
హైదరాబాద్: టెక్ సంస్థ యాహూ (గతంలో వెరిజోన్ మీడియా) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థ వెల్లడించింది. యాహూ ఇకపై స్టాండెలోన్ సంస్థగా కొనసాగుతుందని పేర్కొంది.
దాదాపు 5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 36,000 కోట్లు) వెరిజోన్ నుంచి యాహూలో మెజారిటీ వాటాలను అపోలోకి చెందిన ఫండ్స్ కొనుగోలు చేశాయి. యాహూలో వెరిజోన్ 10 శాతం వాటాను అట్టే పెట్టుకుంది. యాహూకి ఇది కొత్త శకమని సంస్థ సీఈవో గురు గౌరప్పన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment