పశ్చిమ బెంగాల్‌లో విషాదం, 11 మంది మృతి | Lightning Strikes In West Bengal Eleven People Deceased | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌లో విషాదం, 11 మంది మృతి

Published Tue, Jul 28 2020 10:14 AM | Last Updated on Tue, Jul 28 2020 10:14 AM

Lightning Strikes In West Bengal Eleven People Deceased - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రలోని మూడు జిల్లాల్లో సోమవారం పిడుగులు పడటంతో 11 మంది మృతి చెందారు, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటుకు బంకురా, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో ఐదుగురు మృతిచెందగా, హౌరా జిల్లాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యవపాయ పనులు చేస్తుండగా పిడుగు పడటంతో మృతి చెందినట్లు తెలిపారు. హౌరా జిల్లాలోని బాగ్నన్ ప్రాంతంలో ఉరుములలో కూడిన పడుగుపాటుకు చెట్టు కింద ఉన్న  ఓ రైతు మృతి చెందాడు. దక్షిణ బెంగాల్‌లోని కొన్ని చోట్ల మంగళవారం ఉరుములతో కూడిన వర్షం పడునుందని వాతావరణశాఖ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement