ముంబయి: గత నెలలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సంస్థ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం జియో పేజెస్ అనే వెబ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బ్రౌజర్ లో డేటా భద్రత, సమాచారంపై వినియోగదారులకు నియంత్రణ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు, తాజాగా జియో పేజిస్ యొక్క కొత్త వెర్షన్ 2.0.1 ను విడుదల చేసింది. ఈ వెర్షన్ లో డక్‌డక్‌గోను ఇష్టపడే వారికోసం సెర్చ్ ఇంజిన్ ను ఆడ్ చేసింది. అలాగే చిన్న వీడియోల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఫీచర్ ని తేవడంతో పాటు నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను జోడించింది. (చదవండి: పబ్‌జీ పోటీగా వస్తున్న దేశీయ ఫౌ-జీ గేమ్)
ఇప్పుడు జియోపేజ్ వినియోగదారులు డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్ ను ఇష్టపడే వారు కుడి వైపులో హాంబర్గర్ చిహ్నం(మెనూ)> సెట్టింగులు> క్విక్ సెట్టింగులు> సెర్చ్ ఇంజిన్‌ను క్లిక్ చేయడం ద్వారా డక్‌డక్‌గోను ఎంచుకోవచ్చు. డక్‌డక్‌గో అనేది గోప్యతాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సెర్చ్ ఇంజిన్. యూజర్లు బింగ్, యాహూ, గూగుల్ వంటి ఇతర సెర్చ్ ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా జియోపేజ్ ద్వారా ఉపయోగించవచ్చు. అలాగే ఈ యాప్ లో చిన్న వీడియోల కోసం ప్రత్యేక ఫీచర్ ని తీసుకురావడం మంచి విషయం. ఈ కొత్త ఫీచర్ లో 30 సెకన్ల వరకు చిన్న వీడియోలు ప్రదర్శించబడతాయి.
చిన్న వీడియోలను చూడాలనుకునే వినియోగదారులు బాటమ్ బార్> ఎక్సప్లోర్ సెక్షన్> స్క్రోల్ టూ షార్ట్ వీడియో రీల్> వ్యూ మోర్ ను ఎంచుకుంటే సరిపోతుంది. చిన్న వీడియోలలో వినోదం, జీవనశైలి, టెక్ మొదలైన కంటెంట్ లభిస్తుంది. జియోపేజ్ లో కొత్తగా నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను కూడా తీసుకొచ్చింది. జియో పేజెస్ సౌకర్యవంతమైన వీక్షణ కోసం డార్క్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. జియోపేజీ వెబ్ బ్రౌజర్ హిందీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలలో బ్రౌజ్ చేయడానికి వినియోగదారులకు సపోర్ట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment