These IT Professionals Doubled their Salaries in India - Sakshi
Sakshi News home page

దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. డబుల్‌ శాలరీలను ఆఫర్‌ చేస్తున్న కంపెనీలు!

Published Sun, May 7 2023 4:14 PM | Last Updated on Sun, May 7 2023 6:39 PM

These It Professionals Doubled Salaries In India - Sakshi

ఓపెన్ ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ టెక్నాలజీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంది. ఆర్ధిక మాంద్యంలోనూ లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. దీంతో ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో నిష‍్ణాతులైన నిపుణులకు డబుల్‌ శాలరీలను ఆఫర్‌ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

నాస్కామ్ అంచ‌నా ప్ర‌కారం భార‌త్‌లో ప్ర‌స్తుతం 4.16 ల‌క్ష‌ల ఏఐ నిపుణులు ఉండగా..మ‌రో 2.13 ల‌క్ష‌ల మంది అద‌న‌పు ఏఐ ఇంజినీర్ల‌కు డిమాండ్ నెల‌కొంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ నుండి యూరప్, ఆసియా దేశాల్లో ఏఐలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. చాట్‌జీపీటీ రాకతో గూగుల్‌, బైదు వంటి దిగ్గజ సంస్థలు సొంత సెర్చ్‌ ఇంజిన్‌లను తయారు చేసే పనిలో పడ్డాయి. ఇలా ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా మిగిలిన సెక్టార్‌లలో ఏఐల కొరత తీవ్రంగా ఉంది. 



టెక్నాలజీయేత‌ర‌ రంగంలోనూ డిమాండ్‌
హెల్త్‌, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ వరకు దాదాపు ప్రతి రంగంలో ఏఐ నిపుణుల అవసరం ఏర్పడింది. ఆ కొరతను అధిగమించేందుకు ఇందుకోసం ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు ముట్టజెప్తున్నాయి ఆయా సంస్థలు. అంతేకాదు ఏఐ విభాగంలో ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మరో కంపెనీలో చేరే సమయంలో 35 శాతం నుంచి 50 శాతం వరకు వేతనాన్ని అదనంగా చెల్లిస్తున్నాయి. అయినా ఏఐలో నిష్ణాతులైన ఉద్యోగులు కావాల్సి ఉంది. 

భారత్‌లో ఏఐ నిపుణలు కొరత 
ప్రస్తుతం, స్కామ్ లెక్కల ప్రకారం దేశంలో సుమారు 5.4 మిలియన్ల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్‌-19 లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఐటీ రంగానికి వెన్నెముక‌గా నిలిచిన భార‌త్‌ సైతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. డిమాండ్‌ దృష్ట్యా ఆ రంగంలోని ఉద్యోగులకు కంపెనీలు అధికంగా వేతనాలు అందిస్తున్నాయి. 

ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్‌లు
అమెరికా సియోటెల్‌ కేంద్రంగా స్టార్ట‌ప్ ఫ్లెక్సికార్‌  కార్‌ షేరింగ్‌ (ఓలా తరహాలో) సేవల్ని అందిస్తుంది. ఆ సంస్థ ఇప్పుడు బెంగ‌ళూరు డేటా సైన్స్ హ‌బ్‌లో కంప్యూట‌ర్ విజ‌న్ స్పెష‌లిస్టులు, ఇంజినీర్ల టీం నిర్మిస్తున్న‌ది. ఈ సందర్భంగా ఏఐ నిపుణుల కోసం ఆయా టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు చేస్తున్న ఆఫర్‌లు విచిత్రంగా ఉన్నాయని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (cfo) ఫ్రీడమ్‌ డుమ్‌లావ్‌ అన్నారు. తాను ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు. ఇంటర్వ్యూ సందర్భంగా సదరు ఉద్యోగి తన కంపెనీలో చేరితే శాలరీతో పాటు బీఎండబ్ల్యూ బైక్‌ను ఇచ్చేందుకు మరో సంస్థ ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు టెక్నాలజీ రంగంలో ఏఐల కొరత ఏ విధంగా ఉందోనని వ్యాఖ్యానించారు.      
 
గూగుల్‌ ఐదుగురు ఉద్యోగులతో ప్రారంభమై..
ఇక, కృత్తిమ మేధ నిపుణుల కొరతను అధిగమించేందుకు దేశీయ టెక్‌ కంపెనీ టీసీఎస్‌ ఔట్‌ సోర్స్‌ విధానంపై దృష్టి సారించినట్లు నివేదికలు చెబుతున్నాయి. సపోర్ట్‌, సర‍్వీస్‌, సాఫ్‌వేర్‌ తయారీల కోసం టీసీఎస్‌ వరల్డ్‌ వైడ్‌గా టెక్‌ నిపుణుల కోసం అన్వేషిస్తుంది. ఇక భారత్‌లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లు సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. 2004లో గూగుల్‌ భారత్‌లో ఐదు మంది ఉద్యోగులతో సేవల్ని ప్రారంభింది. ఇప్పుడు దాదాపు 10,000 మంది ఉద్యోగులున్నారు. 

2లక్షల మంది నిపుణుల అవసరం
ఇప్పుడు అదే గూగుల్‌ సైతం దేశీయంగా ఏఐ ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటుంది. దేశంలో ఏఐ, డేటా సైన్స్‌లో దాదాపు 416,000 మంది పని చేస్తున్నారు. మరో 213,000 మంది కావాలని నాస్కామ్ అంచనా వేసింది. 

తక్కువ జీతం..
త‌క్కువ వేత‌నాల కోసం స్కిల్డ్ నిపుణుల కోసం ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థ‌లు 2022లో భార‌త్‌లో 66 టెక్ ఇన్నోవేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేశాయి. వాటి సంఖ్య 1600కి చేరింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు లేదా క్యాప్టివ్‌లు అని పిలిచే ఈ కేంద్రాల్లో ఐటీ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ వంటి టాస్క్‌లను నిర్వహిస్తుంటారు ఉద్యోగులు. 

భారత్‌వైపు.. ప్రపంచ ఐటీ కంపెనీల చూపు
బెంగళూరులో ప్రపంచంలోని పలు దిగ్గజం కంపెనీలు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలల్లో అసెట్ మేనేజర్ అలయన్స్‌బెర్న్‌స్టెయిన్ హోల్డింగ్ ఎల్‌పీ, కార్ రెంటల్ కంపెనీ అవిస్ బడ్జెట్ గ్రూప్, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ కు చెందిన డిస్కవరీ ఇంక్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ తయారీ సంస్థ ప్రాట్ & విట్నీ, గోల్డ్‌మన్ సాచ్‌, వాల్‌మార్ట్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొఫెషనల్స్‌కు భారీ ప్యాకేజీలు అందిస్తున్నాయి. 

చివరిగా
చివరిగా..కొత్తగా ఐటీ రంగంలోకి వచ్చేవారు, కెరీర్‌ గ్యాప్‌ ఉన్నవారు, లేదంటే ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తూ టెక్నాలజీ రంగంలో పనిచేయాలనుకునే వారు  ప్యాకేజీ గురించి ఆలోచించకుండా నైపుణ్యం పెంచుకోవడంపైనే ఫోకస్‌ చేయాలి. డేటా సైంటిస్ట్‌,మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యం సంపాదిస్తే కోరుకున్న కలల ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని టెక్నాలజీ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్‌ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement