు తిరిగి వాట్సాప్ కు కూడా వ్యాపించాయి. మరో వైపు ప్రైవసీ పాలసీ విషయంలో దుమారం రేగింది. దీంతో ఆసియా దేశాల్లో ఫేస్బుక్ పై ఓ రకమైన వ్యతిరేక భావన ఏర్పడింది. మరోవైపు యూరోపియన్ దేశాలు సంస్థ మీద భారీగా జరిమానా కూడా విధిస్తున్నాయి. వీటన్నింటి నుంచి యూజర్ల దృష్టి మారాల్చడానికి మాతృ సంస్థ పేరు మార్చేయడమే ఉత్తమమని జుకర్‌బర్గ్ భావించినట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. -
ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్..
మనం ఫోన్ తో చేసే వాయిస్ కాల్, వీడియోకాల్‌ను ఇకపై ఫేస్ బుక్ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్. ఫేస్ బుక్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు వాయిస్ - వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ను ఫేస్బుక్..'ఫేస్బుక్ మెసేంజర్'కు అటాచ్ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ మెయిన్ పేజ్‌ను క్లోజ్ చేసి మెసేంజర్‌లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్బుక్ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్ జూకర్ బెర్గ్ గుర్తించారు. అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్ బుక్ ను - ఫేస్ బుక్ మెసెంజర్ ను 2014లో వేరు చేశారు. వాయిస్ - వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఫేస్ బుక్ మెసెంజర్‌కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ డెవలప్ చేసే పనిలో పడిందని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. -
వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్
వాట్సాప్ ఏ ముహూర్తాన కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చారో అప్పటి నుంచి దరిద్రం అదృష్ట్టం పట్టినట్లు పట్టింది. ఒకవైపు తన ప్రత్యర్థి యాప్స్ అయిన సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్ లో దూసుకుపోతుంటే వాట్సాప్ మాత్రం చతికిలబడింది. ఇప్పుడు వాట్సాప్‌కు దీటుగా మళ్లీ ఒక యాప్ మార్కెట్ లోకి రాబోతుంది. రాబోయే యాప్ విదేశానికి చెందినది కాదు మన దేశానికి చెందిన కేంద్ర ప్రభుత్వం చేత తయారు చేయబడిన సందేశ్ యాప్. వాట్సాప్ లాంటి యాప్‌లతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సొంతంగా మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. సందేశ్ యాప్ నుంచి డేటాను చోరీ చేసే అవకాశాలు, గోప్యతను ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ సందేశ్ యాప్‌లో మీ పుట్టిన తేదీ, చిరునామా, మెయిల్, జాబ్ లాంటి పలు విషయాలను ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి లక్షణాలు మీరు వాట్సాప్‌లో పొందలేరు. మీరు దీనిలో లాగిన్ అవ్వడానికి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత మెయిల్ ద్వారా లాగిన కావొచ్చు. మీ బంధువులు, మిత్రులతో కూడా మెయిల్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. ఇందులో వాట్సాప్‌లో లేని చాట్‌బాట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా సందేశ్ యాప్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే Help అని టైప్ చేస్తే దాన్ని పరిష్కరించడానికి చాట్‌బాట్ సిద్ధంగా ఉంది. వాట్సాప్‌లో త్వరలో తీసుకురాబోయే లాగౌట్ ఫీచర్ ప్రస్తుతం సందేశ్ యాప్‌లో ఉంది. దీని ద్వారా సందేశ్ యాప్ నుంచి కొంతకాలం విరామం తీసుకోవచ్చు. మీరు సందేశ్ యాప్ లింకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: లక్ష కోట్లకు చేరిన బిట్‌కాయిన్ మార్కెట్ -
రూ.4 లక్షల కోట్లు దానం చేస్తాను: బిలియనీర్
సియోల్: పేదవారిని, ధనికులును తయారు చేసేది సమాజంలోని పరిస్థితులు. నిజాయతీగా కష్టపడేతత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే నైజం ఉన్న వారు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. కోటీశ్వరులవుతారు. అయితే తాము వచ్చిన దారిని వారు మర్చిపోరు. ఆ బాటలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తాము సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయడానికి కూడా వెనకాడని వారు ఉంటారు. ఎందుకంటే వారి దృష్టిలో ఆ సంపద ఈ సమాజానికి చెందినదే తప్ప వారి వారసులది కాదు. అయితే ఇలాంటి మనసున్న మారాజులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మన దేశంలో టాటా గ్రూప్, అజీం ప్రేమ్ జీ వంటి వారు ఈ వరుసలో ముందుంటారు. ఇక తాజాగా ఈ కోవలోకి మరో బిలియనీర్ చేరారు. తన సంపదలో సగానికి పైగా అంటూ సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు సమాజానికి తిరిగిచ్చేస్తానని ప్రకటించారు. ఇంతకు ఆ వ్యక్తి.. ఎవరు.. ఏంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. దక్షిణ కొరియాలో అతిపెద్ద మొబైల్ మెసెంజర్ కకావోటాక్. దీని వ్యవస్థాపకుడు కిమ్ బీమ్ సు. ఆయన సంపద 9.4 బిలియన్ డాలర్లు(6,85,55,61,00,000 రూపాయలు). ఈ మొత్తంలో నుంచి సగానికి పైగా అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు సమాజానికి ఇస్తానని ఆయన సోమవారం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కిమ్ బీమ్ సు.. ‘‘నా సందలో సగానికి కంటే ఎక్కువగా సామాజిక సమస్యల పరిష్కారం కోసం వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’’అంటూ తన కంపెనీ కకావోటాక్ ఉద్యోగులకు మెసేజ్ చేశారు. కిమ్ బీమ్ సు 2010లో కకావోకో మెసేంజర్ని ప్రారంభించారు. అనేక విశేషాలున్న ఈ యాప్‌కు దక్షిణ కొరియాలో ఎంత క్రేజ్ అంటే దేశవ్యాప్తంగా దాదాపు 90 శాతం మొబైల్ ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. మెసేంజర్, ఆన్లైన్ గేమ్స్, ఈ కామర్స్‌కు ఉపయోగపడే ఈ యాప్ వాడకం కరోనా కాలంలో ఇంకా ఎక్కువగా పెరిగింది. దాంతో లాభాలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఫోర్బ్స్ ప్రకారం కరోనా వైరస్ కాలంలో కిమ్ దేశంలోనే అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ మిలియనీర్లు బిల్ అండ్ మిలిండా గేట్స్, అలాగే వారెన్ బఫెట్ల చొరవతో ‘గివింగ్ ప్లెడ్జ్’ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఇష్టం ఉన్న బిలియనీర్లు తమ సంపదలో సగానికి పైగా విరాళం ఇవ్వడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది సంపన్నులు ఈ ప్రతిజ్ఞపై సంతకం చేసినట్లు గివింగ్ ప్లెడ్జ్ వెబ్సైట్ తెలిపింది. అయితే తూర్పు ఆసియాకు చెందిన వారు చాలా కొద్ది మంది మాత్రమే దీనిలో చేరారు. చైనా, హాంకాంగ్, తైవాన్ నుంచి చాలా కొంతమంది దాతలు మాత్రమే ఈ జాబితాలో చేరగా.. జపాన్, దక్షిణ కొరియా నుంచి ఇంత వరకు ఎవరూ లేరు. కిమ్ బీమ్ సు ప్రకటనతో ఈ జాబితాలో చేరిన తొలి దక్షిణా కొరియా దేశస్తుడిగా నిలిచారు. తన ప్రతిజ్ఞను తప్పక నేరవేరుస్తానని, తన విరాళం వివరాలపై చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని కిమ్ తెలిపారు. మూడవ త్రైమాసికంలో కకావో 120 బిలియన్ డాలర్ల లాభాలు చవి చూసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 103 శాతం పెరగడమే కాక 2020 సంవత్సరానికి రికార్డు స్థాయిలో వార్షిక లాభాలను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. చదవండి: విషాదాన్ని మిగిల్చిన కొరియన్ దేవకన్య ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ ‘కీర్తి’ కోవిడ్-19 వెంటాడినా తరగని కుబేరుల సంపద -
హైక్ మెసెంజర్ సేవలు నిలిపివేత
ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లలో మెసేజింగ్ యాప్స్ తప్పనిసరి అయ్యాయి. మొబైల్ యూజర్లు వారి కుటుంబ, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి బోలెడు యాప్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో బాగా ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్ లో "హైక్ మెసెంజర్" ఒకటి. 2012 సంవత్సరంలో హైక్ ప్రారంభించారు. అతి కొద్దీ కాలంలోనే హైక్ మెసెంజర్ ప్రజాదరణ పొందింది. కొంతకాలం తర్వాత వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చేరుకోవడంతో దీని ఆదరణ క్రమంగా తగ్గింది. హైక్ స్టిక్కర్ చాట్స్ ని అతిపెద్ద ఇండియన్ ఫ్రీవేర్, క్రాస్-ప్లాట్‌ఫాం ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ అని కూడా పిలిచేవారు. (చదవండి: ఒప్పో రెనో 5ప్రో విడుదల నేడే) 2016 ఆగష్టు నాటికి హైక్ 100 మిలియన్ల రీజిస్టర్డ్ వినియోగదారులను కలిగి ఉంది. ఇది 10 ప్రాంతీయ భారతీయ భాషలకు కూడా సపోర్ట్ లభించేది. ఒక కోటి యూజర్లను కలిగిఉన్న హైక్ సేవలను నిలిపి వేస్తున్నట్లు హైక్ మెసెంజర్ యాప్ సీఈఓ కెవిన్ భారతి మిట్టల్ ట్విట్టర్ వేదికగా జనవరి 6న ప్రకటించారు ‘స్టిక్కర్ చాట్ యాప్ జనవరి 21తో అస్తమించనుంది. మాపై నమ్మకముంచినందుకు ధన్యవాదములు. మీరంతా లేకపోతే మేమిక్కడ ఉండేవాళ్లం కాదు’ అని ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలు తేవడంతో ప్రస్తుతం అది చిక్కుల్లో పడింది.(చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. ఆఫర్లే ఆఫర్లు) ప్రస్తుతం వాట్సాప్‌కు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నప్పుడు హైక్ సంస్థ తన సేవలను ఎందుకు నిలిపివేస్తుందనే దానిపై స్పష్టత లేదు. హైక్ మెసెంజర్ యూజర్లు వారి సంభాషణలు, డేటాను యాప్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సంస్థ పేర్కొంది. అయితే, తక్షణమే ఎందుకు నిలిపివేస్తున్నారో కారణాన్ని ఇండియన్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ హైక్ వెల్లడించలేదు. హైక్ మెసేంజర్ లాంటి యాప్ లను కోరుకునే వారి కోసం వైబ్, రష్ యాప్ లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలలోనూ అందుబాటులో ఉన్నాయి. అలాగే హైక్ స్టిక్కర్లు, మోజీలు మొత్తం వైబ్, రష్ యాప్ లలో దొరుకుతున్నాయి. -
గూగుల్ మెసేజ్ లో సాంకేతిక లోపం
చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎస్ఎంఎస్ యాప్ గురుంచి పిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను మొదటగా ఆండ్రాయిడ్ సెంట్రల్ గుర్తించినట్లుగా తెలుస్తుంది. గూగుల్ యొక్క క్యారియర్ సర్వీసెస్ యాప్ ని ఆండ్రాయిడ్ ఫోన్ లో అప్డేట్ చేసినప్పుడు సమస్య వస్తుందని, ఎస్ఎంఎస్ పంపేటప్పుడు వారు దాదాపు 30 నిముషాల లాగ్స్ ఎదుర్కొంటున్నారని వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సమస్య గురుంచి రెడ్డిట్, ఇతర ఫోరమ్‌లలో చాలా ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ సమస్యకు సంబంధించి గూగుల్ లేదా స్మార్ట్‌ఫోన్ తయారీదారుల నుండి ఎటువంటి స్పందన లేదు. (చదవండి: షియోమీ మరో సంచలనం) మీరు ఈ సమస్య నుండి బయటపడటానికి మీ స్మార్ట్‌ఫోన్ నుండి గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ ని అన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా తాత్కాలికంగా పరిష్కారం లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికోసం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళాక అక్కడ మెను భాగంలో మై యాప్స్, గేమ్స్ ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యాప్స్ లో ఉన్న 'క్యారియర్ సర్వీసెస్'ని 'అన్ఇన్స్టాల్' చేయండి. మీరు ఒకటి మాత్రం గమనించాలి గూగుల్ క్యారియర్ సేవలను అన్ఇన్స్టాల్ చేసే ముందు గూగుల్ క్యారియర్ సర్వీసెస్ గూగుల్ మెసేజెస్ యాప్ లో సరికొత్త కమ్యూనికేషన్ సర్వీసెస్, ఫీచర్లను ఎనేబుల్ చేస్తుందని అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు యాప్ ని మళ్లీ ఇన్స్టాల్ చేయకపోతే మీరు ఏ క్రొత్త ఫీచర్లను భవిష్యత్ లో ఉపయోగించలేరు. ఎస్ఎంఎస్ యాప్ లో వచ్చిన సమస్యకు గూగుల్ పరిష్కరిస్తుందో చూడాలి. -
‘మానసిక సమస్యలకు స్నాప్‌చాట్ ఫీచర్’
సాక్షి, ముంబై: దేశీయ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ త్వరలో మరో కొత్తఫీచర్‌ను తీసుకురానుంది. ఇటీవల కాలంలో దేశ ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాగా దేశ ప్రజల మానసిక సమస్యలను తీర్చేందుకు స్నాప్‌చాట్ యాప్ హియర్ ఫర్ యూ ఫీచర్‌ను(మీ సమస్యలను తీర్చడానికి) త్వరలో ప్రారంభించనుంది. ఈ ఫీచర్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు పరిష్కారం మార్గాన్ని సూచిస్తుందని స్నాప్‌చాట్ యాజమాన్యం పేర్కొంది. కాగా అన్ని రకాల ఉద్యేగ నియంత్రణ, మానసిక సమస్యలకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని స్నాప్‌చాట్ యాజమాన్యం తెలిపింది. అయితే గతంలో స్నాప్‌చాట్ హెడ్‌స్పేస్ అనే ఫీచర్ ద్వారా వినియోగదారులకు మానసిక సమస్యలు, మిని మెడిటేషన్ తదితర సేవలను అందించింది. ఈ ప్రత్యేక ఫీచర్ రూపకల్పనలో చాలా అంశాలను అధ్యయనం చేసినట్లు స్నాప్‌చాట్ పేర్కొంది. (చదవండి: యూజర్లకు స్నాప్‌చాట్ క్షమాపణలు) -
మోసగాళ్లకు చెక్ : మెసెంజర్లో కొత్త ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ తన మెసెంజెర్ యాప్‌లో కొత్త భద్రతా చర్యలను ప్రారంభించింది..యూజర్లకు తెలియకుండా తెర వెనుక జరిగే మోసాలను గుర్తించి, యూజర్లను అలర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా వీటిని మనిస్తుంది. ఏదైనా అనుమానాస్పదంగా భావిస్తే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సంబందిత యూజర్ ను హెచ్చరిస్తుంది. మెసెంజర్ టెక్స్ట్ చాట్లలో సేఫ్టీ సందేశాలు పాపప్ అవుతాయని ప్రైవసీ అండ్ సేఫ్టీ నిర్వహణ డైరెక్టర్ జే సుల్లివన్ తెలిపారు. సంభాషణలను స్కామర్లు ఎవరూ వినకుండా , గమనించకుండా స్నేహితులు , ప్రియమైనవారితో సురక్షితంగా ప్రైవేటుగా కమ్యూనికేట్ చేయగలగాలన్నారు. ముఖ్యంగా మైనర్ యూజర్ల భద్రత తమకు ముఖ్యమన్నారు. సంబంధిత ఖాతారుదారుడు పంపించే మెసేజెస్, ప్రాంతం, అకౌంట్ నైజం ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ స్కామర్లను గుర్తిస్తుందని ఫేస్బుక్ తెలిపింది. అలాంటి మోసగాళ్లు పంపే సందేశాలకు స్పందించక ముందే హెచ్చరిక నోటీసులు పాపప్ అవుతాయని,దీన్ని యూజర్లుగమనించాలని పేర్కొంది. ఈ ఫీచర్ తమ మిలియన్ల యూజర్లను భారీమోసాలు, హానికరమైన చర్యలనుంచి కాపాడుతుందని ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు అందుబాటులోఉన్న ఈ ఫీచర్ వచ్చే వారం ఐఫోన్లలోని మెసెంజర్లో కూడా ప్రారంభిస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. We’re introducing a new privacy-preserving safety feature that will help millions of people avoid potentially harmful interactions and possible scams. https://t.co/ajJagpJjJ9 — Messenger (@messenger) May 21, 2020 -
ఆ నిర్ణయంతో వాట్సాప్ భద్రతకు ముప్పు
శాన్ఫ్రాన్సిస్కో: వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల చాటింగ్ మొత్తాన్నీ ఒకే యాప్‌లో చేసుకునేలా ఫేస్బుక్ తీసుకురావాలనుకుంటున్న కొత్త విధానం వల్ల వాట్సాప్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా ప్రమాణాలు తగ్గే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అన్ని సందేశాలకు వాట్సాప్ ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ అందిస్తోంది. అంటే పంపిన వ్యక్తి, పొందిన వ్యక్తి తప్ప ఈ సందేశాలను మధ్యలో ఇతరులు చదవడం అసాధ్యం. మెసెంజర్‌లోనూ ఇలాంటి సదుపాయం ఉన్నప్పటికీ, అన్ని మెసేజ్‌లకు కాకుండా, వినియోగదారులు కోరుకున్నప్పుడు మాత్రమే దీనిని ఆన్ చేసుకోవచ్చు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు ఇలాంటి ఎన్క్రిప్షన్ ఆప్షన్ లేదు. అయితే వాట్సాప్ అప్లికేషన్లోనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచీ చాటింగ్ చేసేలా సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఫేస్బుక్ చూస్తోంది. -
యాహూ మెసేంజర్‌కి ఇక గుడ్ బై
కాలిఫోర్నియా: యాహూ అభిమానులకు చేదువార్త. యాహూ మెసెంజర్ 20 ఏళ్ల ప్రస్థానానికి తెరదించుతూ యాహూ మెసేజింగ్ యాప్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని మాతృ సంస్థ ఓత్ ఐఎన్‌సీ వెల్లడించింది. ఇకపై యాహూ మెసెంజర్ పనిచేయదని ఓత్ తెలిపింది. అలాగే యాహూలో మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుందని పేర్కొంది. అయితే యాహూ మెసెంజర్ సర్వీసులు ఇకపై స్క్విరల్ (Squirrel) అనే కొత్త ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌కి మళ్లిస్తున్నట్టు తెలిపింది. అలాగే యూజర్లు తమ చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తునట్టు వెల్లడించింది. ఇందుకు ఆరు నెలల సమాయాన్ని కూడా ఇచ్చింది. https://messenger.yahoo.com/getmydata లింక్‌ను సందర్శిస్తే యూజర్లు తమ యాహూ మెసెంజర్ చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఫేస్ బుక్ మెసెంజర్ నుంచి ఇన్ స్టంట్ వీడియో..
న్యూఢిల్లీః ఫేస్ బుక్.. మెసెంజర్, ఛాట్ విండోనుంచి ఇకపై ఇన్ స్టంట్ వీడియోలు పంపే అవకాశం కల్పిస్తోంది. అందుకోసం సంస్థ.. మెసెంజర్ యాప్ లో కొత్తగా ఇన్ స్టంట్ వీడియో ఫీచర్ ను ప్రారంభించింది. ఈ నూతన ఫీచర్ తో వినియోగదారులు తమ వీడియోలను మెసెంజర్ తో పాటు.. ఛాట్ విండో నుంచి కూడా పంపే అవకాశం కల్సిస్తోంది. ఇందుకోసం ముందుగా ఛాట్ బాక్స్ లోని పై భాగంలో కుడిపక్క ఉండే వీడియో ఐకాన్ పై నొక్కితే చాలు... వీడియో కావలసిన చోటికి పంపే కొత్త అవకాశాన్ని ఫేస్ బుక్ కల్పించింది. అయితే ఈ కొత్త ఫీచర్లో వినియోగదారులు వీడియో పంపే సమయానికి ఆ వీడియోను పొందేవారి ఛాట్ విండో కూడా ఆన్ లో ఉంచాల్సి ఉంటుంది. -
ఫేస్బుక్ మెసెంజర్లో 50 కోట్ల మంది!
ఫేస్బుక్ మెసెంజర్ యాప్ అంటే మొదట్లో చాలామంది పెద్దగా ఇష్టం చూపించలేదు గానీ, క్రమంగా జనం దానికి బాగానే అలవాటు పడుతున్నారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఈ యాప్‌ను వాడుతున్నారు. గత ఏప్రిల్‌లో ఈ యాప్‌ను వాడినవాళ్ల సంఖ్య 20 కోట్లు మాత్రమే. సాధారణ ఫేస్బుక్ కాకుండా.. తాము విడుదల చేసిన మొదటి యాప్ ఇదేనని, ప్రధానంగా చాటింగ్‌ను సులభతరం చేయడానికి దీన్నిరూపొందించామని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పీటర్ మార్టినజ్జీ తన బ్లాగు పోస్టులో తెలిపారు. దాని వేగాన్ని, విశ్వసనీయతను మరింత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి రెండు వారాలకు దాన్ని మరింత మెరుగు పరుస్తున్నామని చెప్పారు. ఈ యాప్‌ను విడుదల చేస్తున్నట్లు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించారు. అప్పటినుంచి క్రమంగా దీనికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. -
ఫేస్బుక్ మెసెంజర్ అట్టర్‌ఫ్లాప్!!
కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్బుక్ మెసెంజర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పటివరకు పట్టిందల్లా బంగారంలా మారిన మార్క్ జుకెర్‌బెర్గ్‌కు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. చాలామంది యూజర్ల దగ్గరునుంచి దీనికి వ్యతిరేకంగా రివ్యూలు రావడం, విమర్శలు కూడా ఎక్కువ కావడం ఇందుకు నిదర్శనం. ఫేస్బుక్లో చాటింగ్ చేయాలన్నా, మెసేజిలు అందుకోవాలన్నా కూడా తప్పనిసరిగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందేనని ఫేస్బుక్ బలవంతం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మెసెంజర్‌కు దాదాపు 50వేల రివ్యూలు వస్తే.. దాదాపు అన్నీ కేవలం ఒకే ఒక్క స్టార్ రేటింగ్ ఇచ్చాయి. ఈ విషయాన్ని యాప్ ఆనీ అనే యాప్ ఎనలిటిక్స్ సంస్థ తెలిపింది. ఒకే పనికి రెండు యాప్‌లు ఎందుకని, ఇన్నేళ్లుగా ఎలాంటి మార్పులు లేకపోయినా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా ఎందుకు చేశారని ఓ యూజర్ యూఎస్ యాపిల్ స్టోర్‌లో తన రివ్యూ పోస్ట్ చేశారు. తనతో బలవంతంగా ఈ యాప్ డౌన్లోడ్ చేయించడం మహా చెత్తగా ఉందని మరో యూజర్ పేర్కొన్నారు.