Actress Pooja Hegde Tweet On Ala Vaikuntapuramlo Movie Three Years - Sakshi
Sakshi News home page

Pooja Hegde: ఆ సినిమా నా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది: పూజా హెగ్డే

Published Fri, Jan 13 2023 8:06 PM | Last Updated on Fri, Jan 13 2023 8:47 PM

Actress Pooja Hegde Tweet On Ala Vaikuntapuramlo Movie Three Years - Sakshi

పూజా హెగ్డే కంటే అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు బుట్టబొమ్మ. టాలీవుడ్‌లో అగ్ర హీరోలతో పలు సినిమాల్లో నటించింది ముద్దుగుమ్మ.  మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుని సక్సెస్‌ను అందుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో జంటగా 'అల వైకుంఠపురంలో' సూపర్‌ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. పూజ హెగ్డే అమూల్య పాత్రలో తనదైన నటనతో అందరినీ మెప్పించింది. తాజాగా ఈ చిత్రం విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకుంది బుట్టబొమ్మ.  

(ఇది చదవండి: Pooja Hegde: పూజా హెగ్డేకు బ్యాడ్‌టైం)

పూజా ట్విటర్‌లో రాస్తూ..'మూడేళ్ల క్రితం 'అమూల్య' అనే క్యారెక్టర్‌ పుట్టింది. ఈ సినిమా నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమే. ముడేళ్ల వేడుకలు జరుపుకోవడానికి అల వైకుంఠపురములో సిద్దంగా ఉంది.' బుట్టబొమ్మ పాట ఉన్న వీడియో పోస్ట్ చేసింది. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సైతం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘బుట్టబొమ్మ’ పాట యూట్యూబ్‌లో అరుదైన రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరోసారి ఈ జోడిని స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పూజ బాలీవుడ్‌లో‘సర్కస్’(సర్కస్) సినిమాలో నటించింది. సల్మాన్‌ఖాన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్’ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement