న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ టాప్‌లోకి దూసుకొచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దిగ్గజ కంపెనీలు మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ మూడింటినీ బీట్ చేసింది. నవంబరు 3 ముగింపు నాటికి యాపిల్ 2.307 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెజాన్, ఆల్ఫాబెట్ మెటాల మొత్తం మార్కెట్ క్యాప్ 2.306 ట్రిలియన్లకు మాత్రమే కావడం గమనార్హం.
బిజినెస్ ఇన్‌సైడర్ అందించిన వివరాల ప్రకారం గత రెండు సెషన్లలో, యాపిల్ షేర్లు 0.16 శాతం పెరిగాయి. మరోవైపు టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్, మెటా , అమెజాన్ షేర్లు పడిపోయాయి. మెటా 7.6 శాతం పడిపోగా, అమెజాన్ 17 శాతం ఆల్ఫాబెట్ షేర్లు 5.7 శాతం క్షీణతనునమోదు చేశాయి.(Elon Musk షాక్‌ల మీద షాక్‌లు: కాస్ట్ కటింగ్‌పై భారీ టార్గెట్)
ఫలితంగా అమెజాన్ మార్కెట్ క్యాప్ 939.78 బిలియన్ డాలర్లుగా ఉందని నివేదించింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా 240.07 బిలియన్ డాలర్లు.అయితే, గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్1.126 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.ఇదిలా ఉంటే చైనీస్ న్యూఇయర్‌కు ముందే ఇండియాలో అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభించాలని యాపిల్ యోచిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment