మహబూబ్‌నగర్ క్రైం: చట్ట విరుద్దంగా ని ర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 12 మందిని అదపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 20.51 లక్షల నగదు స్వాధా నం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ కృష్ణమూర్తి తన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరులతో సమావేశంలో వివరాలు వెల్లడించారు. భూత్పూర్ మం డల పరిధిలోని వాల్యానాయక్ తాండాలోని యాదమ్మ అనే మహిళ ఇంట్లో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం తెల్లవారుజామున రూరల్ సీఐ గిరిబా బు, మహబూబ్‌నగర్ రూరల్ సీఐ శ్రీని వాసులు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీ సులు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న అస్లామ్‌ఖాన్, ఎల్లాగౌడ్, కృష్ణ,రామాంజనేయులు, వీర య్య, శేఖర్, బాల్‌రాజు, యాదగిరి, లవకుమార్, నాగరాజు, లక్ష్మినారాయణల ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ. 36 వేల నగదు, 3 మో టార్ సైకిళ్లు ఒక ఇండిగో కారు, 12 సెల్‌ఫోన్లు, 53 ప్లాస్టిక్ కాయిన్స్, రెండు సెట్ల పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ పేకాట క్లబ్‌ను నిర్వహిస్తున్న భగీరథకాలనీకి చెందిన సిరిగిరి శ్రీనివాస్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకుని రూ. 20.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మ రో కొందరి నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకేనేందుకు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు రాజేశ్వర్‌గౌడ్, లక్ష్మారెడ్డిలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
హైటెక్ తరహాలో పేకాట....
ప్రధాన సూత్రధారి సిరిగిరి శ్రీనివాసులు గత కొన్నేళ్లుగా పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. పేకాట ఆడే వారు ముందుగానే అతడిని కలిసి ఆడబోయే మొత్తానికి సంబందించి నగదు అందజేస్తే అతను వాటికి బదులుగా కాయిన్‌లు అందజేస్తాడు. గెలిచిన వారు కాయిన్లు తీసుకుని నిర్వాహకుడు సూచించిన ప్రాంతానికి వెళితే వాటిని మార్చి నగదు అందజేస్తారు. ఎవరికి అనుమానరాకుండా కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
హైటెక్ పేకాట
Published Mon, Jan 12 2015 4:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement