సాక్షి, ముంబై: దేశీయ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ త్వరలో మరో కొత్తఫీచర్‌ను తీసుకురానుంది. ఇటీవల కాలంలో దేశ ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాగా దేశ ప్రజల మానసిక సమస్యలను తీర్చేందుకు స్నాప్‌చాట్ యాప్ హియర్ ఫర్ యూ ఫీచర్‌ను(మీ సమస్యలను తీర్చడానికి) త్వరలో ప్రారంభించనుంది. ఈ ఫీచర్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు పరిష్కారం మార్గాన్ని సూచిస్తుందని స్నాప్‌చాట్ యాజమాన్యం పేర్కొంది.
కాగా అన్ని రకాల ఉద్యేగ నియంత్రణ, మానసిక సమస్యలకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని స్నాప్‌చాట్ యాజమాన్యం తెలిపింది. అయితే గతంలో స్నాప్‌చాట్ హెడ్‌స్పేస్ అనే ఫీచర్ ద్వారా వినియోగదారులకు మానసిక సమస్యలు, మిని మెడిటేషన్ తదితర సేవలను అందించింది. ఈ ప్రత్యేక ఫీచర్ రూపకల్పనలో చాలా అంశాలను అధ్యయనం చేసినట్లు స్నాప్‌చాట్ పేర్కొంది. (చదవండి: యూజర్లకు స్నాప్‌చాట్ క్షమాపణలు)
Comments
Please login to add a commentAdd a comment