ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా తయారుచేసిన లామా ఏఐ చాట్‌బాట్‌ను యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారని వస్తున్న వార్తలపై యాపిల్ స్పష్టతనిచ్చింది. రెండు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదని యాపిల్ వర్గాలు తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
జనరేటివ్‌ఏఐకు ఆదరణ పెరుగుతుండడంతో యాపిల్ ఉత్పత్తుల్లోనూ ఈ టెక్నాలజీను వినియోగించాలని సంస్థ యోచిస్తోంది. దాంతో గతంలో పలు కంపెనీలతో చర్చలు జరిపింది. అందులో భాగంగానే మార్చిలో మెటాతోనూ చర్చించింది. అయితే గోప్యతాపరమైన కారణాల వల్ల ఈ భాగస్వామ్యం కుదరలేదని చెప్పింది. ఇటీవల యాపిల్ ప్రొడక్ట్‌ల్లో మెటా కంపెనీకు చెందిన లామా చాట్‌బాట్‌ను వినియోగించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో బ్లూమ్‌బర్గ్ వేదికగా యాపిల్ వర్గాలు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాయి. అలాంటి చర్చలు ఏవీ జరగడం లేదని స్పష్టం చేశాయి.
ఇదీ చదవండి: రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!
ఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్‌ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఈ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. ఈ ఏడాది చివరకు విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను అందించనున్నట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment