పంటపొలాల్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పంటపొలాల్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 38 వేల నగదు, 11 సెల్‌ఫోన్లతో పాటు 7 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం చింతలవారిపల్లి గ్రామ శివారులోని పంటపొలాల్లో బుధవారం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.