Sandes App
-
వాట్సాప్ బదులుగా 'సందేశ్'.. లోక సభలో కేంద్రం కీలక ప్రకటన
వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తదితర ఫీచర్లతో కేంద్ర ప్రభుత్వం సందేశ్ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుంది. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్‌ను డిజైన్ చేస్తున్నాయి. పూర్తిగా స్వదేశీగా ఈ యాప్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయం తెచ్చే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఈ మేరకు కేంద్రం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనల నేపథ్యంలో కేంద్రం స్వదేశీ వాట్సాప్‌ను లాంఛ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యాప్‌కు సంబంధించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి డిజైన్ చేసిన స్వదేశీ వాట్సాప్ సందేశ్ అందరికి అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నిర్వహణ బాధ్యతలన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్న ఆయన.. వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తో పాటు ప్రభుత్వ అప్లికేషన్ ఈ యాప్ లో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే వాట్సాప్ కేవలం ఫోన్ నెంబర్‌తో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సందేశ్ యాప్ మాత్రం ఈమెయిల్ తో ఓపెన్ చేసేలా రూపొందించారు. అయితే సందేశ్ యాప్ ఎంతమేరకు ఆకట్టుకుంటుంది.? సందేశ్ తో వాట్సాప్ వినియోగం ఆగిపోతుందా? లేదా కొనసాగుతుందా? అన్న అంశం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. -
వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్
వాట్సాప్ ఏ ముహూర్తాన కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చారో అప్పటి నుంచి దరిద్రం అదృష్ట్టం పట్టినట్లు పట్టింది. ఒకవైపు తన ప్రత్యర్థి యాప్స్ అయిన సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్ లో దూసుకుపోతుంటే వాట్సాప్ మాత్రం చతికిలబడింది. ఇప్పుడు వాట్సాప్‌కు దీటుగా మళ్లీ ఒక యాప్ మార్కెట్ లోకి రాబోతుంది. రాబోయే యాప్ విదేశానికి చెందినది కాదు మన దేశానికి చెందిన కేంద్ర ప్రభుత్వం చేత తయారు చేయబడిన సందేశ్ యాప్. వాట్సాప్ లాంటి యాప్‌లతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సొంతంగా మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. సందేశ్ యాప్ నుంచి డేటాను చోరీ చేసే అవకాశాలు, గోప్యతను ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ సందేశ్ యాప్‌లో మీ పుట్టిన తేదీ, చిరునామా, మెయిల్, జాబ్ లాంటి పలు విషయాలను ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి లక్షణాలు మీరు వాట్సాప్‌లో పొందలేరు. మీరు దీనిలో లాగిన్ అవ్వడానికి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత మెయిల్ ద్వారా లాగిన కావొచ్చు. మీ బంధువులు, మిత్రులతో కూడా మెయిల్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్ అందుబాటులో లేదు. ఇందులో వాట్సాప్‌లో లేని చాట్‌బాట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా సందేశ్ యాప్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే Help అని టైప్ చేస్తే దాన్ని పరిష్కరించడానికి చాట్‌బాట్ సిద్ధంగా ఉంది. వాట్సాప్‌లో త్వరలో తీసుకురాబోయే లాగౌట్ ఫీచర్ ప్రస్తుతం సందేశ్ యాప్‌లో ఉంది. దీని ద్వారా సందేశ్ యాప్ నుంచి కొంతకాలం విరామం తీసుకోవచ్చు. మీరు సందేశ్ యాప్ లింకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: లక్ష కోట్లకు చేరిన బిట్‌కాయిన్ మార్కెట్