పేకాడుతూ పట్టుబడ్డ కార్పొరేటర్ భర్త | Husband caught playing poker corporator | Sakshi
Sakshi News home page

పేకాడుతూ పట్టుబడ్డ కార్పొరేటర్ భర్త

Published Mon, Jun 13 2016 8:19 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

Husband caught playing poker corporator

విజయవాడ: ఆంధ్రప్రభ కాలనీలో ఆదివారం పేకాట శిబిరంపై దాడిచేసి కార్పొరేటర్ పైడి తులసి భర్త పైడి శ్రీనుతోపాటు మరో ఏడుగురిని సీసీఎస్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రభ కాలనీలో పేకాడుతున్నట్లు సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది. పేకాట శిబిరంపై దాడిచేసి పేకాడుతున్న కార్పొరేటర్ భర్త పైడి శ్రీను, పలు పార్టీలకు చెందిన నాయకులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి 56,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎనిమిది మందిని సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి  పైడి శ్రీను,  కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి వెంకట్రావు, దండా శ్రీను, ఒర్సు సుందరరావు, సీహెచ్ మల్లేశ్వరరావు, బొమ్మారెడ్డి వెంకట నరసింహారెడ్డి, గడ్డం ప్రసాద్, సాము మనుకుమార్‌లను అరెస్టు చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement