
సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబు చీఫ్ పాలిట్రిక్స్ మానుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హితువు పలికారు. రాష్ట్రంలో విశాఖ మున్సిల్ కార్పొరేషన్‌పై కూటమి కుట్ర రాజకీయాలు తెరతీసింది.ఈ తరుణంలో కూటమి కుట్రా రాజకీయాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.. మరి వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన కార్పోరేటర్లు, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి. పార్టీ మారమని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రలోభాలతో ముగ్గురు నలుగురు కార్పొరేటర్లను చేర్చుకోవాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలి. చంద్రబాబు చీఫ్ పాలిట్రిక్స్ చేయడం మానుకోవాలి. వైఎస్ జగన్‌పై కార్పొరేటర్లకు విడదీయరాని అనుబంధం ఉంది. కార్పొరేటర్లకు సముచిత స్థానం పార్టీలో ఉంటుంది.
మా కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తే సహించేది లేదు. అధికారం శాశ్వతం కాదు. మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తులో అసలైన రాజకీయం వారికి చూపిస్తాం. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. మరి వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన కార్పోరేటర్లు, నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి’అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment