Apple only company ever to reach USD 3 trillion in market cap - Sakshi
Sakshi News home page

వన్‌ అండ్‌ ఓన్లీ యాపిల్‌: కీలక మైలురాయిని అధిగమించిన యాపిల్‌ 

Published Sat, Jul 1 2023 3:36 PM | Last Updated on Sat, Jul 1 2023 4:24 PM

Apple only company ever to reach usd 3 trillion in market cap - Sakshi

న్యూఢిల్లీ:  టెక్‌దిగ్గజం యాపిల్ కీలక మైలురాయిని చేరుకుంది.  యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్‌లో 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.   ఈ మైలురాయిని అధిగమించిన  ఏకైక కంపెనీగా నిలిచింది. ఇటీవల యాపిల్‌ షేర ధర ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్‌ వ్యాల్యూ బాగా పెరిగింది. (టీసీఎస్‌: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట)

ప్రపంచంలోనే తొలిసారి 3 ట్రిలియన్​ డాలర్ల విలువతో ట్రేడింగ్ డేను ముగించిన పబ్లిక్ కంపెనీగా యాపిల్ నిలిచింది. యాపిల్‌ శుక్రవారం 1 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 191.34 డాలర్లను తాకాయి. దీంతో యాపిల్‌ మార్కెట్‌ క్యాప్‌ రికార్దు స్థాయికి చేరింది. జనవరి 3, 2022న, ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 3 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది కానీ ముగింపులో నష్టపోయింది. ఈ 3 ట్రిలియన్ మార్కును  దాటి ఈ ఘనతను సాధించిన ఏకైక కంపెనీ యాపిల్‌. వచ్చే ఏడాది విక్రయానికి రానున్న విజన్ ప్రో, ఆగ్మెంటెడ్ రియాలిటీ పరికరం ప్రివ్యూ  టెక్‌  ప్రియులను ఆకట్టుకుంది.  (ఆధార్‌-ప్యాన్‌ లింక్‌ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన)

 కాగా 2022తో పోలిస్తే ఈ ఏడాది స్టాక్ మార్కెట్ లాభం యాపిల్‌కు కలసి వచ్చింది. 2021 తరువాత తొలిసారి  2023 ప్రారంభంలో మార్కెట్ క్యాప్  స్థాయినుంచి 2 ట్రిలియన్ల దిగువకు పడిపోయింది. ఆతరువాత మార్కెట్‌ పుంజుకోవడంతో యాపిల్‌ షేరు  ఈ ఏడాది  దాదాపు 46 శాతం  పెరిగడంతో మార్కెట్‌ క్యాప్‌ పరంగా టాప్‌లో నిలిచింది.  (థ్యాంక్స్‌ టూ యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌, లేదంటే నా ప్రాణాలు: వైరల్‌ స్టోరీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement