శాన్‌ఫ్రాన్సిస్కో: వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల చాటింగ్ మొత్తాన్నీ ఒకే యాప్‌లో చేసుకునేలా ఫేస్‌బుక్ తీసుకురావాలనుకుంటున్న కొత్త విధానం వల్ల వాట్సాప్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా ప్రమాణాలు తగ్గే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అన్ని సందేశాలకు వాట్సాప్ ఎండ్–టు–ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందిస్తోంది. అంటే పంపిన వ్యక్తి, పొందిన వ్యక్తి తప్ప ఈ సందేశాలను మధ్యలో ఇతరులు చదవడం అసాధ్యం. మెసెంజర్‌లోనూ ఇలాంటి సదుపాయం ఉన్నప్పటికీ, అన్ని మెసేజ్‌లకు కాకుండా, వినియోగదారులు కోరుకున్నప్పుడు మాత్రమే దీనిని ఆన్ చేసుకోవచ్చు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు ఇలాంటి ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ లేదు. అయితే వాట్సాప్ అప్లికేషన్‌లోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచీ చాటింగ్ చేసేలా సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఫేస్‌బుక్ చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment