ఇన్‌ఫోకస్ 3డీ స్మార్ట్‌ఫోన్@ రూ.15,999 | In Focus 3D smartphone @ Rs .15,999 | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫోకస్ 3డీ స్మార్ట్‌ఫోన్@ రూ.15,999

Published Wed, Jul 29 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

ఇన్‌ఫోకస్ 3డీ స్మార్ట్‌ఫోన్@ రూ.15,999

ఇన్‌ఫోకస్ 3డీ స్మార్ట్‌ఫోన్@ రూ.15,999

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ఇన్‌ఫోకస్ పలు రకాల మొబైల్ హ్యాండ్‌సెట్లను భారత మార్కెట్‌లో విడుదలచేసింది. ‘ఎం550-3డీ’ అనే స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాతో 3డీ ఫొటోలను తీసుకోవచ్చు. అలాగే 5.5 అంగుళాల తెర కలిగిన ‘ఎం812’ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,990గా ఉంది. వీటితోపాటు మార్కెట్‌లోకి విడుదల చేసిన ఇతర స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.5,999గా ఉంది.

 ఫాక్స్‌కాన్‌తో ఇన్‌ఫోకస్ జట్టు: ఇన్‌ఫోకస్ భారత విభాగం తైవాన్‌కు చెందిన తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా ఇన్‌ఫోకస్‌కు సంబంధించిన టీవీ, ఫోన్ ఉత్పత్తులు భారత్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్లలో తయారు అవుతాయి. ఈ ఒప్పందం ద్వారా ఇన్‌ఫోకస్ తన మార్కెట్‌ను 2016 నాటికి 100 కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే సర్వీస్ సెంటర్ల సంఖ్యను ఈ ఏడాది చివరకు 101 నుంచి 150 పెంచనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement