భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర మెటా యాజమాన్య ప్లాట్‌ఫారమ్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది.
భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటలకు మెటా యాప్స్ సర్వీసుల్లో అంతరాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు సోషల్ మీడియా నెట్‌వర్క్ ఔటేజ్ ట్రాకర్ ప్లాట్‌ఫాం డైన్ డిటెక్టర్ వెల్లడించింది.
మరోవైన తోటి సోషల్ నెట్‌వర్క్ సైట్లలో అంతరాయాలను వెక్కిరిస్తూ ఎలోన్‌మస్క్ స్పందించారు. ‘మీరు(యూజర్లు) ఈ పోస్టును చదువుతున్నారంటే మా సర్వర్లు పక్కాగా పని చేస్తున్నాయని అర్థం’ అంటూ పోస్ట్ చేశారు.
If you’re reading this post, it’s because our servers are working
— Elon Musk (@elonmusk) March 5, 2024
ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ
మెటా స్పోక్స్‌పర్సన్ ఆండీస్టోన్ స్పందిస్తూ తమ యూజర్లు మెటా యాప్స్ ద్వారా సమస్యను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
We're aware people are having trouble accessing our services. We are working on this now.
— Andy Stone (@andymstone) March 5, 2024
Comments
Please login to add a commentAdd a comment