
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
సాక్షి, వరంగల్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దసరా పండుగ సందర్భంగా జఫర్గడ్ మండలం సాగరం శివారులోని గుట్టవద్ద దావత్ చేసుకుంటుండగా పెద్దశబ్దంతో మర్రిచెట్టుపై పడ్డ పిడుగుతో ముగ్గురు మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామానికి చెందిన నేరెల్లి శివ, మరుపట్ల సాంబరాజు, జెట్టబోయిన సాయికృష్ణగా గుర్తించారు.
చదవండి: డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు
మహబూబాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లా గార్లలో పిడుగుపాటుకు ఎముల సంపత్ అనే వ్యక్తి మృతి చెందాడు.మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.