lightning strikes
-
తెలుగు రాష్ట్రాలపై ‘పిడుగు’ పంజా
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో పిడుగు పంజాతో పలువురు మరణించగా.. తీవ్రంగా గాయపడి పలువురు చికిత్స పొందుతున్నారు.మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ధనురా గ్రామం లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. గ్రామ చెరువు దగ్గర గొర్రెలను మేపుతుండగా.. ఇద్దరిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే వాళ్లు మృతి చెందారు. మరణించిన వాళ్లను బండారు బేతయ్య(48), డాకూరి భరత్ (14) బండారు బేతయ్య (48)గా గుర్తించారు.వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కాల్ నాయక్ తండాలో పిడుగు పాటుకు యువకుడు కొర్ర నాగరాజు(28) మృతి చెందాడు.హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.ఇక ఏపీ విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సూర్యరావు పాలెం గ్రామంలో పిడుగు పంజా విసిరింది. బాణాసంచా తయారీ కేంద్రం పిడుగుపడడం.. షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో అక్కడ పని చేసే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు..తిరుమలలో కుండపోత వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనం అనంతరం వసతి గృహాలకు వెళ్లే క్రమంలోనూ భక్తులు తడిచిముద్దైయ్యారు. అలాగే.. లోతట్టు ప్రాంతాలలో వర్షపు చేరింది. ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహన దారులను జాగ్రత్తగా వెళ్లాలంటు సిబ్బంది సూచిస్తున్నారు. మరోవైపు చలి తీవ్రత కూడా ఎక్కవగా ఉండటంతో భక్తులకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది.ఇక.. గుంటూరు, పల్నాడు జిల్లాలోనూ వర్షం కురిసింది. అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇరు రాష్ట్రాల్లోని మిగతా చోట్ల పిడుగు నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగానే నవంబర్ 1వ తేదీ దాకా.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. -
వణికించిన పిడుగులు!
నాగర్‌కర్నూల్ (బిజినేపల్లి)/వనపర్తి రూరల్/ న్యాల్కల్ (జహీరాబాద్): రాష్ట్రంలో పిడుగుల ధాటికి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు నక్క నీలమ్మ (40) తన అక్క నాగేంద్రమ్మతో కలిసి గేదెలను మేత కోసం తీసుకెళ్లారు. మధ్యాహ్నం వర్షం పడుతుండటంతో నీలమ్మ చెట్టు కిందికి వెళ్లగా.. పిడుగుపడింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. నీలమ్మ అక్క నాగేంద్రమ్మ పిడుగుపాటుకు స్పృహ కోల్పోయింది.మరో ఘటనలో వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన పద్మమ్మ (40) ఆదివారం ఉదయం గొర్లను మేతకు తీసుకొని నల్లగుట్టకు వెళ్లింది. సాయంత్రం పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం న్యామతాబాద్ గ్రామానికి చెందిన ఏసప్ప భార్య బూచినెల్లి నాగమ్మ (42) శనివారం పొలానికి వెళ్లింది. సాయంత్రం గాలి వాన రావడంతో ఇంటికి బయలుదేరగా, గ్రామ సమీపంలో పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. దీంతో నాగమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు బీదర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
Israel-Hamas war: 25,000 దాటిన గాజా మృతులు
రఫా(గాజా స్ట్రిప్): తమతమ మతసంబంధ పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం ఘర్షణలతో మొదలై మెరుపు దాడులతో తీవ్రతరమై మహోగ్రరూపం దాలి్చన హమాస్– ఇజ్రాయెల్ పోరు పాతికవేల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. మరోవైపు వంద మందికిపైగా బందీలను విడిపించుకున్నాసరే అందర్నీ విడిపిస్తామని, హమాస్ సభ్యులందర్నీ హతమారుస్తామని ఇజ్రాయెల్ సేనల ప్రతినబూనడం చూస్తుంటే యుద్ధ బాధితులు, మరణాల సంఖ్య ఇక్కడితో ఆగేలా లేదు. యుద్ధం ఇంకొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులు తాజాగా ప్రకటించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా బందీలను విడిపించలేకపోవడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు ప్రదర్శలు పెరిగాయి. -
అకాల వర్షాలు.. పిడుగులు పడి 20 మంది మృత్యువాత
దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనేకచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 20 మంది మృత్యువాత పడ్డారు. దాహోద్ జిల్లాలో నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు, అహ్మదాబాద్, అమ్రేలీ, సూరత్, సురేంద్ర నగర్, దేవ్‌భూమి ద్వారక, బనస్కాంత, బోతాడ్, ఖేదా, మెహసానా, పంచమహల్, సబర్కాంత ప్రాంతాల్లో ఒక్కరు చొప్పున పిడుగులు పడి మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని మొత్తం 252 తాలూకాలలో 234 తాలూకాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడినట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం (SEOC) వెల్లడించింది. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్, అమ్రేలి వంటి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కేవలం 16 గంటల్లో 50 నుంచి 117 మిమీ వాన నమోదైంది. ఈశాన్య అరేబియా సముద్రంపై తుఫాను సర్క్యులేషన్ ఉందని, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలపై దాని ప్రభావాన్ని విస్తరించిందని ఐఎండీ తెలిపింది. గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షంతో పలువురు మృతి చెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు ట్విటర్లో తెలిపారు. చదవండి: అతిపెద్ద టైగర్ రిజర్వ్! ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે અનેક લોકોના મોતના સમાચારથી ખૂબ જ દુઃખ અનુભવુ છું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની ન પૂરી શકાય તેવી ખોટ પર હું તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત કાર્યમાં… — Amit Shah (@AmitShah) November 26, 2023 -
దసరా దావత్లో విషాదం: మద్యం తాగుతుండగా పిడుగు పడి ముగ్గురి మృతి
సాక్షి, వరంగల్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దసరా పండుగ సందర్భంగా జఫర్గడ్ మండలం సాగరం శివారులోని గుట్టవద్ద దావత్ చేసుకుంటుండగా పెద్దశబ్దంతో మర్రిచెట్టుపై పడ్డ పిడుగుతో ముగ్గురు మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామానికి చెందిన నేరెల్లి శివ, మరుపట్ల సాంబరాజు, జెట్టబోయిన సాయికృష్ణగా గుర్తించారు. చదవండి: డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లా గార్లలో పిడుగుపాటుకు ఎముల సంపత్ అనే వ్యక్తి మృతి చెందాడు.మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
-
అకాల వానలు, పిడుగులు.. ఆ సమయాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వేసవే అయినా మబ్బులు భయపెడుతున్నాయి. అకాల వానలతో పాటు పిడుగులు ప్రాణాలను బలికొంటున్నాయి. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమని వైద్యులు, వాతావరణ వేత్తలు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో బయట పనులకు వెళ్లేవారు, పొలంలో పనిచేసే రైతులు, ఉపాధి వేతనదారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏం చేయకూడదు..? ►జోరు వాన కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదు. ►ఉరుములు, మెరుపుల సమయాల్లో పొలాల్లో ఉండకూడదు. ►మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లే దా అంతకంటే తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలో పిడుగుపడే అవకాశముంది. ►మెరుపు కనపడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లకపోవడం మేలు. ►గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్ ఉంటే స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ►వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండరాదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. ►గుండె సంబంధిత వ్యా«ధులు ఉన్నవారు మె రుపులు, ఉరుములతో భయాందోళనకు గురవుతారు. ఇలాంటి వారు ఇళ్లలో ఉండడం మేలు. ఇలా చేయండి... ఆమదాలవలస: పిడుగు పాటుపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమదాలవలస డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.జగన్నాథరావు సూ చించారు. మేఘం నల్లబడే సమయంలో పొలాల్లో, ఆరుబయట ఎవరూ ఉండకూడదని వెంటనే దగ్గరలో ఉన్న షెల్టర్‌లోకి చేరుకోవాలని సూచించారు. ము ఖ్యంగా భారీ చెట్లు, తాటిచెట్టు, ఈత చెట్టు వంటి వాటి కిందకు వెళ్లకూడదన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో గొడుగు కూడా వేసుకొని బహిరంగ ప్ర దేశాల్లోకి వెళ్తే వారిపై పిడుగు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. గ త్యంతరం లేని పరిస్థితుల్లో పొలంలో ఉండిపోతే వెంటే ఎలాంటి చెట్లు లేని దగ్గర కాళ్ల ముడుకులు గుండె భాగానికి తగిలేలా కూర్చుని, చెవులు రెండు చేతులతో మూసుకొని కూర్చుంటే 80 శాతం రక్షణ పొందవచ్చునని తెలిపారు. ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను ఒక అడుగు పైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి. – యండ భవ్యశ్రీ, వైద్యాధికారి, సరుబుజ్జిలి చదవండి: ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే..ఇప్పుడు కర్మాగారాల ఖిల్లా! -
Adilabad: పిడుగుల వాన.. ముగ్గురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పిడుగులతో దద్దరిల్లింది. జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బనియా గరన్ సింగ్ (45) , ఆశాబాయి (30) అక్కడికక్కడే మృతి చెందారు. బండల్ నాగపూర్‌లో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రగాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బీమ్‌పూర్ మండలం పిప్పల్ కోటిలో పిడుగుపాటు ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. జైనథ్ మండలం సాంగ్వి కే పిడుగుపాటుకు పదిహేను మేకలు మృతిచెందాయి. -
పిడుగుపాటుకు ముగ్గురు బలి
భూపాలపల్లి రూరల్/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సోమవారం పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపా లపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఇద్దరు, ము లుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో ఒక మహిళ మృతిచెందారు. ఈ రెండు ఘటనలు వరి పొలంలో కలుపుతీస్తుండగా జరిగాయి. భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్ భార్య గట్టు లక్ష్మి (40) తన వ్యవసాయ పొలంలో కలుపు తీసేందుకు అదే గ్రామానికి చెందిన పసరగొండ మంజుల (38)ని కూలికి తీసుకెళ్లింది. సోమవారం సాయంత్రం సమయంలో వర్షం రావడంతో ఇద్దరు కవరు కప్పుకొని పొలం గట్టుపై కూర్చు న్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మరణించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మృతుల కుటుంబ సభ్యులను ప రామర్శించారు. మరోఘటనలో ములుగు జిల్లా ఏటూరునా గారం మండలం శంకరాజుపల్లికి చెందిన ఆతుకూరి లాలమ్మ తన కుమార్తె రమ్య (20)తో కలిసి సోమవారం పంట పొలాల్లోకి కూలి పనికి వెళ్లింది. వీరికి సమీపంలో పిడుగు పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా రమ్య మృతి చెందింది. లాలమ్మ కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. -
దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగు బీభత్సం
-
పిడుగులు పడితే రక్షించుకోవడం ఎలా? ఏం చేయాలి?
వానాకాలంలో అప్పుడప్పుడూ పలుకరించే పిడుగులతో... ఒకటి అర ప్రాణాలు పోవడం అసహజమేమీ కాదుకానీ.. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో పిడుగుల బారిన పడి పదుల సంఖ్యలో మృతి వేర్వేరు ఘటనల్లోనైనా.. ఒకేరోజు ఇంత మంది చనిపోవడం అసాధారణమే. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? చేయకూడనివి ఏమిటి? అసలు... ఈ పిడుగులేమిటి? వాటి కథేమిటి? పిడుగేమిటన్నది అర్థం చేసుకోవాలంటే ముందుగా మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతూంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తూంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా కొన్ని ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతూంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు (ఎలక్ట్రాన్లు) భూమివైపు ప్రయాణిస్తాయి. (ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే విద్యుత్తు అంటాం) మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణా (విద్యుత్తు స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి)ల నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతూంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటివరకూ మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగుపాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. ఇంతలోపే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. నేలపైకి దూసుకొచ్చేవే ఎక్కువ నేలపై, నదులు, సముద్రాలపై కూడా పిడుగులు పడవచ్చు కానీ.. సాధారణంగా భూమ్మీదకు చేరేవే ఎక్కువ. సముద్రతీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు కోటీ అరవై లక్షల పిడుగుపాట్లు నమోదవుతూంటాయని అంచనా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం భారతదేశంలో ఒక్క 2019లోనే దాదాపు 2,900 మంది పిడుగుపాటుకు మరణించారు. ముందుగా గుర్తించలేమా? పిడుగులను ముందుగా గుర్తించేందుకు ఇప్పటికే ఒక టెక్నాలజీ అందుబాటులో ఉంది. నాలుగేళ్ల క్రితం కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. వజ్రపథ్ పేరుతో రూపొందించిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను వాడితే మన పరిసరాల్లో పిడుగులు పడే అవకాశాన్ని ముందుగానే తెలిపి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సెన్సర్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో కనీసం నలభై నిమిషాల ముందే తెలుసుకోవచ్చు. జాగ్రత్తలు ► బహిరంగ ప్రదేశంలో ఉంటే నిటారుగా నిలుచొని ఉండటం కూడదు ► చెట్లు, చెమ్మ, నీరు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ► గుంపులుగా ఉండటం కంటే.. విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లకండి. ► పొడవాటి చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గరలో నుంచోరాదు. ► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. మీకు తెలుసా? ► ఒక్కో మెరుపులో ఉండే విద్యుత్తు.. దాదాపు పది కోట్ల వోల్టులు! ► లేక్ మారాసియాబో: ప్రపంచం మొత్తమ్మీద అత్యధిక సంఖ్యలో మెరుపులు మెరిసే ప్రాంతం. వెనిజులాలో ఉంది ఇది. ఇక్కడ ఏటా 160 రోజులపాటు తుపాను గాలులు వీస్తూంటాయి. ఆయా రోజుల్లో సగటున నిమిషానికి 28 మెరుపులు.. వరుసగా 10 గంటలపాటు కనిపిస్తాయి. మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకే రాత్రి దాదాపు 36 వేల మెరుపులు, వాటితో పిడుగులూ పడినట్లు వార్తలు ఉన్నాయి. ► మెరుపును కృత్రిమ పద్ధతుల్లో తొలిసారి సృష్టించింది.. నికోలా టెస్లా. ఈ కృత్రిమ మెరుపు తరువాత పుట్టిన ఉరుము శబ్ధం 15 మైళ్ల దూరం వరకూ వినిపించిందట. ► మెరుపు లేదా పిడుగు కారణంగా గాల్లో ని నైట్రోజన్.. మొక్కలు శోషించేందుకు అనువైన రూపంలోకి మారిపోతుంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
యూపీలో పిడుగుల బీభత్సం: సీఎం సంతాపం
సాక్షి, లక్నో: దేశవ్యాప్తంగా భారీగా కురిసిన వానలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి తోడు పశు నష్టం కూడా సంభవించడం కలకలం రేపింది. ప్రాణ, పశువుల నష్టంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్థానిక అధికారులను ఆదేశించింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఏకంగా 14 మంది పిడుగుపాటుతో దుర్మరణం పాలయ్యారు. కాన్పూర్‌లో అయిదుగురు, ఘజియాబాద్‌లో ముగ్గురు, కౌశుంబిలో మరో ముగ్గురు చని పోగా, ఉన్నావ్, చిత్రకూట్ ప్రాంతాలలో నలుగురు చొప్పున మరణించారు. ముఖ్యంగా భారీ వర్షం కారణంగా చెట్ల కింద ఆశ్రయం పొందిన రైతులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కౌశంబి గామానికి చెందిన రుక్మ, మూరత్, రామచంద్ర, మయాంక్ సింగ్, అలాగే ఫిరోజాబాద్ మృతులను రామ్‌సేవక్, హేమరాజ్‌గా గుర్తించారు. అదేవిధంగా నాగ్లత్ చాత్ గ్రామంలో మరో రైతు అమర్ సింగ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై యూపీ సీఎం యెగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.మృతుల కుటుంబాలకు తగిన సాయం అందిస్తామని ప్రకటించారు. అటు భారీ వర్షాలు, పిడుగుల కారణంగా పశు నష్టం కూడా భారీగానే సంభవించింది. యూపీలోని ఉడ్ని గ్రామంలో పిడుగుపాటుకు 44 జంతువులు చనిపోయాయి. 42 మేకలు, ఒక ఆవు, ఎద్దు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాజస్థాన్ ఒక్క జైపూర్‌లోనే 16 మంది మృతి చెందగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటుపై సీఎం అశోక్ గెహ్లాట్ సానుభూతిని తెలిపారు. రాజస్థాన్ సీఎం సాయంగా.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ప్రధాని మోదీ సాయం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల బీభత్సం కారణంగా ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ .2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. राजस्थान के कुछ इलाकों में आकाशीय बिजली गिरने से कई लोगों को अपनी जान गंवानी पड़ी है। इससे अत्यंत दुख हुआ है। मैं मृतकों के परिजनों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं: PM @narendramodi — PMO India (@PMOIndia) July 12, 2021 -
పశ్చిమ బెంగాల్లో విషాదం, 11 మంది మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రలోని మూడు జిల్లాల్లో సోమవారం పిడుగులు పడటంతో 11 మంది మృతి చెందారు, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటుకు బంకురా, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో ఐదుగురు మృతిచెందగా, హౌరా జిల్లాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యవపాయ పనులు చేస్తుండగా పిడుగు పడటంతో మృతి చెందినట్లు తెలిపారు. హౌరా జిల్లాలోని బాగ్నన్ ప్రాంతంలో ఉరుములలో కూడిన పడుగుపాటుకు చెట్టు కింద ఉన్న ఓ రైతు మృతి చెందాడు. దక్షిణ బెంగాల్‌లోని కొన్ని చోట్ల మంగళవారం ఉరుములతో కూడిన వర్షం పడునుందని వాతావరణశాఖ తెలిపింది. -
పిడుగుల బీభత్సం.. 31 మంది మృతి
పాట్నా: బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో గురువారం ఒక్కరోజే పిడుగుపాటుకు గురై దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా అసోంలో వరదల కారణంగా మరొకరు మృతి చెందారు. పంటపొలాలన్నీ నీటిలో మునిగాయి. మరోవైపు ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వాతావరణ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో తీవ్ర వేడి ఉండగా రాబోయే రెండు రోజులు నగరంలో ఇదే పరిస్థితి ఉంటుందని, వారాంతంలో వర్షాలు పడే సూచన ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీలోని చాలా ప్రదేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. (త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు) బిహార్‌లో గురువారం 26 మంది పిడుగుల దాడికి మృతిచెందినట్లు, అధికారులు వెల్లడించారు. గతవారం కూడా రాష్ట్రంలో పిడుగుల తాకిడికి 100 మందికి పైగా మరణించారు. పాట్నా, సమస్తిపూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, షియోహార్, కతిహార్, మాధేపుర, పూర్నియా వంటి ఎనిమిది జిల్లాల నుంచి ప్రాణ నష్టం జరిగినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఇక ఈ ఘటనపై స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే పిడుగుల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వీటి మొత్తాన్ని వీలైనంత తర్వగా బాధితులకు అందించాలని అధికారులను ఆదేశించారు. (పిడుగుపాటుకు గురై 22 మంది మృతి) కాగా పొరుగున ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పిడుగుల ప్రభావానికి అయిదుగురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. అస్సాంలో గురువారం తీవ్ర వరద ఉధృతి మరో ప్రాణాన్ని బలితీసుకుంది. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 34 మందికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 72,700 హెక్టార్ల విస్తీర్ణంలోని పంట పూర్తిగా నీట మునిగింది. ఇదిలావుండగా ముంబై పరిసర తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం అంచనా వేసింది. రాబోయే రెండు రోజులు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. -
ఏపీలో ఒక్కరోజులో 41,025 పిడుగులు
-
మెరుపుదాడుల వ్యూహకర్త
ముగిసిన కిష్టయ్య ఉద్యమ ప్రస్థానం ► రెండు దశాబ్దాలకు పైగా పోరుబాటలోనే.. ► మిలిటెంట్ నుంచి అంచలంచెలుగా అగ్రనేతగా.. ► సాంబశివుడు, నయీమ్‌కు ఇతడే గురువు ► 26 ఏళ్లుగా ఇంటిముఖమే చూడని వైనం సాక్షి, యాదాద్రి/వలిగొండ: మిలిటెంట్‌గా చేరి అంచలంచెలుగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన శ్యామల కిష్టయ్య అలియాస్ దయూ 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడేనికి చెందిన చంద్రమ్మ, రామయ్య దంపతుల ఆరో సంతానం కిష్టయ్య. విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్ ఉద్యమంలోకి వెళ్లాడు. భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో బీకాం చదువుతూ 1990లో ఆర్ఎస్యూ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆలేరు, కృష్ణపట్టె దళాల్లో మిలిటెంట్ గా పనిచేస్తూ వలిగొండ, భువనగిరి, ఆలేరుతోపాటు జిల్లాలోని పలువురిని ఉద్యమ బాట పట్టించాడు. హైదరాబాద్‌లో పీపుల్స్‌వార్ ప్రచార దళాల్లో పని చేస్తూ ఉద్యమంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాడు. కిష్టయ్యకు మెరుపుదాడుల వ్యూహకర్తగా పేరుంది. సాయుధ గెరిల్లా నక్సల్స్ శిక్షకుడిగా, సాంకేతిక విభాగం సభ్యుడిగా, మిలటరీ ప్లటూన్ నాయకుడిగా పనిచేశాడు. పోలీసులు పలుమార్లు వచ్చి ‘మీ కుమారుడిని ఉద్యమంలోంచి బయటకు రమ్మని చెప్పండి’ అంటూ కిష్టయ్య తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటి నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఓఎస్డీ వెంకటేశ్వర్లు 2015లో కిష్టయ్య ఇంటికి వెళ్లి ఆయన తల్లి, సోదరులను కలిశారు. కిష్టయ్య లొంగి పోతే ఆయనపై ఉన్న రూ.20 ల క్షల రివార్డు ఇప్పిస్తామని, బతుకుదెరువుకు సహకరిస్తామని చెప్పారు. అయినా కిష్టయ్య ఏనాడు ఇంటివైపు చూడలేదు. ఆ యనకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు. నయీమ్‌ను చేర్పించాడు పీపుల్స్‌వార్ ఉద్యమంలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన సాంబశివుడు, గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌తో పాటుమరెందరినో కిష్టయ్య పీపుల్స్‌వార్‌లో చేర్పించాడు. వలిగొండలోనే పదో తరగతి వరకు డిగ్రీ భువనగిరిలో చదివాడు. ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో చదువుతుండగా అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న నయీమ్‌ను చేర్పించాడు. అలాగే అతడి స్వగ్రామమైన దాసిరెడ్డిగూడెంలో సాంబశివుడు, అతడి సోదరుడు కొనపురి రాములు, రాపోలు స్వామిని ఉద్యమ బాట పట్టించాడు. వలిగొండలో పీపుల్స్‌వార్‌కు ఎందరో ముఖ్య కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను తయారు చేసిన నాయకుడని కిష్టయ్య గురించి తెలిసినవారు చెబుతారు. సహచర ఉద్యమకారిణి సుభద్ర అలియాస్ స్వర్ణ అలియాస్ లతను కిష్టయ్య వివాహమాడాడు. ఆమె వరడలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందింది. 26 ఏళ్లుగా ఇంటి ముఖం చూడకుండా.. పీపుల్స్‌వార్‌లోకి వెళ్లిన కిష్టయ్య తన 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఒక్కరోజు కూడా ఇంటిముఖం చూడలేదు. నిరుపేదలైన తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు తన కొడుకు ఎలా ఉంటాడోనని తల్లి చంద్రమ్మ అప్పుడప్పుడు ఆవేదన చెందుతుండేది. గ్రామస్తులకు కూడా ఆయన పేరు తప్ప ఆయన ఉనికి తెలియదు. బుల్లెట్ గాయూలతో తప్పించుకుని కిష్టయ్యకు గన్‌మన్‌గా దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు స్వామి ఉండేవాడు. ఉత్తరాంధ్ర(ఇప్పుడు ఏఓబీ)లో పనిచేస్తుండగా 2008లో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో స్వామి మృతి చెందాడు. అప్పుడు కిష్టయ్య బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. ఉద్యమం కోసం జీవితాంతం తపించిన కిష్టయ్య తాజాగా ఏవోబీ ఎన్కౌంటర్లో మరణించడంతో అతడి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి తెరపడింది. తన కుమారుడి ఆఖరిచూపైనా చూడలేకపోయానని తల్లి చంద్రమ్మ విలపిస్తోంది. అంతా అక్కడినుంచే.. దాసిరెడ్డిగూడెం ఉద్యమకారులకు పుట్టినిల్లుగా మారింది. కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు, కొనపురి రాములు, రాపోలు స్వామి వీరంతా ఈ గ్రామానికి చెందిన వారే. వీరిలో రాపోలు స్వామి 2009లో ఎన్కౌంటర్లో మృతి చెందా డు. కొనపురి సోదరులు ఉద్యమం నుంచి బయటకు వచ్చాక (సాంబశివుడు 2011లో, రాములు 2014లో) హత్యకు గురయ్యారు. కిష్టయ్య మృతి తో దాసిరెడ్డిగూడెంలో మావోయిస్టుల చరిత్ర ముగిసినట్టయింది. గణేశ్‌తో ఉద్యమ బంధం గణేశ్ సహచరుడు కిష్టస్వామి సాక్షి, భూపాలపల్లి: ఎన్కౌంటర్లో మరణించిన గాజర్ల రవి అలియాస్ గణేశ్‌తో తనది తీరని బం ధమని బండి కిష్ట స్వామి పేర్కొన్నారు. వీరిద్దరిదీ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశా ల గ్రామం. గణేశ్, తాను చిన్నప్పటి నుంచి ఒకే ఊరిలో పెరిగామని, కలసి చదువుకున్నామని కిష్టస్వామి గుర్తుచేసుకున్నారు. 1992లో ఒకేసారి అజ్ఞాతంలోకి వెళ్లి, ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజన్ కమిటీల్లో 1992-1999లో పనిచేసినట్లు చెప్పారు. తాను మహదేవాపూర్ దళంలో, గణేశ్ ఏటూరునాగారం దళంలో చేరామన్నారు. 8 నెలలకే ఏటూరునాగారం దళ కమాండర్‌గా గణేశ్ ఎదిగాడని, మహదేవపూర్ లెంకలగడ్డ దాడిలో ఇద్దరం పాల్గొన్నట్లు తెలిపా రు. 1997 మేలో ఖమ్మం జిల్లా వెంకటాపురం, చత్తీస్‌గఢ్ సరిహద్దులో నుంచి 11 మంది చొప్పున 2 బృందాలతో వస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారని, కాల్పుల్లో తన భార్య జ్యో తి మరణించగా, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లామన్నారు. ప్రతిగా పాల్వంచ ఇంటెలిజెన్స్ ఎస్ఐని పీపుల్స్‌వార్ చంపినట్లు తెలిపారు. త్యాగాలు తప్పవు గణేశ్ సోదరులు సమ్మయ్య, అశోక్ సాక్షి, భూపాలపల్లి/ చిట్యాల: ఉద్యమంలోకి వెళ్లిన వారు, వారి కుటుం బాలకు త్యాగాలు తప్పవని మావోయిస్టు గణేశ్ సోదరులు అశోక్ అలి యాస్ ఐతు, సమ్మయ్య పేర్కొన్నారు. ‘ప్రజలను భూస్వాములు పీడించారు. పోలీసులు అమాయకులను ఇబ్బందులు పెట్టారు. దానికి అన్న సారన్న అలియాస్ ఆజాద్ తొలుత ఎదురు తిరిగాడు. తర్వాత మేమూ ఆ బాటలో నడిచాం. అనారోగ్య కారణాలతో నేను మధ్యలో లొంగిపోయా. గణేశ్ కొనసాగాడు’ అని అశోక్ చెప్పారు. 2009లో ఎన్కౌంటర్లో గణేశ్, అశోక్ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారని, వెళ్లి చూస్తే అదేమీ లేదని సమ్మయ్య చెప్పారు. ఇప్పుడు మృతుల్లో గణేశ్ ఉన్నట్లు చెబుతున్నారని, స్వయంగా చూస్తే కానీ నమ్మలేమన్నారు. -
బంగ్లాదేశ్ ను వణికిస్తున్న వరదలు...
ఢాకా: బంగ్లాదేశ్ లో తలెత్తిన వరదల వల్ల దాదాపు 33 మందికి పైగా మృతిచెందారని అధికారులు తెలిపారు. గురువారం సంభవించిన ఈ వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. దీంతో బంగ్లా అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రారంభించారు. వాయవ్య బంగ్లాదేశ్ లో ఈ వరదల ప్రభావం ఎక్కువగా కనిపించింది. పబ్నా, రాజ్ సాహి, సిర్జ్ గంజ్, బ్రాహ్మణ్ బారియా జిల్లాల్లో కనీసం 19 మంది చనిపోయి ఉంటారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. రాజధాని ఢాకాలో వర్షంలో ఫుట్ బాల్ ఆడుతున్న ముగ్గురు విద్యార్థులపై పిడుగు పడగా ఆస్పత్రికి తరలించామని స్టేషన్ ఆఫీసర్ కాసీర్ అహ్మద్ చెప్పారు. చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వరదల వల్ల సంభవించిన నష్టం కంటే పిడుగు పాటు వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని అహ్మద్ వివరించారు. ప్రతి ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య వచ్చే రుతుపవనాలకు ముందుగా బంగ్లాదేశ్ లో వరదలు సంభవిస్తూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. -
హైటెక్ పేకాట
మహబూబ్‌నగర్ క్రైం: చట్ట విరుద్దంగా ని ర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 12 మందిని అదపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 20.51 లక్షల నగదు స్వాధా నం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ కృష్ణమూర్తి తన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరులతో సమావేశంలో వివరాలు వెల్లడించారు. భూత్పూర్ మం డల పరిధిలోని వాల్యానాయక్ తాండాలోని యాదమ్మ అనే మహిళ ఇంట్లో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం తెల్లవారుజామున రూరల్ సీఐ గిరిబా బు, మహబూబ్‌నగర్ రూరల్ సీఐ శ్రీని వాసులు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీ సులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న అస్లామ్ఖాన్, ఎల్లాగౌడ్, కృష్ణ,రామాంజనేయులు, వీర య్య, శేఖర్, బాల్‌రాజు, యాదగిరి, లవకుమార్, నాగరాజు, లక్ష్మినారాయణల ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ. 36 వేల నగదు, 3 మో టార్ సైకిళ్లు ఒక ఇండిగో కారు, 12 సెల్ఫోన్లు, 53 ప్లాస్టిక్ కాయిన్స్, రెండు సెట్ల పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పేకాట క్లబ్‌ను నిర్వహిస్తున్న భగీరథకాలనీకి చెందిన సిరిగిరి శ్రీనివాస్‌ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకుని రూ. 20.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మ రో కొందరి నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకేనేందుకు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఎస్ఐలు రాజేశ్వర్‌గౌడ్, లక్ష్మారెడ్డిలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. హైటెక్ తరహాలో పేకాట.... ప్రధాన సూత్రధారి సిరిగిరి శ్రీనివాసులు గత కొన్నేళ్లుగా పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. పేకాట ఆడే వారు ముందుగానే అతడిని కలిసి ఆడబోయే మొత్తానికి సంబందించి నగదు అందజేస్తే అతను వాటికి బదులుగా కాయిన్లు అందజేస్తాడు. గెలిచిన వారు కాయిన్లు తీసుకుని నిర్వాహకుడు సూచించిన ప్రాంతానికి వెళితే వాటిని మార్చి నగదు అందజేస్తారు. ఎవరికి అనుమానరాకుండా కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.