బాయ్‌కాట్ బింగో: ర‌ణ్‌వీర్‌పై ట్రోలింగ్‌ | Boycott Bingo Trends: Sushant Singh Fans Fires On Ranveer Singh | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ను కించ‌ప‌రిచేలా బింగో యాడ్‌!

Published Thu, Nov 19 2020 6:56 PM | Last Updated on Thu, Nov 19 2020 6:56 PM

Boycott Bingo Trends: Sushant Singh Fans Fires On Ranveer Singh - Sakshi

దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు హీరో ర‌ణ్‌వీర్ సింగ్ మీద ఫైర్ అవుతున్నారు. ఆయ‌న న‌టించిన బింగో యాడ్‌లో సుశాంత్‌ను కించ‌ప‌రిచార‌ని విమ‌ర్శిస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో #BoycottBingo హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బింగోకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ణ్‌వీర్ చిప్స్ కోసం న‌టించిన కొత్త యాడ్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేశారు. అందులో ర‌ణ్‌వీర్ ఓ ఫంక్ష‌న్‌కు వెళ్తారు. అక్క‌డి బంధువులు నెక్స్ట్ ప్లాన్‌ ఏంటి? అని హీరోను ప‌దేప‌దే అడుగుతుంటారు. వాటికి స‌మాధానం చెప్ప‌లేక‌, అక్క‌డ‌నుంచి త‌ప్పించుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్న అత‌డికి బింగో మ్యాడ్ యాంగిల్స్ తిన‌గానే ఓ ఐడియా వ‌స్తుంది. (చ‌ద‌వండి: బాయ్‌‌కాట్‌ మీర్జాపూర్‌2‌ .. ట్విటర్‌లో హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌)

వెంట‌నే ఎవ‌రికీ అర్థం కాని రీతిలో జ‌వాబు చెప్ప‌డం ప్రారంభిస్తారు. పార‌డాక్సిక‌ల్ ఫొటాన్స్‌, అల్గారిథ‌మ్స్‌, ఏలియ‌న్స్.. అంటూ చెప్తూ ఇదే త‌న నెక్స్ట్ ప్లాన్ అని జ‌వాబివ్వ‌డంతో అంద‌రూ షాక్ అవుతారు. ఈ యాడ్‌లో ఎక్క‌డా సుశాంత్ పేరును ప్ర‌స్తావించ‌లేదు. అయితే సుశాంత్ మాత్ర‌మే ఫొటాన్స్‌, ఏలియ‌న్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవార‌ని, కావాల‌నే ఈ యాడ్‌లో అత‌న్ని టార్గెట్ చేశార‌ని ఆయ‌న అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో ర‌ణ్‌వీర్‌ను, బింగో యాడ్‌ను ఏకిపారేస్తున్నారు. సుశాంత్ ఆలోచ‌న‌ల‌ను కించ‌ప‌రిచేలా ఉన్న ఈ యాడ్‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. (చ‌ద‌వండి: యూట్యూబర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన అక్షయ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement