బన్నీ ఖాతాలో మరో రికార్డు | Allu Arjun Only Tollywood Actor in Yahoo Most Searched Celebrity List 2020 | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డు

Published Sun, Dec 6 2020 4:02 PM | Last Updated on Sun, Dec 6 2020 4:02 PM

Allu Arjun Only Tollywood Actor in Yahoo Most Searched Celebrity List 2020 - Sakshi

 స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘‘అల వైకుంఠపురములో’ సినిమా ఏన్నో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసి, పలు సంచలన రికార్డులను సొం‍తం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టినవి. ఇక ఈ మూవీ  ట్రైలర్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షించిన టాప్‌ 20లో స్థానం దక్కించుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న బన్నీ.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. 
(చదవండి : ‘అల వైకుంఠపురములో’ అరుదైన రికార్డు)

ఇటీవలే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాహూ లోని టాప్ మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సెలెబ్రెటీల జాబితాలో మొత్తం ఇండియన్స్ లో ఏకైక తెలుగు హీరోగా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో సినీ పరిశ్రమ నుంచి ఎస్సీ బాలసుబ్రమణ్యం, సోనుసూద్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement