Bingo
-
జియో పేజెస్‌లో కొత్త ఫీచర్
ముంబయి: గత నెలలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సంస్థ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం జియో పేజెస్ అనే వెబ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బ్రౌజర్ లో డేటా భద్రత, సమాచారంపై వినియోగదారులకు నియంత్రణ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు, తాజాగా జియో పేజిస్ యొక్క కొత్త వెర్షన్ 2.0.1 ను విడుదల చేసింది. ఈ వెర్షన్ లో డక్‌డక్‌గోను ఇష్టపడే వారికోసం సెర్చ్ ఇంజిన్ ను ఆడ్ చేసింది. అలాగే చిన్న వీడియోల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఫీచర్ ని తేవడంతో పాటు నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను జోడించింది. (చదవండి: పబ్జీ పోటీగా వస్తున్న దేశీయ ఫౌ-జీ గేమ్) ఇప్పుడు జియోపేజ్ వినియోగదారులు డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్ ను ఇష్టపడే వారు కుడి వైపులో హాంబర్గర్ చిహ్నం(మెనూ)> సెట్టింగులు> క్విక్ సెట్టింగులు> సెర్చ్ ఇంజిన్‌ను క్లిక్ చేయడం ద్వారా డక్‌డక్‌గోను ఎంచుకోవచ్చు. డక్‌డక్‌గో అనేది గోప్యతాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సెర్చ్ ఇంజిన్. యూజర్లు బింగ్, యాహూ, గూగుల్ వంటి ఇతర సెర్చ్ ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా జియోపేజ్ ద్వారా ఉపయోగించవచ్చు. అలాగే ఈ యాప్ లో చిన్న వీడియోల కోసం ప్రత్యేక ఫీచర్ ని తీసుకురావడం మంచి విషయం. ఈ కొత్త ఫీచర్ లో 30 సెకన్ల వరకు చిన్న వీడియోలు ప్రదర్శించబడతాయి. చిన్న వీడియోలను చూడాలనుకునే వినియోగదారులు బాటమ్ బార్> ఎక్సప్లోర్ సెక్షన్> స్క్రోల్ టూ షార్ట్ వీడియో రీల్> వ్యూ మోర్ ను ఎంచుకుంటే సరిపోతుంది. చిన్న వీడియోలలో వినోదం, జీవనశైలి, టెక్ మొదలైన కంటెంట్ లభిస్తుంది. జియోపేజ్ లో కొత్తగా నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను కూడా తీసుకొచ్చింది. జియో పేజెస్ సౌకర్యవంతమైన వీక్షణ కోసం డార్క్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. జియోపేజీ వెబ్ బ్రౌజర్ హిందీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలలో బ్రౌజ్ చేయడానికి వినియోగదారులకు సపోర్ట్ చేస్తుంది. -
బాయ్‌కాట్ బింగో.. ఐటీసీ వివరణ
రణ్వీర్ సింగ్ తాజాగా నటించిన బింగో మ్యాడ్‌యాంగిల్స్ యాడ్‌పై నెటిజనులు తీవ్రంగా విరుకుచపడిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో రణవీర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ని కించపరిచారని నెటిజనలు ఆరోపించారు. దాంతో బాయ్‌కాంట్ బింగో అంటూ రణ్‌వీర్‌ని ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఐటీసీ ఈ వివాదంపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. "బింగో మ్యాడ్ యాంగిల్స్ తాజా ప్రకటన దివంగత బాలీవుడ్ ప్రముఖుడిని ఎగతాళి చేసేలా రూపొందించారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.ఇలాంటి తప్పుడు సందేశాలు, పోస్టులకు బలైపోవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇటీవలి ప్రసారం అవుతోన్న బింగో మ్యాడ్‌యాంగిల్స్ యాడ్‌ని ఒక సంవత్సరం క్రితం అక్టోబర్ 2019 లో షూట్ చేశాం. బింగో ప్రయోగం ఆలస్యం కావడంతో ఈ ప్రకటన ఈ ఏడాది ప్రసారం అవుతోంది. కోవిడ్ కారణంగా ‘మ్యాడ్ యాంగిల్స్ చీజ్ నాచోస్ అండ్ బింగో!’ ‘మ్యాడ్ యాంగిల్స్ పిజ్జా’ లాంచ్ చేయడంలో ఆలస్యం జరిగింది" అంటూ ఐటీసీ ఫుడ్స్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. (బాయ్‌కాట్ బింగో: రణ్‌వీర్‌పై ట్రోలింగ్) ఇక బింగో మ్యాడ్ యాంగ్సిల్ ప్రకటనలో రణ్వీర్ తన తదుపరి ప్లాన్ గురించి బంధువులకు వివరిస్తూ.. పారడాక్సికల్ ఫొటాన్స్, అల్గారిథమ్స్, ఏలియన్స్.. అంటూ చెప్తూ ఇదే తన నెక్స్ట్ ప్లాన్ అని జవాబివ్వడంతో అందరూ షాక్ అవుతారు. అయితే ఈ యాడ్‌లో ఎక్కడా సుశాంత్ పేరును ప్రస్తావించలేదు. కానీ దివంగత నటుడి అభిమానులు మాత్రం సుశాంత్ మాత్రమే ఫొటాన్స్, ఏలియన్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవారని, కావాలనే ఈ యాడ్‌లో అతన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ యాడ్‌ని వెంటలనే తొలగించాలని డిమాండ్ చేశారు. -
బాయ్‌కాట్ బింగో: రణ్‌వీర్‌పై ట్రోలింగ్
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు హీరో రణ్వీర్ సింగ్ మీద ఫైర్ అవుతున్నారు. ఆయన నటించిన బింగో యాడ్‌లో సుశాంత్‌ను కించపరిచారని విమర్శిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో #BoycottBingo హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బింగోకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రణ్వీర్ చిప్స్ కోసం నటించిన కొత్త యాడ్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. అందులో రణ్వీర్ ఓ ఫంక్షన్‌కు వెళ్తారు. అక్కడి బంధువులు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అని హీరోను పదేపదే అడుగుతుంటారు. వాటికి సమాధానం చెప్పలేక, అక్కడనుంచి తప్పించుకోలేక సతమతమవుతున్న అతడికి బింగో మ్యాడ్ యాంగిల్స్ తినగానే ఓ ఐడియా వస్తుంది. (చదవండి: బాయ్‌కాట్ మీర్జాపూర్2 .. ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్) వెంటనే ఎవరికీ అర్థం కాని రీతిలో జవాబు చెప్పడం ప్రారంభిస్తారు. పారడాక్సికల్ ఫొటాన్స్, అల్గారిథమ్స్, ఏలియన్స్.. అంటూ చెప్తూ ఇదే తన నెక్స్ట్ ప్లాన్ అని జవాబివ్వడంతో అందరూ షాక్ అవుతారు. ఈ యాడ్‌లో ఎక్కడా సుశాంత్ పేరును ప్రస్తావించలేదు. అయితే సుశాంత్ మాత్రమే ఫొటాన్స్, ఏలియన్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవారని, కావాలనే ఈ యాడ్‌లో అతన్ని టార్గెట్ చేశారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో రణ్వీర్ను, బింగో యాడ్‌ను ఏకిపారేస్తున్నారు. సుశాంత్ ఆలోచనలను కించపరిచేలా ఉన్న ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: యూట్యూబర్‌కు భారీ షాక్ ఇచ్చిన అక్షయ్) 💫Paradoxical Photons of 𝕒𝕥𝕣𝕒𝕟𝕘𝕚 Algorithm! 💫E=mc2! 💫Mitramandal mai Aliens ki feelings match karni hai.. What the hell do you mean by using these terms?? 𝗠𝗮𝗸𝗶𝗻𝗴 fun of our @itsSSR 😑 𝙍𝙖𝙣𝙫𝙚𝙚𝙧 this isn't acceptable😾#BoycottBingopic.twitter.com/Y7EBeYKczK — Deepika981 (@Deepika9813) November 18, 2020 Yes boycott this ghatiya bingo! #BoycottBingo #boycottzomato #BoycottBollywood #RepublicRoar4SSR #NoSushantNoBollywood https://t.co/3yEwMALamc — Upendra Singh Rajput (@itsusrajput) November 19, 2020 #BoycottBingo #NoSushantNoBollywood https://t.co/NDwxpldSwx — WE ❤MODI (@NaYAmbre) November 19, 2020 -
పేకాటలో 'ఖాకీ'ల మాయాజాలం
సాక్షి, కర్నూలు : జిల్లాలో మట్కా, పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ కూడా ఇటీవల ఎక్కువైంది. వీటిని అరికట్టకుండా కొందరు పోలీసులు..జూదరులకు సహకరిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లతో జతకడుతున్నారు. పోలీసుల పనితీరు విషయంలో ఎస్పీ ఫక్కీరప్ప గట్టిగా వ్యవహరిస్తున్నా కొందరు ఎస్ఐలు, సీఐలు..అక్రమార్జన కోసం గాడి తప్పుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిస్తున్నారు. వీరిపై ఎస్పీకి ఇటీవల ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బనగానపల్లె సర్కిల్ విషయంలో ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ కొందరు ఎస్ఐలు ఏకంగా నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో స్టేషన్‌కు నెలకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ మామూళ్లు వస్తున్నట్లు సమాచారం. ఫలితంగా మట్కారాయుళ్లు చీటీలు రాస్తున్నా, వారు ఎక్కడ రాస్తున్నారనే కచ్చితమైన సమాచారం ఉన్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.. పంచాయితీలు ఎక్కువే.. బనగానపల్లె సర్కిల్లోని పోలీసులపై ఇతర ఆరోపణలు కూడా అధికంగానే ఉన్నాయి. చనుగొండ్ల గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందితే పంచాయితీ చేయగా.. ఎస్ఐకి రూ.60వేలు ముట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఓ రైస్‌మిల్లు వ్యాపారి చౌక బియ్యాన్ని మిల్లులోకి సన్నబియ్యంగా మార్చి ఎగుమతి చేస్తున్నారు. మిల్లు తనిఖీ చేయకుండా రూ.50వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గత నెల 17న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే కేసు నమోదైన తర్వాత సెక్షన్ మార్చేందుకు రూ.50వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రామాపురానికి చెందిన ఓ మట్కా బీటర్ నుంచి రూ.60వేలు..బనగానపల్లె సర్కిల్ కార్యాలయానికి ముట్టినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులను ఓ కానిస్టేబుల్ ద్వారా బీటర్ చేర్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మట్కా జోరు.. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఎమ్మిగనూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా మట్కా నడుస్తోంది. గతంలో రతనాల్ మట్కా.. వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు జరుగుతున్నాయి. ఈ మాట్కాకు నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి ఆన్లైన్లో వస్తాయి. ఇవి కాకుండా కర్నూలులో కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం ఐదు గంటల వరకూ చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15 గంటలకు ఓపెన్, రాత్రి 11.15 గంటలకు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతోనే మట్కా రాయుళ్లు చాలామంది సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఉత్కంఠతో వేచి చూస్తుంటారు. కర్నూలు వన్‌టౌన్, త్రీటౌన్‌లో పరిధిలో మట్కాబీటర్లు అధికం. ఇక్కడ ఎవరు మట్కా నిర్వహిస్తారు? మట్కా బీటర్లు ఎవరనే సంగతి ఇక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసు. అయినా మట్కా నిర్వహణకు బ్రేక్ వేయలేకపోతున్నారు. దీనికి కారణం ఇక్కడి పోలీసులతో ఉన్న సత్ససంబంధాలే అని తెలుస్తోంది. దీంతోపాటు టూటౌన్, ఫోర్త్ టౌన్ స్టేషన్లలో కూడా మట్కా నడుస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడి కానిస్టేబుళ్లు ఒకే స్టేషన్లో పనిచేస్తున్నారు. దీంతో బీటర్లతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. సీఐలు ఆరా తీసిన సందర్భాల్లో కానిస్టేబుళ్లు కచ్చితమైన సమాచారం కూడా స్టేషన్‌కు ఇవ్వడం లేదు. ఈ ఊబిలో కూరుకుపోయిన వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు, మహిళలు కూడా ఉన్నారు. యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్ క్రికెట్‌బెట్టింగ్ అంటే గతంలో ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలులో కూడా బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్‌సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఇండియా టీ–20 సిరీస్ మొదలైంది. దీంతో బెట్టింగ్‌రాయుళ్లు జోరు పెంచారు. ఆదివారం ఇండియా–బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌పై బెట్టింగ్ వేసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ. 25లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ ఎలక్ట్రికల్ షోరూం వ్యక్తి రూ.7లక్షల దాకా కోల్పోయారు. క్రికెట్ బెట్టింగ్ ఊబిలో స్టూడెంట్స్ కూడా చిక్కుకుపోయారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తుందని ప్రకటించడంతో చాలామంది కోచింగ్సెంటర్లకు వెళుతున్నారు. ఫీజుల పేరుతో భారీగా తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని వీరు బెట్టింగ్‌లో పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లపై పత్రికల్లో కథనాలు వచ్చినపుడు మొక్కుబడిగా కొందరిని అరెస్టు చేయడం మినహా బుకీలు, సబ్బుకీలపై పోలీసులు దృష్టి సారించడం లేదు. జిల్లాలో పేకాట కూడా జోరుగా నడుస్తోంది. క్లబ్‌ల్లో పేకాట నిషేధించడంతో వీరంతా కొన్ని ఇళ్లను అద్దెకు తీసుకుని పేకాట ఆడుతున్నారు. సుంకేసుల, ఓర్వకల్లు రాక్‌గార్డెన్, అవుకు రిజర్వాయర్ ప్రాంతాల్లో కూడా బంకీని కడుతున్నారు. చూసేవాళ్లకు విహారయాత్రకు వెళ్లినట్లు అన్పించినా వారు వెళ్లేది పేకాటకు. వీరంతా లక్ష నుంచి రూ. 2 లక్షల బ్యాంక్ వరకూ ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడంపై ఎస్పీ గట్టిగానే ఉన్నారు. చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు ధనార్జనే ధ్యేయంగా అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారు. వీరికి ఎస్పీ కళ్లెం వేయకపోతే మరింత పెరిగి, నేరాలు పెరిగే అవకాశం ఉంది. -
యానాంకు క్యూ కడుతున్న పేకాట పాపారావులు
సాక్షి, భీమవరం : జిల్లాలోని క్లబ్‌ల్లో పేకాటలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పేకాట పాపారావులు ఇప్పుడు యానాంకు క్యూ కడుతున్నారు. కాలక్షేపం కోసం ఏర్పాటు చేసుకున్న రిక్రియేషన్ క్లబ్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడడంతో.. గత రెండు నెలలుగా జిల్లాలోని క్లబ్‌లపై పోలీసుల దాడులు ముమ్మరమయ్యాయి. కొన్ని చోట్ల యూత్, కాస్మో క్లబ్‌లు, టౌన్హాళ్లలో విచ్చలవిడిగా మూడుముక్కలాట ఆడడంతో పోలీసులు వారి ఆట కట్టిస్తున్నారు. దీంతో పేకాట లేనిదే పొద్దుగడవని కొంతమంది పేకాట ఆడేందుకు పొరుగున ఉన్న కేంద్రపాలితప్రాంతం యానాంకు తరలిపోతున్నారు. గతంలో మన రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఉభయగోదావరి, కృష్టా తదితర జిల్లాల మందుబాబులు మద్యం కోసం యానాం వెళ్లేవారు. ఇప్పుడు పేకాట ఆడేందుకు ఖరీదైన కారల్లో యానాం తరలివెళ్తున్నారు. జిల్లాలో సుమారు 40 క్లబ్‌లు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం వంటి పట్టణాలతోపాటు ఏలూరులో యూత్‌క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్, టౌన్ హాల్స్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇవిగాకుండా చింతలపూడి, చేబ్రోలు, నారాయణపురం, చాగల్లు, నల్లజర్ల వంటి గ్రామాల్లో కూడా క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. క్లబ్‌ల్లో కొన్ని చోట్ల విచ్చలవిడిగా పేకాట, మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని క్లబ్‌ల్లో అధికారికంగా మద్యం విక్రయాలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల అనధికారికంగా మద్యం షాపులు నడుపుతున్నారు. సాధారణంగా క్లబ్‌లు, టౌన్‌హాల్స్‌లో కేవలం సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. దానిలో సభ్యులైన వారే ఆటలు ఆడుకునేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని క్లబ్‌ల్లో 13 ముక్కలతో సీక్వెన్స్ ఆడుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులతో పేకాట ఆడడమే కాకుండా.. కొన్నిచోట్ల వార్షికోత్సవ వేడుకల పేరిట ఆశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. మందు పార్టీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా పోలీసులు క్లబ్‌లపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తుండడంతో పేకాటరాయుళ్లు పెద్ద సంఖ్యలో యానాం పరుగులు తీస్తున్నారు. రూ.లక్షల్లో సభ్యత్వం పట్టణాల్లో ఏర్పాటుచేసే క్లబ్‌లు, టౌన్‌హాల్స్‌లో సభ్యత్వం తీసుకోవాలంటే ఆయా కమిటీలకు లక్షల్లో సొమ్ములు చెల్లించాల్సిందే. భీమవరంలో ఒక క్లబ్లో లైఫ్ సభ్యత్వం కోసం రూ. 2 లక్షలు చెల్లించాలి. డోనరైతే రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలలుగా వెలవెల పేకాట రాయుళ్లు జిల్లా వదిలి యానాం వెళ్తుండడంతో జిల్లాలోని క్లబ్‌లు, టౌన్‌హాల్స్ గత రెండు నెలలుగా వెలవెలబోతున్నాయి. ప్రధానంగా ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం వంటి క్లబ్‌ల్లో కోర్టు అనుమతించిన 13 పేక ముక్కలతోనే ఆడుతుంటారు. అయితే కొంతమంది పెద్ద మొత్తంలో డబ్బుతో విచ్చలవిడిగా పేకాట నిర్వహించడంతో జిల్లాలో క్లబ్‌ల్లో ఎలాంటి పేకాట జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీనితో క్లబ్‌లు వెలవెలబోతున్నాయి. -
33 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్..
- రూ. 21 లక్షలు స్వాధీనం టి.నర్సాపురం(పశ్చిమగోదావరి) గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న ఓ స్థావరం పై పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా టి. నర్సాపురం మండలం బండివారిగూడెంలో ఆదివారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 33 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఏడుగురు పేకాటరాయుళ్లకు రిమాండ్
పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులపై మేడిపల్లి పోలీసు లు కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పీర్జాదిగూడలో టి. సంతోష్ (29), షేక్ మనుసూర్(35), షేక్ నసీర్ హుస్సేన్(35), షేక్ హమాన్ బాషా(30), షేక్ అబ్దుల్ రహమాన్(38), బానోతు రమేష్(35), పానుగంటి మశ్చేందర్‌గౌడ్(38)లు పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ 1,00,720 నగదు, ఏడు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
కోటగిరిలో 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
కోటగిరి మండలం పొతంగల్ శివారులో సోమవారం రాత్రి పేకాటాడూతూ 16 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.34 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్థానిక ఎస్ఐ బషీర్ అహ్మద్ తెలిపారు. -
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
బోడుప్పల్ ఈదయ్యనగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈదయ్యనగర్‌లో కె. మదన్‌మోహన్‌రెడ్డి(31), జగన్‌రెడ్డి(32), బీరు శివ(28), మాధవరెడ్డి(58), పి. శ్రీనివాస్‌రెడ్డి(38), అవినాష్(22)లు పేకాట ఆడుతున్నారు. ఇది గమనించిన స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 8640లు నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
11మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
పంటపొలాల్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 38 వేల నగదు, 11 సెల్ఫోన్లతో పాటు 7 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం చింతలవారిపల్లి గ్రామ శివారులోని పంటపొలాల్లో బుధవారం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. -
పేకాడుతూ పట్టుబడ్డ కార్పొరేటర్ భర్త
విజయవాడ: ఆంధ్రప్రభ కాలనీలో ఆదివారం పేకాట శిబిరంపై దాడిచేసి కార్పొరేటర్ పైడి తులసి భర్త పైడి శ్రీనుతోపాటు మరో ఏడుగురిని సీసీఎస్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రభ కాలనీలో పేకాడుతున్నట్లు సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది. పేకాట శిబిరంపై దాడిచేసి పేకాడుతున్న కార్పొరేటర్ భర్త పైడి శ్రీను, పలు పార్టీలకు చెందిన నాయకులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 56,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిని సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి పైడి శ్రీను, కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి వెంకట్రావు, దండా శ్రీను, ఒర్సు సుందరరావు, సీహెచ్ మల్లేశ్వరరావు, బొమ్మారెడ్డి వెంకట నరసింహారెడ్డి, గడ్డం ప్రసాద్, సాము మనుకుమార్‌లను అరెస్టు చేశారు. -
రోజుకో చోట.. వారానికో కోట
నగర శివారులోని ఆరు గ్రామాల్లో నిత్యం పేకాట వారానికో స్థావరం మారుస్తున్న నిర్వాహకులు రామవరప్పాడు పొలాల్లో నిత్యం రూ.50 లక్షలపైనే ఆట చోటా టీడీపీ నేతలే నిర్వాహకులు విజయవాడ : విజయవాడ నగర శివారు పేకాట శిబిరాలకు అడ్డాగా మారింది. మొబైల్ పేకాట కేంద్రాలు తెరిచి రోజుకోచోట, వారానికో ఇంట్లో భారీ శిబిరాలు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు, పేకాట రాయుళ్లు అత్యధిక శాతం మంది అధికార పార్టీకి చెందినవారే ఉండటంతో పేకాట దందా యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా విజయవాడ నగర శివారులోని ఆరు గ్రామాలు పేకాట కేంద్రాలుగా మారిపోయాయి. ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో దందా సాగుతుండటం గమనార్హం. నిర్వాహకుల వివరాలు చిరునామాలు సహా తెలిసినా కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మాత్రం స్పందించటం లేదు. రాత్రివేళల్లో నిర్వహణ... రామవరప్పాడు, నిడమానూరు, గోశాల, గొడవర్రు, వణుకూరు, ఆగిరిపల్లి, గన్నవరం ప్రాంతాల్లో శిబిరాల నిర్వహణ భారీగా సాగుతోంది. ముఖ్యంగా రామవరప్పాడు, గుణదల సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్, సమీపంలో ఉన్న పొలాల్లో ఎక్కువగా నిర్వహిస్తున్నారు. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు రమ్మీ ఆట నిర్వహిస్తూ రోజుకు రూ.50 లక్షలకు పైగానే ఆట సాగిస్తున్నారు. వర్షం పడిన రోజు మినహా మిగిలిన అన్ని రోజుల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు, మళ్లీ 12 నుంచి ఉదయం 6 గంటల వరకు శిబిరాలు కొనసాగుతున్నాయి. విజయవాడ నగరంలోని పేకాట శిబిరాల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు తరచూ జరుగుతున్న క్రమంలో శివారు గ్రామాల్లో నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. తాడిగడపకు చెందిన పేకాట శ్రీను, గొడవర్రు, గోశాల, వణుకూరు గ్రామాలకు చెందిన పేకాట నిర్వాహకులు మొబైల్ స్థావరాలకు తెరతీశారు. నిర్వాహకులందరూ అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో రోజుకోచోట శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. కనీసం వారానికి ఒక ఇంట్లో ఏర్పాటు చేసి శిబిరాలను కొనసాగిస్తున్నారు. పేకాటకు వచ్చేవారి ఫోన్ నంబర్లన్నీ ముందుగా సేకరించి పేకాట నిర్వహించే స్థావరం, చిరునామాను మెసేజ్ ద్వారా లేక ఫోన్ చేసి సమాచారం అందిస్తారు. దీంతో పేకాట రాయుళ్లు నేరుగా శిబిరానికి వెళుతున్నారు. రెండు రోజుల క్రితం గురునానక్ కాలనీలో భారీ పేకాట శిబిరాన్ని పోలీసులు పట్టుకున్నారు. శివారు గ్రామాలకు చెందిన నిర్వాహకులు వారం రోజుల కోసం గురునానక్ కాలనీలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల దాడిలో రూ.7.50 లక్షల వరకు నగదు, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కాసరనేని మురళితో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహాలో భారీ పేకాట శిబిరాలను పోలీసులు గుర్తించి నిందితులను అరెస్టు చేసిన క్రమంలో తాడిగడపకు చెందిన ఎంపీటీసీ, విజయవాడ నగరానికి చెందిన కార్పొరేటర్ ఒకరు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. ఇదే తరహాలో గతంలో అనేక మంది పట్టుబడ్డా శిబిరాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు కూడా పేకాట నిర్వాహకులపై కా కుండా పేకాటరాయుళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు. ఎస్బీ పోలీసులకు అన్నీ తెలిసినా... కమిషనరేట్‌లోని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పేకాట నిర్వాహకుల గురించి సమాచారం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట శిబిరాలు సాగుతుండటంతో పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిర్వాహకులు రోజుకు సగటున రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున సంపాదిస్తూ స్థానిక స్టేషన్లలో నెలవారీ కూడా చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ ఆరోపణలపై గతంలో కమిషనరేట్ పరిధిలోని సీఐలను పెద్ద సంఖ్యలో కమిషనర్ బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు పేకాట నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు కూడా నిర్వాహకులను ప్రతిసారీ తప్పించి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. సీపీకి ఫిర్యాదు వచ్చి స్పందిస్తేకానీ పోలీసులు పూర్తిస్థాయిలో స్పందించని పరిస్థితి నెలకొంది. -
కోడే గెలిచింది!
జిల్లా అంతటా కోడిపందేల బరులు, పేకాట శిబిరాల ఏర్పాటు పలుచోట్ల పందేలు {పారంభించిన ప్రజాప్రతినిధులు చేతులు మారిన కోట్లాది రూపాయలు సంక్రాంతి సంప్రదాయం ముసుగులో పందెం కోళ్లు కత్తులు దూశాయి. కోడిపందేల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి పందెంరాయుళ్లు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ ఏర్పాటుచేసిన బరుల్లో కోలాహలం నెలకొంది. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. దాదాపు ప్రతిచోటా అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ముందుండి కోడిపందేలను ప్రారంభించారు. మచిలీపట్నం : జిల్లావ్యాప్తంగా కోడిపందేల బరులు, పేకాట శిబిరాలు కిటకిటలాడాయి. కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోటలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పెడన మండలం కొంకేపూడిలో ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, పామర్రు మండలం కొమరవోలులో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య కోడిపందేలను ప్రారంభించారు. జిల్లా నలుమూలలా పెద్ద ఎత్తున బరులను ఏర్పాటు చేశారు. బరుల వద్దే బెల్టు షాపులను పెట్టారు. పందెంరాయుళ్ల కోసం రెస్టారెంట్లను ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించారు. ఈ బరుల్లో పేకాట, చిన్నబజార్, పెద్దబజార్ పెద్దఎత్తున నిర్వహించారు. భోగి రోజున ప్రారంభమైన ఈ బరులు మూడు రోజులపాటు కొనసాగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం రాత్రే పోటీలను ప్రారంభించారు. వణుకూరులో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కోడిపందేలను ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో పెద్దఎత్తున బరి ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం ఏడు గంటలకు కోడిపందేలు, పేకాటను ప్రారంభించారు. బెల్టుషాపుతో పాటు రెస్టారెంట్లను ఇక్కడే నిర్వహించారు. పేకాట, కోడిపందేల కోసం మూడేసి శిబిరాలను నిర్వహించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయిలో కోడిపందేలు జోరుగా కొనసాగాయి. పామర్రు నియోజకవర్గంలోని యలకుర్రు, కొమరవోలు, కనుమూరు ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాటలు జరగగా లక్షలాది రూపాయలు చేతులు మారాయి. మైలవరం మండలంలో నాగులేరు, జి.కొం డూరు మండలంలోని వెలగలేరు, ఇబ్రహీంపట్నంలో భారీస్థాయిలో బరులను ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలో జనార్దనవరం, పోతిరెడ్డిపాలెం, జంగంగూడెం, ఈదర, శోభనాపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గంలో కొల్లేటికోట, భుజబలపట్నం, భైరవపట్నం, కలిదిండి మండలం నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. పెడన, తిరువూరు నియోజకవర్గాల్లోనూ బరులు, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. -
‘పేకాట’ పైనా పీడీ యాక్ట్!
మోసం కోణాన్ని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ నిర్వాహకులపై చీటింగ్ కేసుల నమోదు పీడీ యాక్ట్ ప్రయోగానికీ అవకాశం రంగం సిద్ధం చేస్తున్న ఎస్బీలోని {పత్యేక సెల్ సిటీబ్యూరో: నగరంలో పేద, మధ్య తరగతి కుటుంబాలను కూలుస్తున్న పేకాటపై ఉక్కుపాదం మోపడానికి సిటీ కాప్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ శిబిరాలను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటి వరకు అవకాశం చిక్కలేదు. దీంతో లోతుగా ఆరా తీసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ‘మోసం’ కోణం గుర్తించారు. దీని ఆధారంగా కీలక వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సిటీలో ఒకప్పుడు దాదాపు 15 వరకు ప్రముఖ, అనుమతులు ఉన్న క్లబ్బులు ఉండేవి. వీటివల్ల జరుగుతున్న దారుణాలు, కూలిపోతున్న కుటుంబాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం పేకాట క్లబ్బుల్ని బ్యాన్ చేసింది. మొదలైన స్థానిక ‘శిబిరాలు’... నగరంలోని క్లబ్బులు మూతపడటంతో పేకాటరాయుళ్లు ప్రత్యామ్నాయాల కోసం వెతికారు. ఇలాంటి వారి బల హీనతల్ని క్యాష్ చేసుకోవడానికి స్థానికంగా పేకాట శిబి రాలు పట్టుకొచ్చాయి. ఒకప్పుడు క్లబ్బులకు వెళ్లి ఆడినవాళ్లు, పేకాటరాయుళ్లతో పరిచయం ఉన్న వ్యక్తులు తమ ఇళ్లు, పరిచయస్తుల ప్రాంగణాలను మినీ క్లబ్బులుగా మార్చేశారు. గరిష్టంగా పది మంది పరిచయస్తులు, వారి ద్వారా వచ్చే వారికి ‘ఆశ్రయం’ ఇస్తూ పేకాట ఆడిస్తున్నారు. ఇలాంటి వాటికి వెళ్తున్నది, బలవుతున్నది ఎక్కువగా పేద, దిగువ మధ్య తరగతి వారే. సాధారణ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ వంటి ప్రత్యేక బృందాలు సైతం సమాచారం అందినప్పుడల్లా దాడులు చేసి నిర్వాహకులతో పాటు పేకాటాడుతున్న వారినీ అరెస్టు చేస్తున్నాయి. మోసం’..... పేకాట ఆడుతూ చిక్కిన, శిబిరాలు నిర్వహిస్తున్న వారిపై ఇప్పటి వరకు పోలీసులు గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, వారికి తేలిగ్గా బెయిల్ దొరకడంతో ప్లేసులు మార్చి మళ్లీ తమ పంథా కొనసాగి స్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్తేనే పేకాట శిబిరాల కు అడ్డుకట్ట వేయొచ్చని భావించిన టాస్క్‌ఫోర్స్ పోలీ సు లు పలు కేసుల్ని లోతుగా పరిశీలించారు. ఈ నేపథ్యం లోనే నిర్వాహకుల మోసం కోణం వెలుగులోకి వచ్చింది. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న వారు పేకాట రాయుళ్లను ఆకర్షిస్తున్నప్పుడు ఉచితంగా ఆడుకోమని చెప్పి.. ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని, తమ వద్ద పెట్టుకుని ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు పేకాటరాయుళ్లపై నమోదు చేస్తున్న మాది రి గానే నిర్వాహకుల పైనా గేమింగ్ యాక్ట్ కింద కేసు నమో దు చేయడంతో పాటు చీటింగ్ సెక్షన్‌ను జోడిస్తున్నారు. పీడీ యాక్ట్ ప్రయోగానికి అవకాశం... ఇటీవల బంజారాహిల్స్ పరిధిలోని కమలాపురి కాలనీ లో, ఆదివారం లంగర్‌హౌస్ పరిధిలో పట్టుబడిని రెండు కేసుల్లోనూ చీటింగ్ సెక్షన్ చేర్చారు. ఈ రెండింటిలోనూ నిర్వాహకులుగా ఉన్న నాగేంద్రబాబు, అంజద్ అహ్మద్ ఖాన్‌లపై ఈ ఆరోపణలు చేశారు. గేమింగ్ యాక్ట్ కింద అరెస్టు అయిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం లేదు. అయితే ఈ రెండు కేసుల్లోనూ చీటింగ్ సెక్షన్ నమోదుతో ఆ అవకాశం ఏర్పడింది. దీంతో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి అవసరమైన సన్నాహాలను స్పెషల్ బ్రాంచ్ ఆధీనంలోని పీడీ సెల్ చేస్తోంది. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే స్థాని కంగా వెలుస్తున్న పేకాట శిబిరాలను కట్టడి చేయొచ్చని, అప్పుడే అనేక కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
హైటెక్ పేకాట
మహబూబ్‌నగర్ క్రైం: చట్ట విరుద్దంగా ని ర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 12 మందిని అదపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 20.51 లక్షల నగదు స్వాధా నం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ కృష్ణమూర్తి తన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరులతో సమావేశంలో వివరాలు వెల్లడించారు. భూత్పూర్ మం డల పరిధిలోని వాల్యానాయక్ తాండాలోని యాదమ్మ అనే మహిళ ఇంట్లో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం తెల్లవారుజామున రూరల్ సీఐ గిరిబా బు, మహబూబ్‌నగర్ రూరల్ సీఐ శ్రీని వాసులు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీ సులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న అస్లామ్ఖాన్, ఎల్లాగౌడ్, కృష్ణ,రామాంజనేయులు, వీర య్య, శేఖర్, బాల్‌రాజు, యాదగిరి, లవకుమార్, నాగరాజు, లక్ష్మినారాయణల ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ. 36 వేల నగదు, 3 మో టార్ సైకిళ్లు ఒక ఇండిగో కారు, 12 సెల్ఫోన్లు, 53 ప్లాస్టిక్ కాయిన్స్, రెండు సెట్ల పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పేకాట క్లబ్‌ను నిర్వహిస్తున్న భగీరథకాలనీకి చెందిన సిరిగిరి శ్రీనివాస్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకుని రూ. 20.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మ రో కొందరి నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకేనేందుకు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఎస్ఐలు రాజేశ్వర్‌గౌడ్, లక్ష్మారెడ్డిలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. హైటెక్ తరహాలో పేకాట.... ప్రధాన సూత్రధారి సిరిగిరి శ్రీనివాసులు గత కొన్నేళ్లుగా పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. పేకాట ఆడే వారు ముందుగానే అతడిని కలిసి ఆడబోయే మొత్తానికి సంబందించి నగదు అందజేస్తే అతను వాటికి బదులుగా కాయిన్లు అందజేస్తాడు. గెలిచిన వారు కాయిన్లు తీసుకుని నిర్వాహకుడు సూచించిన ప్రాంతానికి వెళితే వాటిని మార్చి నగదు అందజేస్తారు. ఎవరికి అనుమానరాకుండా కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కోడి పందాలాడితే పేకాట కేసు
ఫిర్యాదు చేసినా పట్టని పోలీసులు రెండోసారి ఫిర్యాదు చేశాక స్పందన పదిమందిపై పేకాట కేసు నమోదు కోడిపందాలాడినా స్పందించని వైనం పలుకుబడి ఉన్న పెద్దలంతా కార్లలో దిగారు. రూ.లక్షల్లో కోడిపందాలు, పేకాట ఆడారు. ఎవరో ఫోన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చేరుకున్నారు. మూడు కోళ్లను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. ఈసారి ఫిర్యాదు పోలీసు ఉన్నతాధికారులకు వెళ్లింది. మళ్లీ పోలీసులు వచ్చారు. పదిమందిపై పేకాట కేసు పెట్టి తీసుకెళ్లారు. పలుకుబడి గల వ్యక్తులు కావడంతో పేకాట కేసు పెట్టి అయిందనిపించారు. ఆద్యంతం నాటకీయంగా సాగిన ఈ వ్యవహారానికి వేదిక పాల్మన్‌పేట ప్రాంతంలోని రామాంజనేయ హేచరీ. పాయకరావుపేట: పాల్మన్‌పేట ప్రాంతంలోని హేచరీ వద్ద మంగళవారం ఉదయం కోడి పందాలు, పేకాట ప్రారంభమయ్యాయి. విజయవాడ, గుంటూరు, అమలాపురం, కాకినాడ, యానాం, తుని ప్రాంతాలనుంచి కోడి పందాలు, పేకాట ఆడేందుకు పందెం రాయుళ్లు కార్లతో చేరుకున్నారు. ఉదయం నుంచి 11 గంటల సమయానికి సుమారు రూ.40 నుంచి రూ.50 లక్షలు చేతులు మారినట్టు ఆ ప్రాంత మత్స్యకారులు చెబుతున్నారు. హేచరీలో పందాలు జరుగుతున్నాయని ఉదయం 8 గంటల సమయంలో ఆ ప్రాంత యువకులు కొందరు ఫోన్లో పాయకరావుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 11 గంటల ప్రాంతానికి పోలీసులు అక్కడికి చేరుకుని హేచరీ ప్రాంతంలోని మూడు పందెం కోళ్లను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చేశారు తప్ప ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ప్రముఖులు కావడం వల్లే... దీంతో ఆ ప్రాంతీయులు మరల జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నక్కపల్లి పోలీసులు దాడులు జరిపి పది మందిని పట్టుకుని నక్కపల్లి తీసుకెళ్లారు.నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో పాయకరావుపేట పోలీసులు ఆ పది మందిపై పేకాట కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులకు పట్టుబడ్డ పదిమందిలో పలుకుబడిగల వ్యక్తులు ఉండటంతో కోడిపందాలు ఆడుతున్నా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. పదిమంది పేకాటరాయుళ్ల నుంచి రూ.3,61,200 స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వేగేశ్వరి సత్యనారాయణరాజు, పెనుమచ్చ పెద్దిరాజు, కె.సత్యనారాయణ, పి.వెంకట్రావు, వి.పల్లంరాజు, సిహెచ్.సురేష్‌వర్మ, పి.రంగరాజు, కె.సూర్యనారాయణ, యడ్ల శంకర్, కాకి రమేష్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇదీ ఆటంటే!
కర్నూలు: తిమ్మిని బమ్మి చేయడం.. బమ్మిని తిమ్మి చేయడంలో పోలీసులు సిద్ధహస్తులు. కేసులో ఇరికించాలన్నా.. బయటపడేయాలన్నా వీరికి వెన్నెతో పెట్టిన విద్య. అంతే కాదు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలోనూ నేర్పరులే. ఈ కోవలోనే ఓ సారు పేకాట సొమ్ములో చేతివాటం చూపారు. గార్గేయపురం శివారులోని రాంపురం కొత్తూరు రోడ్డు సమీప పొలాల్లో పేకాట ఆడుతుండగా ఆదివారం మధ్యాహ్నం తాలూకా ఎస్ఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి రూ.28,350 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే తమ వద్ద భారీగానే నొక్కేసినట్లు ఆటగాళ్లు చెబుతుండటం గమనార్హం. వాస్తవంగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది పేకాట ముగించుకుని వస్తుండగా గార్గేయపురం మలుపు వద్ద పోలీసులు కాపు కాసి అదుపులోకి తీసుకుని వారి నుంచి డబ్బు లాక్కున్నారు. పేకాటరాయుళ్లలో ఒకరిచ్చిన సమాచారం మేరకు తొమ్మిది మంది వద్ద భారీ మొత్తంలో డబ్బు నొక్కేశారు. కర్నూలులోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన సుబ్బారెడ్డి పేకాట ముగించుకుని మరో మార్గంలో కర్నూలు చేరుకున్నాడు. అదే కాలనీకి చెందిన గోపాల్ మోటార్ సైకిల్‌పై వస్తూ గార్గేయపురం మలుపు వద్ద పోలీసులకు చిక్కాడు. అతని ద్వారా సుబ్బారెడ్డి పేకాటలో పాల్గొన్నట్లు తెలుసుకుని పోలీసులు కర్నూలులోని అతని ఇంటికి వెళ్లి అర్ధరాత్రి హల్చల్ చేశారు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, బీరువా తెరిపించి.. అందులోని రూ.47వేలు లాక్కున్నట్లు సమాచారం. పేకాటలో గెలిచిన డబ్బు కాదు సార్.. ముఖ్యమైన పని కోసం ఏటీఎంలో డ్రా చేశానని, కావాలంటే సీరియన్ నెంబర్లు చూసుకోండని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. అదేవిధంగా బోదెపాడు శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.20వేలు నొక్కేసి కేసు పెట్టకుండా వదిలేశారు. ధనుంజయరాజ్ నుంచి రూ.26వేలు, బసవరాజు నుంచి రూ.18వేలు, గోపాల్ నుంచి రూ.8వేలు, జనార్దన్ నుంచి రూ.30వేలు, రఘునాథరెడ్డి నుంచి రూ.9వేలు వసూలు చేసుకుని కేసులు నమోదు చేశారు. పలుకూరు గ్రామానికి చెందిన మరికొందరు పేకాట ఆడేందుకు కారులో వస్తుండగా వెంకాయపల్లె వద్ద అడ్డుకుని రూ.50వేల వరకు నొక్కేసినట్లు బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు జంకుతున్నారు. ఈ విషయంపై ఎస్ఐ విజయభాస్కర్‌ను వివరణ కోరగా ‘అదంతా ఫేక్. మీరు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దు. గత వారంలో తాండ్రపాడు వద్ద పేకాటరాయుళ్లపై దాడి చేసి పట్టుకోగా కొందరు విలేకరులు అక్కడికొచ్చారు. సార్.. రూ.6 లక్షలు దొరికాయట కదా.. అని అడిగారు. అది కూడా తప్పుడు ప్రచారమే. గార్గేయపురం వద్ద తొమ్మిది మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద రూ.28,350 మాత్రమే స్వాధీనం చేసుకున్నాం.’ అని తెలిపారు.