Technology Company
-
హైదరాబాద్‌లో చార్లెస్ స్క్వాబ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సేవల రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన ‘చార్లెస్ స్క్వాబ్’ హైదరాబాద్‌లో నూతన సాంకేతిక అభివృద్ధి కేంద్రం (టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. చార్లెస్ స్క్వాబ్ భారత్ లో ఏర్పాటు చేసే తొలి డెవలప్మెంట్ సెంటర్ ఇదే కావడం గమనార్హం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతి నిధి బృందంతో చార్లెస్ స్క్వాబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హోవార్డ్, రామ బొక్కా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో చర్చల సందర్భంగా హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల ప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. చార్లెస్ స్క్వాబ్‌కు ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన తుది అను మతుల కోసం చార్లెస్ స్క్వాబ్ వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపనున్నట్లు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పా టు ద్వారా ఆర్థిక సేవల రంగంలో ఉద్యోగ అవకాశాల కల్ప నకు వీలవుతుందని, ఈ రంగంలో హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.‘కామ్‌కాస్ట్’ ప్రతినిధులతో శ్రీధర్బాబుఅంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ కంపెనీ ‘కామ్‌కాస్ట్’కు చెందిన సీనియర్ ప్రతినిధి బృందం.. మంత్రి శ్రీధర్‌బాబు తో భేటీ అయింది. తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపా ధి కల్పన లక్ష్యంగా అనేక సంస్థలతో వ్యూహాత్మక, భాగస్వా మ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ భేటీలో కామ్‌కాస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెల్ పెన్నా, సీటీఓ రిక్ రియోబొలి, సీఐఓ మైక్ క్రిసాఫుల్లి పాల్గొన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకే..సీఎం బృందం అమెరికా పర్యటనలో భాగంగా పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలపై విమ ర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతినిధి బృందంలోని అధికారు లు వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే దిశలోనే వివిధ సంస్థలతో చర్చలు ఒప్పందాలు జరుగుతు న్నట్లు వెల్లడించారు. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రోడ్ షోలు, వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుగుతు న్నాయి. సీఎం కూడా అనేక బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. భవిష్యత్తు సమావేశా ల్లోనూ రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తాం..’ అని ఐటీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి‘ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం జరిపిన భేటీ ఆసక్తికరంగా, ఫలప్రదంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి చూపించింది. పట్టణీకరణ, కాలుష్య రహిత నగరాలకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఆసక్తి చూపింది. పట్టణీకరణ ద్వారా ఎదురయ్యే మురుగునీరు, తాగునీటి సమస్యల పరిష్కా రానికి రాష్ట్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది..’ అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు.కాలిఫోర్నియా చేరుకున్న సీఎం బృందం రేవంత్‌రెడ్డి బృందం గురువారం కాలిఫోర్నియాకు చేరుకుంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, డాలస్, టెక్సా స్లో పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చిన బృందానికి ఘన స్వాగతం లభించింది. కాలిఫోర్నియాలో దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఈ బృందం భేటీ అవుతుంది. -
వన్ అండ్ ఓన్లీ యాపిల్: కీలక మైలురాయిని అధిగమించిన యాపిల్
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం యాపిల్ కీలక మైలురాయిని చేరుకుంది. యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్‌లో 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మైలురాయిని అధిగమించిన ఏకైక కంపెనీగా నిలిచింది. ఇటీవల యాపిల్ షేర ధర ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ వ్యాల్యూ బాగా పెరిగింది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ప్రపంచంలోనే తొలిసారి 3 ట్రిలియన్ డాలర్ల విలువతో ట్రేడింగ్ డేను ముగించిన పబ్లిక్ కంపెనీగా యాపిల్ నిలిచింది. యాపిల్ శుక్రవారం 1 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 191.34 డాలర్లను తాకాయి. దీంతో యాపిల్ మార్కెట్ క్యాప్ రికార్దు స్థాయికి చేరింది. జనవరి 3, 2022న, ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 3 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది కానీ ముగింపులో నష్టపోయింది. ఈ 3 ట్రిలియన్ మార్కును దాటి ఈ ఘనతను సాధించిన ఏకైక కంపెనీ యాపిల్. వచ్చే ఏడాది విక్రయానికి రానున్న విజన్ ప్రో, ఆగ్మెంటెడ్ రియాలిటీ పరికరం ప్రివ్యూ టెక్ ప్రియులను ఆకట్టుకుంది. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కాగా 2022తో పోలిస్తే ఈ ఏడాది స్టాక్ మార్కెట్ లాభం యాపిల్‌కు కలసి వచ్చింది. 2021 తరువాత తొలిసారి 2023 ప్రారంభంలో మార్కెట్ క్యాప్ స్థాయినుంచి 2 ట్రిలియన్ల దిగువకు పడిపోయింది. ఆతరువాత మార్కెట్ పుంజుకోవడంతో యాపిల్ షేరు ఈ ఏడాది దాదాపు 46 శాతం పెరిగడంతో మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో నిలిచింది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు!
ఓపెన్ ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ టెక్నాలజీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంది. ఆర్ధిక మాంద్యంలోనూ లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. దీంతో ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిష్ణాతులైన నిపుణులకు డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నాస్కామ్ అంచనా ప్రకారం భారత్‌లో ప్రస్తుతం 4.16 లక్షల ఏఐ నిపుణులు ఉండగా..మరో 2.13 లక్షల మంది అదనపు ఏఐ ఇంజినీర్లకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ నుండి యూరప్, ఆసియా దేశాల్లో ఏఐలకు భారీ డిమాండ్ ఏర్పడింది. చాట్‌జీపీటీ రాకతో గూగుల్, బైదు వంటి దిగ్గజ సంస్థలు సొంత సెర్చ్ ఇంజిన్లను తయారు చేసే పనిలో పడ్డాయి. ఇలా ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా మిగిలిన సెక్టార్లలో ఏఐల కొరత తీవ్రంగా ఉంది. టెక్నాలజీయేతర రంగంలోనూ డిమాండ్ హెల్త్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ వరకు దాదాపు ప్రతి రంగంలో ఏఐ నిపుణుల అవసరం ఏర్పడింది. ఆ కొరతను అధిగమించేందుకు ఇందుకోసం ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు ముట్టజెప్తున్నాయి ఆయా సంస్థలు. అంతేకాదు ఏఐ విభాగంలో ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మరో కంపెనీలో చేరే సమయంలో 35 శాతం నుంచి 50 శాతం వరకు వేతనాన్ని అదనంగా చెల్లిస్తున్నాయి. అయినా ఏఐలో నిష్ణాతులైన ఉద్యోగులు కావాల్సి ఉంది. భారత్‌లో ఏఐ నిపుణలు కొరత ప్రస్తుతం, స్కామ్ లెక్కల ప్రకారం దేశంలో సుమారు 5.4 మిలియన్ల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్-19 లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఐటీ రంగానికి వెన్నెముకగా నిలిచిన భారత్ సైతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. డిమాండ్ దృష్ట్యా ఆ రంగంలోని ఉద్యోగులకు కంపెనీలు అధికంగా వేతనాలు అందిస్తున్నాయి. ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్‌లు అమెరికా సియోటెల్ కేంద్రంగా స్టార్టప్ ఫ్లెక్సికార్ కార్ షేరింగ్ (ఓలా తరహాలో) సేవల్ని అందిస్తుంది. ఆ సంస్థ ఇప్పుడు బెంగళూరు డేటా సైన్స్ హబ్‌లో కంప్యూటర్ విజన్ స్పెషలిస్టులు, ఇంజినీర్ల టీం నిర్మిస్తున్నది. ఈ సందర్భంగా ఏఐ నిపుణుల కోసం ఆయా టెక్ కంపెనీలు ఉద్యోగులకు చేస్తున్న ఆఫర్లు విచిత్రంగా ఉన్నాయని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (cfo) ఫ్రీడమ్ డుమ్లావ్ అన్నారు. తాను ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు. ఇంటర్వ్యూ సందర్భంగా సదరు ఉద్యోగి తన కంపెనీలో చేరితే శాలరీతో పాటు బీఎండబ్ల్యూ బైక్‌ను ఇచ్చేందుకు మరో సంస్థ ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు టెక్నాలజీ రంగంలో ఏఐల కొరత ఏ విధంగా ఉందోనని వ్యాఖ్యానించారు. గూగుల్ ఐదుగురు ఉద్యోగులతో ప్రారంభమై.. ఇక, కృత్తిమ మేధ నిపుణుల కొరతను అధిగమించేందుకు దేశీయ టెక్ కంపెనీ టీసీఎస్ ఔట్ సోర్స్ విధానంపై దృష్టి సారించినట్లు నివేదికలు చెబుతున్నాయి. సపోర్ట్, సర్వీస్, సాఫ్వేర్ తయారీల కోసం టీసీఎస్ వరల్డ్ వైడ్‌గా టెక్ నిపుణుల కోసం అన్వేషిస్తుంది. ఇక భారత్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. 2004లో గూగుల్ భారత్‌లో ఐదు మంది ఉద్యోగులతో సేవల్ని ప్రారంభింది. ఇప్పుడు దాదాపు 10,000 మంది ఉద్యోగులున్నారు. 2లక్షల మంది నిపుణుల అవసరం ఇప్పుడు అదే గూగుల్ సైతం దేశీయంగా ఏఐ ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటుంది. దేశంలో ఏఐ, డేటా సైన్స్‌లో దాదాపు 416,000 మంది పని చేస్తున్నారు. మరో 213,000 మంది కావాలని నాస్కామ్ అంచనా వేసింది. తక్కువ జీతం.. తక్కువ వేతనాల కోసం స్కిల్డ్ నిపుణుల కోసం ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలు 2022లో భారత్‌లో 66 టెక్ ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. వాటి సంఖ్య 1600కి చేరింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు లేదా క్యాప్టివ్‌లు అని పిలిచే ఈ కేంద్రాల్లో ఐటీ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ వంటి టాస్క్‌లను నిర్వహిస్తుంటారు ఉద్యోగులు. భారత్‌వైపు.. ప్రపంచ ఐటీ కంపెనీల చూపు బెంగళూరులో ప్రపంచంలోని పలు దిగ్గజం కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలల్లో అసెట్ మేనేజర్ అలయన్స్‌బెర్న్‌స్టెయిన్ హోల్డింగ్ ఎల్పీ, కార్ రెంటల్ కంపెనీ అవిస్ బడ్జెట్ గ్రూప్, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ కు చెందిన డిస్కవరీ ఇంక్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ తయారీ సంస్థ ప్రాట్ & విట్నీ, గోల్డ్‌మన్ సాచ్, వాల్‌మార్ట్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్‌కు భారీ ప్యాకేజీలు అందిస్తున్నాయి. చివరిగా చివరిగా..కొత్తగా ఐటీ రంగంలోకి వచ్చేవారు, కెరీర్ గ్యాప్ ఉన్నవారు, లేదంటే ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తూ టెక్నాలజీ రంగంలో పనిచేయాలనుకునే వారు ప్యాకేజీ గురించి ఆలోచించకుండా నైపుణ్యం పెంచుకోవడంపైనే ఫోకస్ చేయాలి. డేటా సైంటిస్ట్,మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యం సంపాదిస్తే కోరుకున్న కలల ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని టెక్నాలజీ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
లక్షల్లో ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ సంచలనం!
సాఫ్ట్వేర్ కొలువు.. ఐటీ రంగంలో కెరీర్.. దేశంలో డిగ్రీ స్థాయి కోర్సులు చదువుతున్న ప్రతి ఒక్కరి స్వప్నం! చదివిన డొమైన్‌తో సంబంధం లేకుండా.. ఇప్పుడు అధికశాతం మంది ఐటీ జాబ్స్ కోసం అన్వేషణ సాగిస్తున్న పరిస్థితి! కాని∙క్యాంపస్ డ్రైవ్స్ కేవలం ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న టాప్ కాలేజీల విద్యార్థులకే లభిస్తున్నాయనే భావన! ఇలాంటి వారు తమ సాఫ్ట్వేర్ కొలువు కలను సాకారం చేసుకునేందుకు మార్గం.. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్!! దేశంలో టాప్–5 ఐటీ కంపెనీల జాబితాలో నిలిచిన సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్.. ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో చేపడుతున్న నియామక విధానమే.. స్మార్ట్ హైరింగ్! తాజాగా స్మార్ట్ హైరింగ్–2023 ప్రక్రియను టీసీఎస్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. స్మార్ట్ హైరింగ్‌కు దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్ తదితర వివరాలు ఐటీ కంపెనీల్లో నాన్–ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ కొలువు అందని ద్రాక్షే అనే అభిప్రాయముంది. దీనికి భిన్నంగా.. సైన్స్, మ్యాథమెటిక్స్,స్టాటిస్టిక్స్, ఒకేషనల్, కంప్యూటర్స్/ఐటీ సబ్జెక్ట్లతో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్వేర్ జాబ్ ఖరారు చేసేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్..ఆఫ్ క్యాంపస్ విధానంలో చేపడుతున్న నియామక ప్రక్రియే.. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్. అర్హతలు నిర్దేశిత గ్రూప్‌లలో 2023లో డిగ్రీ పూర్తి చేసుకోనున్న విద్యార్థుల కోసం స్మార్ట్ హైరింగ్ ప్రక్రియను టీసీఎస్లోప్రారంభించింది.∙బీసీఏ, బీఎస్సీ(మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/బయో కెమిస్ట్రీ/కంప్యూటర్ సైన్స్/ఐటీ), కంప్యూటర్ సైన్స్/ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సులను 2023 లో పూర్తి చేసుకోనున్న విద్యార్థులను అర్హులుగా పేర్కొంది. ∙పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు ప్రతి స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు లేదా 5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. ∙బ్యాచిలర్ డిగ్రీలో ఒక బ్యాక్లాగ్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ∙అకడమిక్‌గా గ్యాప్ రెండేళ్ల కంటే ఎక్కువ ఉండకూడదని కూడా పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 18–28 ఏళ్ల మధ్య ఉండాలి. ‘సైన్స్ టు సాఫ్ట్వేర్’ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రధాన ఉద్దేశం..ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌ను విస్తృతం చేయడం.అదే విధం గా.. నిర్దేశిత సబ్జెక్ట్ గ్రూప్‌లతో డిగ్రీ పూర్తి చేసిన వారికి సాఫ్ట్వేర్ కొలువులు ఖరారు చేయడం. ఇందుకోసం ప్రత్యేకంగా సైన్స్ టు సాఫ్ట్వేర్ పేరుతో వినూత్న ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్‌లతో బీ ఎస్సీ..అదే విధంగా బీసీఏ,సీఎస్/ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థుల కోసం స్మార్ట్ హైరింగ్ ప్రక్రియను చేపడుతోంది. సమయం ఆదాటీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియలో మరోప్రధాన ఉద్దేశం.. సమయం ఆదా చేయడం. వాస్తవానికి క్యాంపస్ డ్రైవ్స్ విధానంలో నియామక ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతోంది. దీంతో అటు విద్యార్థులకు, ఇటు సంస్థకు సమయం ఆదా అయ్యేలా టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ దోహదపడుతుంది. 40 వేల మంది టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ ద్వారా ఏటా దాదాపు 35 వేల నుంచి 40 వేల మంది వరకూ ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంటోంది. ఈ సంఖ్యను ప్రతి ఏటా సంస్థ నియామక ప్రణాళిక ఆధారంగా నిర్ధారిస్తున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు రెండువేలకు పైగా ఇన్స్టిట్యూట్ల విద్యార్థులకు ఈఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఆరు నెలల శిక్షణ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఆఫర్ ఖరారు చేసుకున్న వారికి ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారు. కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ అంశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్,బిహేవియర్ స్కిల్స్, ఇతర సాఫ్ట్ స్కిల్స్‌లోనూ నైపుణ్యం పొందేలా శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వారి ఆసక్తి మేరకు ఐటీ లేదా బీపీఎస్ విభాగాల్లో నియామకాలు ఖరారు చేస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. మూడు దశల ఎంపిక ప్రక్రియ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ విధానంలో మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి..రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ. తొలిదశ రాత పరీక్ష ఫిబ్రవరి 10వ తేదీన టీసీఎస్ ఐయాన్ సెంటర్లలో జరుగుతుంది. రాత పరీక్ష.. మూడు విభాగాలు తొలుత ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల(వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరిక్ ఎబిలిటీ) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 15–20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పరీక్ష వ్యవధి 50 నిమిషాలు. రెండో దశ.. టెక్నికల్ ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్‌లో సంస్థ నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించిన వారిని తదుపరి దశ టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ దశలో ఐటీ రంగానికి సంబంధించిన అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానం,సాఫ్ట్వేర్ రంగంపై ఆసక్తి, అకడమిక్ నేపథ్యం ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్‌లలో నైపుణ్యాలను పరీక్షిస్తారు. చివరగా హెచ్ఆర్ ఇంటర్వ్యూ టెక్నికల్ ఇంటర్వ్యూలోనూ విజయం సాధించిన వారికి చివరగా హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది.ఇందులో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని,నాయకత్వ లక్షణాలను,సాఫ్ట్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో నూ విజయం సాధిస్తే.. నియామకం ఖరారు చేసి..ఆరు నెలలపాటు నిర్వహించే శిక్షణకు పంపుతారు. రాత పరీక్షలో విజయం ఇలా తొలి దశగా నిర్వహించే రాత పరీక్షలో.. 3 విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అవి.. వెర్బల్ ఎబిలిటీ యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్,ది ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాక్టివ్–ప్యాసివ్ వాయిస్, క్లోజ్ టెస్ట్, వెర్బల్ అనాలజీస్, సెంటెన్స్ కరెక్షన్, పేరా రైటింగ్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఇంగ్లిష్ గ్రామర్‌పై పదో తరగతి స్థాయిలో పూర్తి అవగాహన పొందాలి. అదే విధంగా సెంటెన్స్ ఫార్మేషన్, కరెక్షన్, కాంప్రహెన్షన్ల కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ ఈ విభాగంలో కోడింగ్, డీ కోడింగ్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, బ్లడ్ రిలేషన్స్, అనాలజీ,సిరీస్, పజిల్స్, లెటర్ సిరీస్, వెన్ డయాగ్రమ్స్, విజువల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ ఈ విభాగంలో ఫ్రాక్షన్స్,ప్రాబబిలిటీ, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్, యావరేజెస్, ఈక్వేషన్స్, ఏరియా,స్సేస్, పెరిమీటర్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, వర్క్ అండ్ టైమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, నంబర్ సిస్టమ్, ఎల్సీఎం, హెచ్‌సీఎం, పర్సంటేజెస్ వంటి ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సమాధానం ఇవ్వడం కోసం 12వ తరగతి స్థాయిలోప్యూర్ మ్యాథ్స్, అదే విధంగా అర్థమెటిక్ పుస్తకాలు అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సగటున 50 సెకన్ల నుంచి ఒక నిమిషం వ్యవధి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. రిజిస్ట్రేషన్ ఇలా టీసీఎస్ స్మార్ట్ హైరింగ్–2023కు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం https://nextstep.tcs.com/campus/#/ లో లాగిన్ ఐడీ,పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐటీ, బీపీఎస్ విభాగాల్లో తమకు ఆసక్తి ఉన్న విభాగంపై క్లిక్ చేయాలి. తర్వాత దశలో ఆన్లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. అదే విధంగా నిర్దేశిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2023 ఆన్లైన్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 10, 2023 ∙పూర్తి వివరాలకు వెబ్సైట్: www.tcs.com/careers/india/tcs-smart-hiring-2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్: https://nextstep.tcs.com/campus/# -
‘ఈ ఏడాది మొదట్లోనే ఐటీ ఉద్యోగులకు భారీ షాక్!’
ఈ ఏడాది మొదట్లోనే ఐటీ ఉద్యోగులకు కంపెనీలు భారీ షాక్ ఇస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం భయంతో సంస్థలు ఉద్యోగుల్ని తొలగించుకుంటున్నాయి. జాబ్ నుంచి తొలగిస్తున్నట్లు హఠాత్తుగా మెయిల్స్ పంపిస్తున్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీల్లో 24వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపాయి. తాజాగా, కఠినమైన ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్ బెర్గ్ సైతం మైక్రోసాఫ్ట్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైందని తన నివేదికలో పేర్కొంది. మరో 5 నుంచి 10శాతం ఉద్యోగాలు ఉష్ కాకి మైక్రోసాఫ్ట్‌లో మొత్తం 220,000 మంది పనిచేస్తుండగా..గతేడాది రెండు సార్లు ఉద్యోగుల్ని ఫైర్ చేయగా.. తాజాగా కంపెనీ వార్షిక ఫలితాల్ని వెలు వరించకముందే ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ‘గత కొన్ని వారాలుగా మేం సేల్స్‌ఫోర్స్, అమెజాన్ నుండి గణనీయంగా హెడ్‌కౌంట్ తగ్గడం చూశాం. టెక్ సెక్టార్లో మరో 5 నుండి 10 శాతం సిబ్బంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందంటూ వెడ్‌బుష్ నివేదించింది. ఈ కంపెనీల్లో చాలా వరకు 1980 నాటి తరహాలో డబ్బు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ధిక అనిశ్చితికి అనుగుణంగా ఖర్చుపై నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒట్టి రూమర్లే! ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు స్పందించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు వస్తున్న నివేదికల్ని ఖండించారు. ఒట్టి రూమర్సేనని కొట్టిపారేశారు. చదవండి👉 నీ ఉద్యోగానికో దండం.. విసుగెత్తిన ఉద్యోగులు..రాజీనామాల సునామీ? -
హెచ్‌సీఎల్ టెక్కు స్విస్ సంస్థ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ కంపెనీ ఎస్ఆర్ టెక్నిక్స్ నుంచి కొన్నేళ్లపాటు అమల్లో ఉండే(మల్టీ ఇయర్) కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ తాజాగా పేర్కొంది. ఆర్డర్లో భాగంగా టెక్నిక్స్ కార్యకలాపాలను డిజిటల్ రూపేణా మార్పు చేసేందుకు అనుగుణమైన సర్వీసులు అందించనున్నట్లు తెలియజేసింది. వైమానిక నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్వో) సర్వీసులందించే టెక్నిక్స్ కొన్ని భాగస్వామ్య సంస్థలతో కలసి పనిచేస్తోంది. యూరప్, అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్యంలో బిజినెస్ డెవలప్మెంట్ కార్యలయాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 500 కస్టమర్లకు విమానాల ఇంజిన్లు, ఎయిర్‌ఫ్రేమ్, విడిభాగాలు, సాంకేతిక మద్దతుసహా అవసరమైన(కస్టమైజ్డ్) సేవలు సమకూరుస్తోంది. కాగా.. హెచ్‌సీఎల్ టెక్ డీల్ విలువను వెల్లడించలేదు. -
స్టాక్ మార్కెట్, ఇకపైనా టెక్ కంపెనీల ఐపీవోల జోరు
న్యూఢిల్లీ: ఇటీవల పబ్లిక్ ఇష్యూల బాట పట్టిన వృద్ధి ఆధారిత టెక్ కంపెనీలు ఇకపైనా మరింత జోరు చూపనున్నట్లు అజయ్ త్యాగి పేర్కొన్నారు. గత 18 నెలల్లో ఐపీవోల ద్వారా ఈ సంస్థలు రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ త్యాగి తెలియజేశారు. ఈ బాటలో ఇకపైన మరో రూ. 30,000 కోట్లు సమకూర్చుకునేందుకు వృద్ధి ఆధారిత టెక్ కంపెనీలు క్యూ కడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల దాఖలైన ప్రాస్పెక్టస్‌లు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. దేశీ స్టార్టప్ వ్యవస్థలో యూనికార్న్‌లుగా ఆవిర్భవిస్తున్న కంపెనీలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. బిలియన్ డాలర్(సుమారు రూ. 7,400 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థలో పుట్టుకొస్తున్న కొత్త తరం టెక్ కంపెనీలు స్టార్టప్ వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పలు కంపెనీలు ప్రత్యేకతలు కలిగిన బిజినెస్ మోడళ్లపై దృష్టిపెడుతున్నాయని చెప్పారు. వెనువెంటనే లాభాలు అందుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేగవంత వృద్ధిని అందుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నాయని ప్రశంసించారు. పారిశ్రామిక సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో స్టార్టప్‌లకు సంబంధించి త్యాగి పలు విషయాలను ప్రస్తావించారు. ఈక్విటీకి దన్ను ఇటీవల విజయవంతమైన పబ్లిక్ ఆఫరింగ్స్‌కుతోడు మరిన్ని కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగనుండటంతో ఈక్విటీ మార్కెట్లు మరింత విస్తరించే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. టెక్ స్టార్టప్‌ల నుంచి తొలిసారిగా జొమాటో పబ్లిక్ ఇష్యూకి వచ్చి సక్సెస్ సాధించిన విషయం విదితమే. జొమాటో లిస్టింగ్‌తో టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లు అనేకం సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో పేటీఎమ్, పాలసీబజార్, మొబిక్విక్, నైకా తదితరాలున్నాయి. కొద్ది కాలంగా ఐపీవో మార్కెట్లో బూమ్ నెలకొన్నట్లు త్యాగి పేర్కొన్నారు. దీంతో 2020–21లో ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ. 46,000 కోట్ల పెట్టుబడులు సమకూరిన విషయాన్ని ప్రస్తావించారు. అంతక్రితం ఏడాది సమీకరించిన రూ. 21,000 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) ఈ స్పీడ్ మరింత పెరగనుంది. తొలి ఐదు నెలల్లో(ఏప్రిల్–ఆగస్ట్)నే దాదాపు గతేడాది సమీకరించిన నిధులను అందుకోవడం గమనార్హం! వెరసి ప్రైమరీ మార్కెట్ చరిత్రలో అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్న ఏడాదిగా 2022 నిలిచే వీలున్నట్లు త్యాగి పేర్కొన్నారు. మరింత పెరగాలి.. ఐపీవోలకు నిర్ణయించే ధరల శ్రేణి అంశంలో సంస్కరణలు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు త్యాగి వెల్లడించారు. ప్రస్తుతం ఐపీవో మార్కెట్ ధర నిర్ణయంలో సెకండరీ మార్కెట్‌తోపోలిస్తే పారదర్శకత తక్కువేనని వ్యాఖ్యానించారు. భారీగా దాఖలయ్యే ఈ డాక్యుమెంట్లలో పలు టెక్నికల్ అంశాల ప్రస్తావన ఉంటుందని, రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని చదివి, అర్ధం చేసుకోవడం సవాలేనన్నారు. చదవండి: జొమాటో ప్రస్థానం.. పిజ్జా డెలివరీపై అసంతృప్తితో -
చేతులు మారింది, యాహూ విలువ రూ.36వేల కోట్లు
హైదరాబాద్: టెక్ సంస్థ యాహూ (గతంలో వెరిజోన్ మీడియా) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థ వెల్లడించింది. యాహూ ఇకపై స్టాండెలోన్ సంస్థగా కొనసాగుతుందని పేర్కొంది. దాదాపు 5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 36,000 కోట్లు) వెరిజోన్ నుంచి యాహూలో మెజారిటీ వాటాలను అపోలోకి చెందిన ఫండ్స్ కొనుగోలు చేశాయి. యాహూలో వెరిజోన్ 10 శాతం వాటాను అట్టే పెట్టుకుంది. యాహూకి ఇది కొత్త శకమని సంస్థ సీఈవో గురు గౌరప్పన్ వ్యాఖ్యానించారు. -
దిగ్గజ టెక్ కంపెనీలపై 15 శాతం గ్లోబల్ ప్రాఫిట్ ట్యాక్స్
లండన్: ప్రపంచంలోని దిగ్గజ టెక్నాలజీ కంపెనీలపై మరొక పన్ను భారం పడనుంది. 15 శాతం గ్లోబల్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి జీ–7 దేశాలు అంగీకరించాయి. బహుళ జాతి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో గ్లోబల్ ట్యాక్స్ రేట్ 15 శాతంగా ఉండాలని తీర్మానించాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ జీ–7 దేశాల ఆర్ధిక మంత్రులతో లండన్‌లో సమావేశం జరిగింది. ఈ మేరకు ఆయా దేశాలు ఒప్పందం మీద సంతకాలు చేశాయని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ తెలిపారు. ‘ ఈ ఒప్పందంతో సరైన కంపెనీలు సరైన పన్నులను సరైన ప్రదేశాలలో చెల్లిస్తాయి’ అని రిషి ట్వీట్‌చేశారు. ఒప్పందంలో కార్పొరేట్ పన్ను విధానంలో పోటీ ధరల తగ్గింపు నియంత్రణ ధిక్కరణలు ఉండవని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి, శ్రామిక ప్రజలకు న్యాయం జరిగేలా ఉంటుందన్నారు. జూన్ 11–13 తేదీల్లో కార్న్‌వాల్‌లోని కార్బిస్బేలో జరగాల్సిన జీ–7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా 15 శాతం కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు ఇవ్వడంతో.. ఈ ప్రతిపాదనకు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు చేతులు కలిపాయి. భౌతికంగా ఉనికి లేకపోయినా సరే వ్యాపారం చేసే ఇంటర్నెట్ ఆధారిత సంస్థలకు (ఆన్లైన్ కంపెనీలు) కూడా పన్ను విధానాల సమస్యలను పరిష్కరించేందుకు జీ–7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా వరకు ఆన్లైన్ కంపెనీలు తక్కువ లేదా నో ట్యాక్స్‌లతో కార్యకలాపాలు సాగిస్తుంటాయి. -
క్యాప్‌జెమిని చైర్మన్‌గా శ్రీనివాస్ కందుల
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ క్యాప్‌జెమిని.. భారత కార్యకలాపాలకు చైర్మన్‌గా శ్రీనివాస్ కందులను నియమించింది. ఇంతకుముందు శ్రీనివాస్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సంస్థకు సేవలంచారు. తాజాగా ఆయన స్థానంలో సీఓఓ అశ్విన్ యార్డీని నియమించినట్లు క్యాప్ జెమిని ఒక ప్రకటనలో తెలియజేసింది. బ్రాండ్‌ను మెరుగుపరచటం, కీలక వాటాదారులతో సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం వంటి బాధ్యతలను ఇక నుంచి శ్రీనివాస్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. మానవ వనరుల సద్వినియోగం పరంగా ఈయనకున్న విస్తృత అనుభవంతో... అత్యున్నత స్థాయి నిపుణుల్ని తయారు చేసే బాధ్యత తీసుకుంటారని తెలిపింది. తమకు భారత్‌లో దాదాపు లక్ష మంది ఉద్యోగులున్నారని, 12 ప్రాంతాల ద్వా రా సేవలందిస్తున్నామని సంస్థ వివరించింది. -
ఇన్ఫోకస్ 3డీ స్మార్ట్‌ఫోన్@ రూ.15,999
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోకస్ పలు రకాల మొబైల్ హ్యాండ్సెట్లను భారత మార్కెట్లో విడుదలచేసింది. ‘ఎం550-3డీ’ అనే స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాతో 3డీ ఫొటోలను తీసుకోవచ్చు. అలాగే 5.5 అంగుళాల తెర కలిగిన ‘ఎం812’ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,990గా ఉంది. వీటితోపాటు మార్కెట్లోకి విడుదల చేసిన ఇతర స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.5,999గా ఉంది. ఫాక్స్‌కాన్‌తో ఇన్ఫోకస్ జట్టు: ఇన్ఫోకస్ భారత విభాగం తైవాన్‌కు చెందిన తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా ఇన్‌ఫోకస్‌కు సంబంధించిన టీవీ, ఫోన్ ఉత్పత్తులు భారత్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్లలో తయారు అవుతాయి. ఈ ఒప్పందం ద్వారా ఇన్ఫోకస్ తన మార్కెట్‌ను 2016 నాటికి 100 కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే సర్వీస్ సెంటర్ల సంఖ్యను ఈ ఏడాది చివరకు 101 నుంచి 150 పెంచనుంది. -
భారత్‌కు షియోమి స్మార్ట్ టీవీలు త్వరలో...
- ఇతర ఉపకరణాలు కూడా దశలవారీగా ప్రవేశపెడతాం - షియోమి ఇండియా హెడ్ మను హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ షియోమి మొబైల్స్‌తోపాటు ఇతర ఉపకరణాలను భారత్‌కు తీసుకొస్తోంది. స్మార్ట్ టీవీ, హెడ్‌ఫోన్స్, 1 టీబీ నుంచి 6 టీబీ బిల్ట్ ఇన్ స్టోరేజ్‌తో కూడిన వైఫై రౌటర్స్, కెమెరాలను ఇతర దేశాల్లో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఎంఐ బ్యాండ్ ఫిట్నెస్ ట్రాకర్‌తోపాటు పవర్ బ్యాంక్స్, ఎల్ఈడీ లైట్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. ఈ ఏడాదే ఎంఐ బాక్స్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఇది స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్. సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మలుస్తుంది. ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. స్మార్ట్ టీవీ ఈ ఏడాది చివరికి లేదా 2016 ప్రారంభంలో తీసుకొస్తామని షియోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇక 5.7 అంగుళాల ఎంఐ నోట్ కొద్ది రోజుల్లో విడుదల చేస్తామన్నారు. ఇతర వ్యయాలను గణనీయంగా తగ్గించడంతోపాటు ఆన్లైన్లో విక్రయిస్తున్న కారణంగా ఉత్పత్తులను అతి తక్కువ ధరలో అందించే వీలైందన్నారు. తయారీ ఈ ఏడాదే..: బెంగళూరులో ఆర్అండ్డీ కేంద్రాన్ని షియోమి ఏర్పాటు చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఈ కేంద్రంలో నూతన మొబైల్స్‌కు డిజైన్ చేస్తామని మను కుమార్ తెలిపారు. తయారీ ప్లాంటు ఏర్పాటు ఈ ఏడాదే కార్యరూపంలోకి వస్తుందన్నారు. 2014 జూలై చివర్లో భారత్‌లో అడుగు పెట్టామని, తొలి నాలుగు నెలల్లో 10 లక్షలకుపైగా ఫోన్లను విక్రయించామని పేర్కొన్నారు. ఐడీసీ తాజా గణాంకాల ప్రకారం షియోమి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 4% వాటాతో 5వ స్థానంలో ఉందన్నారు. షియోమికి ఫోన్లను సరఫరా చేస్తున్న రెండు ప్రధాన కంపెనీల్లో ఫాక్స్‌కాన్ ఒకటి. శ్రీసిటీ ప్లాంటులో షియోమికి రోజుకు 10,000 ఫోన్లను ఫాక్స్‌కాన్ తయారు చేయనుందని వస్తున్న వార్తలను ఆయన ధ్రువీకరించలేదు.