అమెరికాలో రేవంత్ బృందంతో సంస్థ ప్రతినిధులు భేటీ
ఆర్థిక సేవల రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పన!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సేవల రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన ‘చార్లెస్ స్క్వాబ్’ హైదరాబాద్‌లో నూతన సాంకేతిక అభివృద్ధి కేంద్రం (టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. చార్లెస్ స్క్వాబ్ భారత్ లో ఏర్పాటు చేసే తొలి డెవలప్‌మెంట్ సెంటర్ ఇదే కావడం గమనార్హం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతి నిధి బృందంతో చార్లెస్ స్క్వాబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హోవార్డ్, రామ బొక్కా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో చర్చల సందర్భంగా హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల ప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. చార్లెస్ స్క్వాబ్‌కు ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన తుది అను మతుల కోసం చార్లెస్ స్క్వాబ్ వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపనున్నట్లు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పా టు ద్వారా ఆర్థిక సేవల రంగంలో ఉద్యోగ అవకాశాల కల్ప నకు వీలవుతుందని, ఈ రంగంలో హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.
‘కామ్‌కాస్ట్’ ప్రతినిధులతో శ్రీధర్‌బాబు
అంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ కంపెనీ ‘కామ్‌కాస్ట్’కు చెందిన సీనియర్ ప్రతినిధి బృందం.. మంత్రి శ్రీధర్‌బాబు తో భేటీ అయింది. తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపా ధి కల్పన లక్ష్యంగా అనేక సంస్థలతో వ్యూహాత్మక, భాగస్వా మ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ భేటీలో కామ్‌కాస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెల్ పెన్నా, సీటీఓ రిక్ రియోబొలి, సీఐఓ మైక్ క్రిసాఫుల్లి పాల్గొన్నారు.
అభివృద్ధిని వేగవంతం చేసేందుకే..
సీఎం బృందం అమెరికా పర్యటనలో భాగంగా పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలపై విమ ర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతినిధి బృందంలోని అధికారు లు వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే దిశలోనే వివిధ సంస్థలతో చర్చలు ఒప్పందాలు జరుగుతు న్నట్లు వెల్లడించారు. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రోడ్ షోలు, వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుగుతు న్నాయి. సీఎం కూడా అనేక బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. భవిష్యత్తు సమావేశా ల్లోనూ రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తాం..’ అని ఐటీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి
‘ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం జరిపిన భేటీ ఆసక్తికరంగా, ఫలప్రదంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి చూపించింది. పట్టణీకరణ, కాలుష్య రహిత నగరాలకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఆసక్తి చూపింది. పట్టణీకరణ ద్వారా ఎదురయ్యే మురుగునీరు, తాగునీటి సమస్యల పరిష్కా రానికి రాష్ట్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది..’ అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు.
కాలిఫోర్నియా చేరుకున్న సీఎం బృందం
రేవంత్‌రెడ్డి బృందం గురువారం కాలిఫోర్నియాకు చేరుకుంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, డాలస్, టెక్సా స్‌లో పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చిన బృందానికి ఘన స్వాగతం లభించింది. కాలిఫోర్నియాలో దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఈ బృందం భేటీ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment