
హైదరాబాద్: అగ్రగామి టెక్నాలజీ ఆవిష్కర్త మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో (ఎన్ఎస్ఈ) లిస్టయిన నేపథ్యంలో తదుపరి దశ వృద్ధిని వేగవంతంగా సాధించడంపై దృష్టి పెడుతోంది. ఒకవైపు గణనీయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూనే మరోవైపు ఏఐ ఆధారిత పరివర్తనపై మరింతగా దృష్టి సారిస్తూ ఈ-సర్వైలెన్స్, స్కానలిటిక్స్ లాంటి వీడియో అనలిటిక్స్ సొల్యూషన్స్, డీప్-టెక్ సొల్యూషన్స్ మొదలైన వాటిల్లో కార్యకలాపాలను విస్తరిస్తోంది.
అధునాతన డ్రోన్ టెక్నాలజీలో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ, మాజిల్లానిక్ క్లౌడ్ సంస్థ దేశీయంగా 200 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలిగే, వాణిజ్యావసరాలకు అందుబాటులో ఉన్న, అత్యంత శక్తిమంతమైన కార్గో డ్రోన్ అయిన కార్గోమ్యాక్స్ 200KHCని (CargoMax 200KHC) కూడా ఆవిష్కరించింది. బీఎఫ్ఎస్ఐ, టెలికం, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ తదితర రంగాల కోసం కస్టమైజ్ చేసిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ ఏఐ లాంటి అధునాతన కృత్రిమ మేథ సాంకేతికతల ద్వారా లభించే అవకాశాలు ఈ మార్గదర్శ ప్రణాళికకు కీలకంగా ఉండనున్నాయి. ఇటు ఆర్గానిక్‌గాను అటు వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా ఇనార్గనిక్‌గాను వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా మాజిల్లానిక్ క్లౌడ్ దృష్టి పెడుతోంది.
“సెక్యూరిటీ భవిష్యత్తనేది ఏఐ, సర్వైలెన్స్ కలబోతపై ఆధారపడి ఉంది. తెలంగాణలోని మా కార్యాలయాలు, ముడి డేటాను ఇటు పబ్లిక్ అటు ప్రైవేట్ రంగ క్లయింట్లు తగు నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే మేథోసంపత్తిగా తీర్చిదిద్దే, అధునాతన వీడియో అనలిటిక్స్ సిస్టంలను అభివృద్ధి చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా దోహదపడతాయి” అని మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మ తెలిపారు.
“తెలంగాణ పురోగామి విధానాలు, ప్రతిభావంతుల లభ్యత కారణంగా మా కార్యకలాపాల విస్తరణకు ఇది అనువైన ప్రాంతంగా ఉంది. మేము స్థానికంగా అభివృద్ధికి దోహదపడుతూనే అటు అంతర్జాతీయ క్లయింట్లకు కూడా సేవలు అందించేందుకు మాకు తోడ్పడుతోంది” అని జోసెఫ్ సుధీర్ తుమ్మ వివరించారు.