HYD: బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్‌పై దాడి | Womens Attack On BRS Corporator Dedeepya Rao At Jubilee Hills | Sakshi
Sakshi News home page

HYD: బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్‌పై దాడి

Published Wed, Mar 13 2024 7:46 AM | Last Updated on Wed, Mar 13 2024 12:56 PM

Womens Attack On BRS Corporator Dedeepya Rao At Jubilee Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్‌ దేదీప్య రావుపై కొందరు మహిళలు దాడి చేశారు. వారి దాడిలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై దేదీప్య రావు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా స్థానిక బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్య రావుపై దాడికి దిగారు. దీంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, తన భర్త విజయ ముదిరాజ్‌తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మాగంటి గోపినాథ్‌ అరాచకాలు ఎక్కువయ్యాయంటూ స్థానిక మహిళలు ఆరోపలు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement