Development Center
-
హైదరాబాద్‌లో చార్లెస్ స్క్వాబ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సేవల రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన ‘చార్లెస్ స్క్వాబ్’ హైదరాబాద్‌లో నూతన సాంకేతిక అభివృద్ధి కేంద్రం (టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. చార్లెస్ స్క్వాబ్ భారత్ లో ఏర్పాటు చేసే తొలి డెవలప్మెంట్ సెంటర్ ఇదే కావడం గమనార్హం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతి నిధి బృందంతో చార్లెస్ స్క్వాబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హోవార్డ్, రామ బొక్కా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో చర్చల సందర్భంగా హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల ప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. చార్లెస్ స్క్వాబ్‌కు ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన తుది అను మతుల కోసం చార్లెస్ స్క్వాబ్ వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపనున్నట్లు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పా టు ద్వారా ఆర్థిక సేవల రంగంలో ఉద్యోగ అవకాశాల కల్ప నకు వీలవుతుందని, ఈ రంగంలో హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.‘కామ్‌కాస్ట్’ ప్రతినిధులతో శ్రీధర్బాబుఅంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ కంపెనీ ‘కామ్‌కాస్ట్’కు చెందిన సీనియర్ ప్రతినిధి బృందం.. మంత్రి శ్రీధర్‌బాబు తో భేటీ అయింది. తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపా ధి కల్పన లక్ష్యంగా అనేక సంస్థలతో వ్యూహాత్మక, భాగస్వా మ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ భేటీలో కామ్‌కాస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెల్ పెన్నా, సీటీఓ రిక్ రియోబొలి, సీఐఓ మైక్ క్రిసాఫుల్లి పాల్గొన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకే..సీఎం బృందం అమెరికా పర్యటనలో భాగంగా పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలపై విమ ర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతినిధి బృందంలోని అధికారు లు వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే దిశలోనే వివిధ సంస్థలతో చర్చలు ఒప్పందాలు జరుగుతు న్నట్లు వెల్లడించారు. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రోడ్ షోలు, వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుగుతు న్నాయి. సీఎం కూడా అనేక బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. భవిష్యత్తు సమావేశా ల్లోనూ రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తాం..’ అని ఐటీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి‘ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం జరిపిన భేటీ ఆసక్తికరంగా, ఫలప్రదంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి చూపించింది. పట్టణీకరణ, కాలుష్య రహిత నగరాలకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఆసక్తి చూపింది. పట్టణీకరణ ద్వారా ఎదురయ్యే మురుగునీరు, తాగునీటి సమస్యల పరిష్కా రానికి రాష్ట్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది..’ అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు.కాలిఫోర్నియా చేరుకున్న సీఎం బృందం రేవంత్‌రెడ్డి బృందం గురువారం కాలిఫోర్నియాకు చేరుకుంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, డాలస్, టెక్సా స్లో పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చిన బృందానికి ఘన స్వాగతం లభించింది. కాలిఫోర్నియాలో దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఈ బృందం భేటీ అవుతుంది. -
విశాఖలో విప్రో విస్తరణ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ పరిశ్రమలకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు సంస్థలు తమ శాఖల్ని ఇక్కడ విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో దిగ్గజ ఐటీ సంస్థ విప్రో చేరింది. విశాఖలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్టు ఆ సంస్థ ‘ప్రాజెక్ట్ లావెండర్’ పేరు తో ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాల్ని ఈ మెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం, ఎపిటా జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సంస్థ ప్రకటనతో విశాఖ ఐటీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఇప్పుడు మహా నగరాల నుంచి టైర్–2 సిటీల వైపు చూస్తున్నాయి. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్ మొదలైన ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులేస్తున్నాయి. ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాజాగా విప్రో కూడా అదే బాటలో విశాఖలో విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ సమయంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు.. తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపించని నేపథ్యంలో వారి వద్దకే వెళ్లేందుకు ఐటీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యయాల్ని తగ్గించుకునేందుకు ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా విప్రో కూడా విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది. ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో.. విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ డెవలప్మెంట్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారికి విప్రో సంస్థ లేఖలు రాసింది. విశాఖ కేంద్రంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. ఈ తరుణంలో తాజాగా విశాఖలో డేటా సెంటర్ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధి చెందుతున్న నగరాల్లో తమ సంస్థ డెవలప్మెంట్ సెంటర్‌ను విస్తరించేందుకు ప్రాజెక్ట్ లావెండర్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా తొలి అడుగు విశాఖలో వేస్తున్నట్టు విప్రో స్పష్టం చేసింది. వైఎస్సార్ హయాంలో నాంది సత్యం జంక్షన్లో వైఎస్సార్ హయాంలో 2006 మేలో విప్రో క్యాంపస్‌కు ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం మూడున్నరేళ్ల తర్వాత విప్రో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 750 మందితో ప్రారంభించాలని భావించినా.. తొలుత 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే కోవిడ్ సమయంలో క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ కార్యకలాపాల జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులతో చర్చించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(ఎపిటా) గ్రూప్ సీఈవో కిరణ్‌రెడ్డి విప్రో ప్రతినిధి శశికుమార్‌తో పలు దఫా లుగా చర్చలు జరిపి.. విస్తరించేందుకు ఆహా్వనించారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన విప్రో.. కా ర్యకలాపాలు ప్రారంభించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించింది. మౌలిక సదుపాయాల పనులు పూర్తి విశాఖలో విస్తరణకు విప్రో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తోంది. గత క్యాంపస్‌లో కొంత భాగం ఇప్పటికే అద్దెకు ఇచ్చిన విప్రో.. ముందు భవనంలో ఇప్పటికే సేవలు ప్రారంభించింది. ఈ భవనంలోని అన్ని ఫ్లోర్లలోనూ తమ సంస్థ మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇందులో అద్దెకు ఇచ్చిన వారిని ఖాళీ చేయించారు. వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే వీడీఐ ప్రాజెక్టులతో కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికే 1000 మందికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల్ని దాదాపు పూర్తి చేసింది. మానవ వనరుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం సంస్థ సేవల్ని విశాఖలో విస్తరిస్తామని ప్రభుత్వంతో విప్రో స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి కల్లా 1000 సీట్లకు పెంచుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు విప్రో ప్రతినిధులు హామీ ఇవ్వడం శుభపరిణామం. వైజాగ్‌లో టాలెంట్, అప్‌స్కిల్లింగ్, అనుభవజు్ఞలైన నిపుణుల్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. భవిష్యత్తులో ఏ క్లైయింట్ వచ్చినా.. ఇక్కడికే తీసుకురావాలని సూచించాం. దానికి కావాల్సిన మానవ వనరుల్ని అందిస్తామన్నాం. దానికి విప్రో ప్రతినిధులు కూడా అంగీకరించారు. ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహకారంతో పాటు విప్రో ప్రాజెక్టులకు అవసరమైన రిక్రూట్మెంట్కు కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాం. – కిరణ్‌రెడ్డి, ఎపిటా గ్రూప్ సీఈవో -
హైదరాబాద్‌లో ఎక్స్‌ఫెనో రిక్రూట్మెంట్ డెలివరీ కేంద్రం ప్రారంభం
ఇండియన్ స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీల్లో ఒకటైన ఎక్స్‌ఫెనో హైదరాబాద్‌లో రిక్రూట్మెంట్ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో సేవలు అందించనున్నారు. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ టి-హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యం అతిథిగా పాల్గొని ఆర్డీసీని ప్రారంభించారు. అలాగే టీపాజిటివ్ (బిల్డింగ్ అండ్ సస్టేనింగ్ ఏ టాలెంట్ పాజిటివ్ తెలంగాణ) పేరుతో వివిధ కంపెనీల్లోని సీఎక్స్ఓ, హెచ్ఆర్ పరిశోధన నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన సంస్థలతో పాటు, యునికార్న్‌లు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా టెక్ ఉద్యోగుల ఉన్న హైదరాబాద్‌కు ఈ నివేదిక ఎంతో ఉపయోగమని అన్నారు. ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ మాట్లాడుతూ.. దేశంలో తమ టెక్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైనదని అన్నారు. తెలంగాణలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఎక్స్‌ఫెనో హైదరాబాద్ ఆపరేషన్స్ విభాగాధిపతి సతీష్ మన్నె అన్నారు. ‘ఉమెన్ ఇన్ ది వర్క్‌ఫోర్స్’ అనే అంశంపై ఇంటరాక్షన్ సెషన్ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు అనిల్ ఏతానూర్, పెగా సిస్టమ్స్ హెచ్ఆర్ స్మృతి మాథుర్, ది స్టార్ ఇన్ మీ సహ వ్యవస్థాపకుడు ఉమా కాసోజీ, హెచ్ఆర్ఎస్ఎస్ డీఎస్ఎం గ్లోబల్ డైరెక్టర్ డా.దినేష్ మురుగేశన్ పాల్గొన్నారు. ఎక్స్‌ఫెనో ఇప్పటి వరకు 12,000 మంది ఇంజినీర్లను నియమించింది. ఆర్డీసీ ద్వారా స్పెషలిస్ట్ టాలెంట్ సోర్సింగ్, లీడర్షిప్ హైరింగ్, టాలెంట్ డిప్లాయ్‌మెంట్, మేనేజ్మెంట్ సేవలు అందిస్తుంది. టాలెంట్ ఎంగేజ్మెంట్కు సంబంధించిన అనేక ఆన్ డిమాండ్ ఆఫర్లను కూడా కల్పిస్తుంది. -
వేరుశనగ నూతన వంగడం @ కదిరి
వేరుశనగ సాగుకు దేశంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా పేరుగాంచింది. కానీ అతివృష్టి, అనావృష్టి, చీడపీడలతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూసేవారు. ఈ క్రమంలోనే కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతుకు అండగా నిలిచారు. పరిశ్రమిస్తూ.. పరిశోధన చేస్తూ నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు తట్టుకునే విత్తనాన్ని ఉత్పత్తి చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. కదిరి: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రం రాష్ట్రానికే తలమానికం. ఇక్కడ ఉత్పత్తి చేసిన వేరుశనగ విత్తన రకాలు దేశ వ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దాదాపు 14 రకాల నూతన వంగడాలను కదిరి పరిశోధన స్థానం ఉత్పత్తి చేసింది. జాతీయ వేరుశనగ ఉత్పత్తిలో 50 శాతం కే–6 వంగడానిదే కావడం గమనార్హం. అనంత నుంచి కదిరికి మార్పు.. 1954లో ప్రాంతీయ నూనె గింజల పరిశోధన కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేశారు. పరిశోధనకు అనువైన వాతావరణ పరిస్థితులు, తగిన నేలకోసం 1959లో కదిరికి తరలించారు. 1982లో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి అనుబంధం చేశారు. 1985లో పూర్తిస్థాయి పరిశోధన కేంద్రంగా మారింది. అనేక మంది శాస్త్రవేత్తలు 40 ఎకరాల విస్తీర్ణంలోని పొలాల్లో నిరంతరం శ్రమిస్తుంటారు. ఒక కొత్తరకం వంగడం కనుక్కొని విడుదల చేయడానికి 8 ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూలవిత్తనంపై 50 శాతం సబ్సిడీ.. కదిరి పరిశోధన స్థానం విడుదల చేసిన వేరుశనగ మూల విత్తనాన్ని రైతులకు జగన్ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఇస్తోంది. చంద్రబాబు హయాంలో ఈ సబ్సిడీని ఎత్తేశారు. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం రాయితీని తిరిగి పునరుద్ధరించింది. కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మూలవిత్తనం తీసుకెళ్లి పండించిన దిగుబడులను సైతం మళ్లీ రైతులు ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. మూలవిత్తనం కొనుగోలు సమయంలోనే ఇక్కడి శాస్త్రవేత్తలు దిగుబడుల కొనుగోలుపై రైతులతో ఒప్పందం చేసుకుంటారు. పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు.. కదిరి–1(కె–1), కదిరి–2(కె–2), కదిరి–3(కె–3), వేమన, కదిరి–4(కె–4), కదిరి–5(కె–5), కదిరి–6(కె–6), కదిరి–7(కె–7), కదిరి–8(కె–8), కదిరి–9(కె–9), కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి ఇలా మొత్తం 14 నూతన వంగడాలను కనుగొని మార్కెట్లోకి విడుదల చేశారు. 1971లో మొట్టమొదట కే1 రకం ఇక్కడ విడుదల చేశారు. ప్రస్తుతం అధిక దిగుబడి నిచ్చి, బెట్టను బాగా తట్టుకునే కదిరి–6, కదిరి 7, కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి–9, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి(కె1812) రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అధిక దిగుబడినిచ్చే రకాలు.. కదిరి లేపాక్షి (కె1812): ఈ వంగడాన్ని 2020 సంవత్సరంలో విడుదల చేశారు. ఖరీఫ్‌లో హెక్టారుకు 35 క్వింటాళ్లు, రబీలో 45 నుంచి 50 క్వింటాళ్ల దాకా దిగుబడినిస్తుంది. పంట కాలం 112 రోజులు. ఆకుమచ్చ, వైరస్ తెగులు, రసం పీల్చే పచ్చదోమ, తామర వంటి చీడపీడలను బాగా తట్టుకోగలదు. బెట్ట పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. కదిరి అమరావతి: ఈ రకం విత్తనాన్ని 2016లో విడుదల చేశారు. ఇది కె–6, ఎన్సీఏసి 2242 రకాలను సంకరణ చేసి అభివృద్ధి చేసిన గుత్తి రకం. 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికొస్తుంది. హెక్టారుకు 1,705 కిలోల దిగుబడినిస్తుంది. నీటి ఆధారంగా సగటున 2,590 కిలోల దిగుబడి వస్తుంది. మొవ్వకుళ్లు, ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులతో పాటు బెట్టను కూడా బాగా తట్టుకోగలదు. కదిరి–6(కె–6) : ఈ విత్తనం 2002లో విడుదలైంది. గింజ పరిమాణం జేఎల్ 24 కన్నా 5 శాతం పెద్దగా ఉంటుంది. పంట కాలం 110 రోజులు. ఖరీఫ్‌లో ఎకరాకు 800 నుంచి 880, రబీలో 1,600 నుంచి 1,700 కిలోల దిగుబడి నిస్తుంది. ఆకర్షణీయమైన గింజ నాణ్యత వల్ల మన దేశ ఎగుమతిలో 60 శాతం కె–6 రకం ఉంది. దేశ వేరుశనగ విస్తీర్ణంలోనూ 50 శాతం వరకు ఆక్రమించింది. దీన్ని ‘ఫ్రైడ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. కదిరి–7(కె–7): ఇది పెద్ద గుత్తి రకం విత్తనం. పంట కాలం ఖరీఫ్‌లో 120 నుంచి 125 రోజులు, రబీలో 130 నుంచి 135 రోజులు. దీన్ని 2009లో విడుదల చేశారు. ఆకుమచ్చ, తామర పురుగులను బాగా తట్టుకుంటుంది. వంద గింజల బరువు 70 గ్రాముల వరకు ఉంటుంది. 40 రోజుల వరకు పరిపక్వ నిద్రావస్థలో ఉంటుంది. ఎగుమతికి, పచ్చికాయలకు అధిక గిరాకి ఉండే రకం. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుండి 1,000 కిలోలు, రబీలో అయితే 1,800 నుండి 2,000 కిలోల దిగుబడి నిస్తుంది. కదిరి–8(కె–8): ఇది కూడా పెద్ద గుత్తిరకం. దీన్ని 2009లో విడుదల చేశారు. 100 గింజల బరువు 75 గ్రాములు ఉంటుంది. తామర పురుగులను తట్టుకోగలదు. నీటి వసతి, సారవంతమైన భూములకు అనుకూలమైన రకం. పంటకాలం ఖరీఫ్‌లో 120 రోజులు, రబీలో 130 రోజులు. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుండి 1,000 కిలోలు, రబీలో 1,800 నుంచి 2,000 కిలోల దిగుబడినిస్తుంది. కదిరి–9(కె–9): ఈ వంగడాన్ని 2009లో విడుదల చేశారు. ఇది చిన్న గుత్తి రకం. 45 రోజుల పాటు వర్షం రాకపోయినా తట్టుకోగలదు. నెల రోజుల పాటు పరిపక్వ నిద్రావస్థలో ఉంటుంది. పంటకాలం ఖరీఫ్‌లో 105 నుంచి∙115 రోజులు, రబీలో 115 నుంచి 120 రోజులు. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుంచి 1,000 కిలోలు, రబీలో అయితే 1,400 నుంచి 1,600 కిలోల దిగుబడినిస్తుంది. ఆకుమచ్చ, వేరుకుళ్లు, రసంపీల్చే పచ్చదోమ, తామర, ఎర్రనల్లి, నులి పురుగులను తట్టుకునే రకం. కదిరి అనంత: దీన్ని 2010లో విడుదల చేశారు. ఇది కూడా చిన్న గుత్తి రకం. వర్షాభావ పరిస్థితులను బాగు తట్టుకోగలదు. బెట్ట పరిస్థితుల నుంచి∙త్వరగా కోలుకునే రకం. దిగుబడి కూడా బాగుంటుంది. ఖరీఫ్‌లో ఎకరాకు 800 నుంచి∙1,000 కిలోలు, రబీలో అయితే 1400 నుంచి∙1,800 కిలోల దిగుబడి వస్తాయి. పంటకాలం ఖరీఫ్‌లో 105 నుంచి 110 రోజులు, రబీలో 110 నుంచి 120 రోజులు ఉంటుంది. ఆకుమచ్చ, రసం పీల్చే పురుగులను బాగా తట్టుకోగలదు. కదిరి హరితాంధ్ర: ఈ రకం విత్తనాన్ని కదిరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు 2010లో విడుదల చేశారు. పరిపక్వ దశ వరకు ఆకుపచ్చగా ఉండి ఎక్కువగా పశువుల మేత(కట్టె)నిస్తుంది. ఇది కూడా ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుంచి∙1,000 కిలోలు, రబీలో 1,400 నుంచి 1,600 కిలోల దిగుబడి నిస్తుంది. బెట్టను, ఆకుమచ్చ, తామర పురుగు, కాళహస్తి తెగుళ్లను బాగ తట్టుకోగలదు. స్థానికంగానే మంచి విత్తనం వ్యవసాయ పరిశోధన కేంద్ర కదిరిలో ఉండటం ఈ ప్రాంత రైతుల అదృష్టం. దీనివల్ల స్థానికంగానే మేలైన విత్తనం లభిస్తోంది. కదిరి రకాలు దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు. ఇక్కడి శాస్త్రవేత్తలకు రైతులంతా రుణపడి ఉంటాం. – రైతు జి.గోగురత్నం, వేపమానిపేట, తలుపుల మండలం సందేహాలన్నీ నివృత్తి చేస్తారు కదిరి వేరుశనగ రకాలు దేశంలోనే పేరుగాంచాయి. వేరుశనగ రైతులకు ఏ సందేహాలున్నా కదిరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎంతో ఓపికతో నివృత్తి చేస్తారు. ఏ సమయంలో ఫోన్ చేసినా పలుకుతారు. ఈ ప్రాంత రైతులే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఇక్కడికి వచ్చి మూల విత్తనం తీసుకెళ్తుంటారు. – ఎం.రమణ, సున్నపుగుట్ట తండా, కదిరి మండలం అందరి కృషి ఫలితమే శాస్త్రవేత్తలందరికి కృషి ఫలితంగానే మేలైన రకాలు అందిస్తున్నాం. ఒక కొత్త రకం పరిశోధనకు ఎనిమిదేళ్లు పడుతుంది. పరిశోధన స్థానం ఉత్పత్తి చేసిన మరో రెండు కొత్త రకం వంగడాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కదిరి వేరుశనగ రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయంటే మన రాష్ట్రానికే గర్వకారణం. దేశంలోని ఐదు ముఖ్యమైన పరిశోధన స్థానాల్లో కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం కూడా ఒకటి. – డాక్టర్ సంపత్‌కుమార్, ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త, కదిరి -
అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్!
యుపియా: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో చూస్తే అరుణాచల్‌లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పన సాకారమైందని మోదీ అన్నారు. ‘21వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్యప్రాంతం దేశాభివృద్ధికి ఇంజన్‌లా పనిచేస్తోంది’ అని మోదీ అన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సారథ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింతగా కష్టపడి పనిచేయనుంది అనిమోదీ అన్నారు. ‘అరుణాచల్ అద్భుత ప్రగతి దిశగా అడుగులేస్తోంది. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. -
నిజాం వ్యతిరేక ఉద్యమనిర్మాత ఐలమ్మ
కవాడిగూడ(హైదరాబాద్): నిజాం నవాబుకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మహిళా సంక్షేమం కోసం పోరాటాలు చేసిన ఘనత చాకలి ఐలమ్మదే అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకుని లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని తెలంగాణ రజక ధోబీ అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని యాదవ్, రజక ధోబీ అభివృద్ధి జాతీయ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ఎం. అంజయ్య, తెలంగాణ రాష్ట్ర రజక ధోబీ అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొమ్మరాజు కృష్ణమూర్తి తదితరులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సాయుధపోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. బహుళజాతి కంపెనీలు రజక వృత్తిని సొంతం చేసుకుని వారికి అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా రజకుల సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..నిజాం నిరంకుశ పాలనకు విముక్తి కల్పించేందుకు చాకలి ఐలమ్మ చేసిన స్ఫూర్తితోనే మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ప్రొటోకాల్ వివాదం.. వేడుకల్లో ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫొటో లేదంటూ టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ కార్పొరేటర్ జి.రచనశ్రీ ఫొటో లేదంటూ బీజేపీ నేతలు గొడవకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఇరుపార్టీల నేతలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే నిర్వాహకులు ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఫొటోను ఫ్లెక్సీపై అతికించడం కొసమెరుపు. పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం: మంత్రి తలసాని పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక భూపోరాటాలు, పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఆమె జయంతి, వర్ధంతులను ప్రజలందరూ పండుగలా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ పేపాల్ ఇంజనీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 2021లోభారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డేటా సైన్స్, రిస్క్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ స్ట్రీమ్స్ ఎంట్రీ, మిడ్-లెవల్ , సీనియర్ రోల్స్‌లో ఈ నియామకాలు జరుగుతాయి.హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని డెవలప్మెంట్ సెంటర్లలో దాదాపు వేయి మందిని కొత్తగా ఉద్యోగాల్లో చేర్చకోనున్నామని పేపాల్ తాజాప్రకటనలో తెలిపింది కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్ చెల్లింపులకుడిమాండ్ పెరిగిందనీ, ఈ నేపథ్యంలో తమ కేంద్రాల కీలకంగా మారనుందని పేపాల్ తెలిపింది. పేపాల్‌కు ప్రస్తుతం భారతదేశంలోని మూడు కేంద్రాలలో 4,500 మందికి పైగా ఉద్యోగులున్నారు. అమెరికా తరువాత భారతదేశంలోని సాంకేతిక కేంద్రాలు అతిపెద్దవన్నారు. దేశంలో డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరన నేపథ్యంలో వినియోగదారులు, వ్యాపారుల అవసరాలను తీర్చడంపై దృష్టిపెట్టామన్నారు. ఈ క్రమంలో తాజా నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేపాల్ ఇండియా ప్రతినిధి గురు భట్ అన్నారు. కాగా దేశీయంగా ఏప్రిల్ 1 నుంచి తమ సర్వీసులు నిలిపేయనున్నట్లు గత నెలలో పేపాల్ ప్రకటించింది. భారత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇకపై భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు , భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో ఇంటెల్ అభివృద్ధి కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మాదాపూర్‌లోని సాలార్పూరియా సత్త్వా నాలెడ్జ్ సిటీలో సాంకేతికత అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. 5–6 అంతస్తుల్లో, సుమారు 3 లక్షల చ.అ.ల్లో ఉండే ఈ కేంద్రాన్ని వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ కేంద్రం సీటింగ్ కెపాసిటీ 1,500 కాగా.. తొలి దశలో సుమారు వంద మంది ఇంజనీర్లను ఎంపిక చేసుకోనున్నారు. ఈ కేంద్రంలో ఎస్ఓసీ (సిస్టమ్ ఆన్ చిప్) సాంకేతికత మీద పని చేస్తుంది. -
హైదరాబాద్‌లో జేడ్ గ్లోబల్ సొంత కేంద్రం
♦ నియామకాల్లో భారత్‌కే ప్రాధాన్యత ♦ అయిదేళ్లలో 2,000 మంది ఉద్యోగులు ♦ ‘సాక్షి’తో కంపెనీ వ్యవస్థాపకుడు వై.కరణ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ ‘జేడ్ గ్లోబల్ సాఫ్ట్వేర్’ హైదరాబాద్‌లో సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే గచ్చిబౌలిలో కంపెనీ తన డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. లీజు ప్రాతిపదికన తీసుకున్న ఈ సెంటర్లో 100 మంది ఉద్యోగులు పనిచేసేందుకు ఏర్పాట్లున్నాయి. అమెరికా, యూకేతో పాటు దేశంలోని పుణె, నోయిడాల్లో సంస్థకు కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌లో వచ్చే రెండు మూడేళ్లలో సొంత క్యాంపస్ నెలకొల్పుతామని జేడ్ గ్లోబల్ సాఫ్ట్వేర్ ఫౌండర్, సీఈవో వై.కరణ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. ‘ఐటీ రంగానికి అవసరమైన టాప్ టాలెంట్ ఇక్కడ ఉంది. అత్యుతమ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడ అడుగుపెట్టాయి. అందుకే హైదరాబాద్‌లో సొంత కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’’ అని వివరించారాయన. భారత్ నుంచి 60 శాతం... నల్గొండ జిల్లాకు చెందిన కరణ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించారు. 2003లో జేడ్ గ్లోబల్‌ను స్థాపించారు. సంస్థలో ప్రస్తుతం 550 మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో 50 మంది ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను డిసెంబరుకల్లా 100కు చేరుస్తామని కరణ్ చెప్పారు. కంపెనీ ఈ మధ్యే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలోకి అడుగుపెట్టింది. 2021 నాటికి సిబ్బంది సంఖ్యను 2,000లకు చేర్చాలన్నది లక్ష్యమని కరణ్ తెలియజేశారు. ‘‘వీరిలో 60 శాతం మంది భారత్ నుంచే ఉంటారు. లండన్ కార్యాలయం కోసం కూడా నియామకాలను చేపడుతున్నాం. ఐపీ డెవలప్మెంట్లో పెట్టుబడులు పెడతాం. బిగ్ డేటా, ఆటోమేషన్‌పై ఫోకస్ చేస్తాం. జేడ్ టర్నోవర్ ప్రస్తుతం రూ.200 కోట్లుంది. యూఎస్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న టాప్-5,000 ప్రైవేటు కంపెనీల్లో జేడ్ వరుసగా అయిదేళ్లుగా స్థానం సంపాదిస్తోంది’’ అని వివరించారు. మరిన్ని కంపెనీలొస్తాయి.. ఇతర దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మరిన్ని ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు రానున్నాయని కరణ్ తెలిపారు. ‘తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గతేడాది యూఎస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌కున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. ఆయన ఆహ్వానం మేరకే ఇక్కడ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. మరింత మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు’ అని తెలియజేశారు. క్లయింట్ల సౌకర్యం కోసం 2006లో పుణేలో ఆఫీసు ప్రారంభించామని, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న అనిశ్చితితో హైదరాబాద్ వైపు దృష్టిసారించలేకపోయామని చెప్పారాయన. ఇప్పుడు అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు. -
హైదరాబాద్‌లో ఫ్లైదుబాయ్ కేంద్రం!
♦ శంషాబాద్ వద్ద డెవలప్మెంట్ సెంటర్ ♦ యాప్స్ అభివృద్ధికి హ్యాక్మేనియాతో జట్టు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినూత్న యాప్స్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్ డెవలపర్లకు మరో అరుదైన అవకాశం లభించింది. ఇక్కడి యువ డెవలపర్ల ప్రతిభను చూసిన చౌక విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్... హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం సంస్థకు భారత్‌లో తొలి డెవలప్మెంట్ సెంటర్ కావటం విశేషం. ఫ్లైదుబాయ్ ఐటీ, టెక్నాలజీ ఆవిష్కరణల్లో ఈ అభివృద్ధి కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. సాఫ్ట్వేర్ అభివృద్ధి, పరిశోధన, కార్యకలాపాలకు కేంద్ర బిందువు కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ డెవలప్మెంట్ సెంటర్‌కు ఫ్లై దుబాయ్ ఎంత పెడుతోంది? ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. జూలై 9న ప్రారంభమయ్యే హ్యాకథాన్‌లో ఈ వివరాలను ప్రకటించవచ్చునని తెలిసింది. యాప్స్ అభివృద్ధికి ఒప్పందం... అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్ఫేస్ (ఏపీఐ) యాప్ స్టోర్‌ను ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హ్యాక్‌మేనియా అనే స్టార్టప్ కంపెనీతో ఫ్లైదుబాయ్ చేతులు కలిపింది. ఎయిర్ ట్రావెల్, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌కు సంబంధించిన యాప్స్‌ను అభివృద్ధి చేసేందుకు డెవలపర్లతో కలిసి హ్యాకథాన్‌ను ఈ హ్యాక్‌మేనియా నిర్వహిస్తుంది. హ్యాకథాన్ విజేతలకు ఫ్లైదుబాయ్‌లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం లభిస్తుంది. అలాగే వారి ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు అవకాశం కల్పిస్తామని ఫ్లైదుబాయ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రమేష్ వెంకట్ తెలిపారు. ఈ ఏడాది మూడు హ్యాకథాన్లు.. హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో జూలై 9-10 తేదీల్లో జరిగే హ్యాకథాన్‌లో 100 మందికిపైగా డెవలపర్స్ పాల్గొనే అవకాశం ఉందని హ్యాక్‌మేనియా చెబుతోంది. ‘‘15 ఉత్పత్తుల్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిలో అవసరమైన యాప్స్‌ను ఫ్లైదుబాయ్ తీసుకుంటుంది. విభిన్న థీమ్స్‌తో మరో రెండు హ్యాకథాన్లను కూడా నిర్వహించబోతున్నాం. మా కంపెనీ ఇప్పటిదాకా వివిధ సంస్థల కోసం 50 దాకా హ్యాకథాన్లను నిర్వహించిందని, దాదాపు 600లకుపైగా యాప్స్ కార్యరూపం దాల్చాయి’’ అని కంపెనీ వ్యవస్థాపకుడు రజత్ షాహి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ సహకారంతో హ్యాక్‌మేనియా ఏర్పాటైంది. కాగా, హ్యాకథాన్‌లో పాల్గొనే ఔత్సాహికులు జూలై 5లోగా తమ పేర్లను హ్యాకర్బే.కో వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. -
హైదరాబాద్‌లో యాపిల్ సొంత కేంద్రం!
♦ డెవలప్మెంట్ సెంటర్ ఆరంభం రేపు... ♦ దీనికోసమే ఇక్కడికి వస్తున్న కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ ♦ ఈ సందర్భంగా అతిపెద్ద వార్త వింటారంటూ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే నంబర్-1 కార్పొరేట్ కంపెనీ... టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్‌కుక్ హైదరాబాద్‌కు రానున్నారు. భారత్‌లో తొలిసారిగా అడుగు పెడుతున్న ఆయన... గురువారం హైదరాబాద్‌కు వస్తారు. ఈ సందర్భంగా ఆయన యాపిల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశముంది. సిటీలో టిమ్‌కుక్ మూడు గంటలపాటు ఉంటారని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను గచ్చిబౌలిలోని టిస్మన్ స్పియర్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనంలో 2.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు సమాచారం. అమెరికా వెలుపల సంస్థకు ఇదే తొలి ఫెసిలిటీ కూడా. దీనికోసం యాపిల్ రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. యాపిల్ మ్యాప్స్ టెక్నాలజీకి కావాల్సిన సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. 2,500 మంది ఉద్యోగులు పనిచేసే వీలుంది. తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు పర్యవేక్షణలో కంపెనీకి అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయటం గమనార్హం. కుక్ వారంరోజుల భారత పర్యటన నిమిత్తం తన ప్రైవేటు జెట్‌లో మంగళవారం అర్థరాత్రి ముంబైకి చేరుకున్నారు. 19న హైదరాబాద్ వచ్చి... అట్నుంచి ఢిల్లీ వెళతారు. 20, 21 తేదీల్లో అక్కడే ఉంటారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. మేకిన్ ఇండియా అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం. ఇతర రంగాల్లోనూ యాపిల్ పెట్టుబడులు! టిమ్‌కుక్ రాక నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ... ‘అతి పెద్ద వార్తను మీతో ఎల్లుండి పంచుకోబోతున్నాను. అప్పటి వరకు సస్పెన్స్’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం లీజు కార్యాలయంలో డెవలప్మెంట్ సెంటర్‌ను ఆరంభించినా... సొంత కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని యాపిల్ చూస్తోందని, ఈ క్రమంలో ప్రభుత్వం యాపిల్‌కు స్థలాన్ని కేటాయించే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా కేటీఆర్ ఈ ప్రకటన చేయొచ్చని తెలిసింది. అంతేకాక ఈ మధ్య యాపిల్ తన పంథా మార్చుకుని ఇతర రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఇటీవలే చైనాలో రైడ్ షేరింగ్ సంస్థ ‘దీదీ’లో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. చైనాలో యాపిల్ ఐట్యూన్స్‌ను నిషేధించిన నేపథ్యంలో ఆ ప్రభుత్వంతో సాన్నిహిత్యం కోసమే ఈ పెట్టుబడి పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే భారత్‌లోనూ కొన్ని పెట్టుబడులను ప్రకటించే అవకాశం లేకపోలేదని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ మరిన్ని ఊహాగానాలకు అవకాశం కల్పించింది. అవకాశాల విపణి..! ఐఫోన్, ఐప్యాడ్లను విక్రయిస్తున్న యాపిల్... ఇప్పటిదాకా తాను విక్రయిస్తున్న మార్కెట్లలో గరిష్ఠ అమ్మకాల దశకు చేరుకుంది. అక్కడ వృద్ధి ఆశించినంతగా లేదు. దీంతో అభివృద్ధి చెందుతున్న చైనా, భారత్‌లపై ఫోకస్ చేసింది. గతేడాదితో పోలిస్తే 2016 జనవరి-మార్చి త్రైమాసికంలో యాపిల్ అమ్మకాలు దేశంలో 62 శాతం వృద్ధి చెందాయి. యాపిల్ ఉత్పత్తులను కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఫాక్స్‌కాన్‌కు భారత్‌లో ప్లాంట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలోనూ ప్లాంటు ఉంది. కాగా యాపిల్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలో నెలకొల్పే అవకాశముందని, 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫెసిలిటీ రానుందని ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి.