వాట్సాప్ ఏ ముహూర్తాన కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చారో అప్పటి నుంచి దరిద్రం అదృష్ట్టం పట్టినట్లు పట్టింది. ఒకవైపు తన ప్రత్యర్థి యాప్స్ అయిన సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్ లో దూసుకుపోతుంటే వాట్సాప్ మాత్రం చతికిలబడింది. ఇప్పుడు వాట్సాప్‌కు దీటుగా మళ్లీ ఒక యాప్ మార్కెట్ లోకి రాబోతుంది. రాబోయే యాప్ విదేశానికి చెందినది కాదు మన దేశానికి చెందిన కేంద్ర ప్రభుత్వం చేత తయారు చేయబడిన సందేశ్ యాప్. వాట్సాప్ లాంటి యాప్‌లతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సొంతంగా మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. సందేశ్ యాప్ నుంచి డేటాను చోరీ చేసే అవకాశాలు, గోప్యతను ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ సందేశ్ యాప్‌లో మీ పుట్టిన తేదీ, చిరునామా, మెయిల్, జాబ్ లాంటి పలు విషయాలను ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి లక్షణాలు మీరు వాట్సాప్‌లో పొందలేరు. మీరు దీనిలో లాగిన్ అవ్వడానికి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత మెయిల్ ద్వారా లాగిన కావొచ్చు. మీ బంధువులు, మిత్రులతో కూడా మెయిల్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. ఇందులో వాట్సాప్‌లో లేని చాట్‌బాట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా సందేశ్ యాప్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే Help అని టైప్ చేస్తే దాన్ని పరిష్కరించడానికి చాట్‌బాట్ సిద్ధంగా ఉంది. వాట్సాప్‌లో త్వరలో తీసుకురాబోయే లాగౌట్ ఫీచర్ ప్రస్తుతం సందేశ్ యాప్‌లో ఉంది. దీని ద్వారా సందేశ్ యాప్ నుంచి కొంతకాలం విరామం తీసుకోవచ్చు. మీరు సందేశ్ యాప్ లింకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment