గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న ఓ స్థావరం పై పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
- రూ. 21 లక్షలు స్వాధీనం
టి.నర్సాపురం(పశ్చిమగోదావరి)
గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్న ఓ స్థావరం పై పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా టి. నర్సాపురం మండలం బండివారిగూడెంలో ఆదివారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 33 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.