charles
-
హైదరాబాద్‌లో చార్లెస్ స్క్వాబ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సేవల రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన ‘చార్లెస్ స్క్వాబ్’ హైదరాబాద్‌లో నూతన సాంకేతిక అభివృద్ధి కేంద్రం (టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. చార్లెస్ స్క్వాబ్ భారత్ లో ఏర్పాటు చేసే తొలి డెవలప్మెంట్ సెంటర్ ఇదే కావడం గమనార్హం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతి నిధి బృందంతో చార్లెస్ స్క్వాబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హోవార్డ్, రామ బొక్కా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో చర్చల సందర్భంగా హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల ప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. చార్లెస్ స్క్వాబ్‌కు ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన తుది అను మతుల కోసం చార్లెస్ స్క్వాబ్ వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపనున్నట్లు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పా టు ద్వారా ఆర్థిక సేవల రంగంలో ఉద్యోగ అవకాశాల కల్ప నకు వీలవుతుందని, ఈ రంగంలో హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.‘కామ్‌కాస్ట్’ ప్రతినిధులతో శ్రీధర్బాబుఅంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ కంపెనీ ‘కామ్‌కాస్ట్’కు చెందిన సీనియర్ ప్రతినిధి బృందం.. మంత్రి శ్రీధర్‌బాబు తో భేటీ అయింది. తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపా ధి కల్పన లక్ష్యంగా అనేక సంస్థలతో వ్యూహాత్మక, భాగస్వా మ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ భేటీలో కామ్‌కాస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెల్ పెన్నా, సీటీఓ రిక్ రియోబొలి, సీఐఓ మైక్ క్రిసాఫుల్లి పాల్గొన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకే..సీఎం బృందం అమెరికా పర్యటనలో భాగంగా పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలపై విమ ర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతినిధి బృందంలోని అధికారు లు వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే దిశలోనే వివిధ సంస్థలతో చర్చలు ఒప్పందాలు జరుగుతు న్నట్లు వెల్లడించారు. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రోడ్ షోలు, వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుగుతు న్నాయి. సీఎం కూడా అనేక బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. భవిష్యత్తు సమావేశా ల్లోనూ రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తాం..’ అని ఐటీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి‘ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం జరిపిన భేటీ ఆసక్తికరంగా, ఫలప్రదంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి చూపించింది. పట్టణీకరణ, కాలుష్య రహిత నగరాలకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఆసక్తి చూపింది. పట్టణీకరణ ద్వారా ఎదురయ్యే మురుగునీరు, తాగునీటి సమస్యల పరిష్కా రానికి రాష్ట్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది..’ అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు.కాలిఫోర్నియా చేరుకున్న సీఎం బృందం రేవంత్‌రెడ్డి బృందం గురువారం కాలిఫోర్నియాకు చేరుకుంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, డాలస్, టెక్సా స్లో పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చిన బృందానికి ఘన స్వాగతం లభించింది. కాలిఫోర్నియాలో దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఈ బృందం భేటీ అవుతుంది. -
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ రాజు
బ్రిటన్ రాజు చార్లెస్(75) అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపధ్యంలో మరోమారు ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. దీనికి ముందు ఆయన ఒక ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అతని భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు. వైద్యబృందం నుంచి క్లియరెన్స్ తీసుకున్న అనంతరం ఈ కార్యక్రమంలో రాజు పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు బ్రిటన్ రాజు తన ప్రసంగాన్ని 45 నిమిషాలకు కుదించారు.బ్రిటన్ కింగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ గత ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. రాజు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ను షేర్ చేసిన బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆయన చికిత్స ప్రక్రియలో ఆందోళనకర అంశం వైద్యుల దృష్టికి వచ్చిందని తెలిపింది.బ్రిటన్ రాజు వీలైనంత త్వరగా సాధారణ విధులలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఆకాంక్షించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని దేశమంతా ప్రార్థిస్తోందని సునక్ అన్నారు. బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా చార్లెస్ కింగ్ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించింది. -
బ్రిటన్‌లో రాజుగారి ఏలుబడి!
మరికొన్ని గంటల్లో బ్రిటన్ రాజుగా ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జి మౌంట్‌బాటన్ (చార్లెస్–3) పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యం’గా ప్రపంచపటంలో ధగ దగలాడిన బ్రిటన్ నేడు తానున్న యూరప్ ఖండంలో కూడా ఒంటరి పయనం సాగించడాన్ని ఎంచుకున్న చిన్న దేశంగా మిగిలిపోయింది. ఆ దేశంలో 18వ శతాబ్దంలోనే రాచరికం నామమాత్రంగా మిగిలి సర్వాధికారాలూ పార్లమెంటుకు బదిలీ అయ్యాయి. మరో మూడు శతాబ్దాలు గడి చినా అది తన గత వైభవానికీ, అగమ్యగోచరమైన భవిష్యత్తుకూ మధ్య ఊగిసలాడుతూనే ఫ్యూడల్ అవశే షమైన సంప్రదాయాలనూ, లాంఛనాలనూ వదులుకోవటానికి ఏమాత్రం సిద్ధపడటంలేదని శనివారంనాటి పట్టాభిషేకం రుజువుచేయబోతోంది. ఆరు గుర్రాలు పూన్చిన రథంలో ముందే నిర్దే శించిన సెంట్రల్ లండన్ వీధులగుండా వెస్ట్ మినిస్టర్ అబీగా పిలిచే సెయింట్ పీటర్ చర్చిలో ఉదయం 11 గంటలకల్లా చార్లెస్ ప్రవేశించి ఏడువందల ఏళ్లనాటి సింహాసనాన్ని అధిష్టిస్తారు. ‘గాడ్ సేవ్ ద కింగ్ చార్లెస్’ అనే ఆశీర్వచనంలాంటి నినాదం మార్మోగుతుండగా మణులు, మాణిక్యాలు, కెంపులు, గోమేధికాలు, గరుడపచ్చలు పొదిగిన దాదాపు నాలుగు వందల ఏళ్లనాటి బంగారు కిరీటం ఆయన శిరస్సును అలంకరిస్తుంది. ఈ పట్టాభిషేక తంతులో కాలం గడిచేకొద్దీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు మొత్తంగా చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధిపత్యమే ఉండే ఆ కార్యక్రమంలో ఇప్పుడు భిన్న మతవిశ్వాసాల ఆచార్యులుంటున్నారు. కేవలం సంపన్నులకూ, దేశా ధినేతలకూ మాత్రమే ప్రవేశముండే ఆ కార్యక్రమంలో సాధారణ పౌరులకు కూడా చోటుదక్కుతోంది. దాంతోపాటే ఒకనాడు పట్టాభిషేక సందర్భంలో ఇంటింటా పండుగ వాతావరణం కనబడిన చోటే ‘ఎందుకిదంతా?’ అనే ప్రశ్నలు మొలకెత్తడం కూడా మొదలైంది. రాచ రికాన్ని వదుల్చుకుంటే తప్ప బ్రిటన్ సంపూర్ణ ఆధునికతను సంతరించుకోదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఫ్యూడల్ చిహ్నమైన రాచరికం స్థానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే రాజ్యాధినేత ఉండటం వర్తమాన అవసరమని అటువంటివారు వాదిస్తున్నారు. ‘రాచరికంలోకి ఒక్కసారి తొంగి చూశామా.. దాన్ని కీర్తించటం అసాధ్యం’ అని బ్రిటన్ రాజ్యాంగనిపుణుడు వాల్లర్ బాజెట్ ఒకప్పుడు అననే అన్నారు. అయితే ప్రపంచంలో బ్రిటన్ రాచరికం ఏకాకి కాదు. మరో 28 దేశాల్లో కూడా ఆ వ్యవస్థలే వర్థిల్లుతున్నాయి. అందులో పూర్తి స్థాయి నియంత్రణాధికారాలుండే రాజులు మొదలుకొని సగం సగం అధికారాలతో సరిపెట్టుకొనేవారూ, పూర్తి అలంకారప్రాయంగా మిగిలిపోయినవారూ కూడా ఉన్నారు. అలాగే తిరుగులేని సంపదలతో తులతూగేవారూ, ప్రభుత్వాలు దయతో ఇచ్చే జీతభత్యా లతో సరిపుచ్చుకునే రాజులు కూడా ఉన్నారు. లాంఛనప్రాయపు హోదాయే కావొచ్చుగానీ చార్లెస్ ఒక్క బ్రిటన్‌కు మాత్రమే కాదు... మరో 14 దేశాలకు సైతం రాజ్యాధిపతిగా కొనసాగుతారు. ప్రపంచంలోని ఇతర దేశాల మాట అటుంచి సంపన్న దేశాల క్లబ్ అయిన జీ–7లో కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ నాసిరకమైనదే. అక్కడ ప్రస్తుతం ‘జీవన వ్యయ సంక్షోభం’ రాజ్యమేలుతోంది. తడిసిమోపడయ్యే వడ్డీ రేట్లతో, భరింపశక్యంకాని ద్రవ్యోల్బణంతో, ఆకాశాన్నంటే ఇంధన ధరలతో అక్కడి జనం ఈసురోమంటున్నారు. గత ఇరవైయ్యేడేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వడ్డీరేట్లు పెరిగిపోయాయి. ఈ ఏడాది ఆఖరువరకూ అది కోలుకునే అవకాశం లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. ప్రస్తుతం నిరుద్యోగిత 3.9 శాతం. దాదాపు 13 లక్షలమంది పౌరులు ఉపాధి కోల్పోయారని జాతీయ గణాంకాల విభాగం గత నెలలో తెలిపింది. సగటున ప్రతి అయిదుగురు బ్రిటన్ పౌరు ల్లోనూ ఒకరు పేదరికంలో కూరుకుపోయారని గణాంకాలు కోడై కూస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. చాలీచాలని ఆదాయాలతో అర్థాకలితో నెట్టుకొచ్చే కుటుంబాలూ.. దాతృత్వ సంస్థల సాయంతో, చర్చిల ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్న కుటుంబాలూ ఎక్కువేనని ఒక అంచనా. అందుకే కాబోలు ఈసారి పట్టాభిషేక మహోత్సవ కార్య క్రమంలో అట్టహాసాలు తగ్గించాలని నిర్ణయించారు. కార్యక్రమం నిడివి బాగా తగ్గిపోగా, అతిథుల జాబితా కూడా చిన్నబోయింది. అయితే ఈ కార్యక్రమానికయ్యే మొత్తం వ్యయం ఎంతో చెప్పటం వెంటనే సాధ్యం కాకపోయినా అది ఎలా చూసినా 12.5 కోట్ల డాలర్లకు తగ్గకపోవచ్చని మీడియా లెక్కలేస్తోంది. వర్తమాన చేదు వాస్తవాలనూ, సంక్లిష్టతలనూ పరిగణనలోకి తీసుకోకుండా భూత కాలం చూరుపట్టుకుని వేళ్లాడటం ఇంకా ఎన్నాళ్లని పలువురు ప్రశ్నించటానికి ఇలాంటి కథనాలు కారణం కావొచ్చు. నెపోలియన్‌తో సాగిన వరస యుద్ధాల పరంపరలో గెల్చామన్న సంబరంతో బ్రిటన్ 1821లో నాలుగో జార్జి పట్టాభిషేకాన్ని కనీవినీ ఎరుగనంత ఘనంగా జరుపుకుంది. దానిపై విమర్శకులు విరుచుకుపడటంతో మరో పదేళ్లకు 1831లో అతని వారసుడు నాలుగో విలియం మాత్రం అతి నిరాడంబరంగా, క్లుప్తంగా పట్టాభిషేకం తంతు ముగించారు. మొత్తానికి ఏడుపదుల కాలం తర్వాత బ్రిటన్‌లో పట్టాభిషేక మహోత్సవం జరగబోతోంది. రాచరికంపై దేశ పౌరుల్లో ఉండే వ్యతిరేకత కనుమరుగు కావటం, కనీసం అభ్యంతరాలు వ్యక్తం కాకపోవటం అనేవి చార్లెస్ వ్యవహారశైలిపై ఆధారపడివుంటాయి. ఆయన శనివారం ధరించబోయే కిరీటం బరువు 5 పౌండ్లు (సుమారు 2.27 కిలోలు). కానీ ‘మూడో చార్లెస్’గా ఆయనపై ఉండ బోయే బాధ్యతల బరువు అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ. దాన్ని ఆయన సమర్థవంతంగా నిర్వహించగలిగితే చరిత్రలో ఆయన స్థానం పదిలంగా ఉంటుంది. -
ఆస్ట్రేలియా కరెన్సీపై బ్రిటిష్ రాజరికం కనుమరుగు
కాన్బెర్రా: ఆస్ట్రేలియా మరో బ్రిటిష్ వలసపాలన తాలూకు గుర్తును చెరిపేసుకుంటోంది. అక్కడి 5 ఆస్ట్రేలియా డాలర్ల కరెన్సీ నోటుపై ఇన్నాళ్లూ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ముఖచిత్రాన్ని ముద్రించారు. రాణి ఎలిజబెత్ అస్తమయం తర్వాత రాజుగా పగ్గాలు చేపట్టిన కింగ్ ఛార్లెస్ ముఖచిత్రాన్ని 5 డాలర్ల కరెన్సీ నోటుపై ముద్రించాలని భావించట్లేదని ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్ తాజాగా ప్రకటించింది. అయితే, ఛార్లెస్ ఫొటో ఉండే కొత్త నాణేలను మాత్రం ఈ ఏడాది చివరిలోపు చలామణిలోకి తీసుకురానున్నారు. ఇన్నాళ్లూ ఒక్క 5 డాలర్ల నోటుపైనే బ్రిటిష్ రాజరిక ఆనవాళ్లు ఉండేవి. ఎలిజబెత్ ఫొటో తొలగింపుతో నోట్లపై నామరూపాలు పోయినట్లే. ఈ మార్పుపై ప్రభుత్వంతో చర్చించాకే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ రాజరికమే అత్యున్నత పరిపాలన హోదాలో ఉంది. కానీ మారిన వర్తమాన రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఆ రాజరికం కేవలం అలంకారప్రాయంగా తయారైంది. ‘కొత్త నోటుకు ఒకవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్, మరో వైపు ఆస్ట్రేలియా తొలితరం స్థానికుల లేదా దేశ అద్భుత ప్రకృతి అందాల ఫొటోను పొందుపరుస్తాం’ అని ఆర్థిక మంత్రి జిమ్ చామర్స్ అన్నారు. కరెన్సీపై రాజరికాన్ని వదలుకోవడంపై అక్కడి రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గణతంత్రదేశంగా ఆవిర్భవించే ప్రయత్నం చేస్తోందని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు. -
ఒకరి కోసం మరొకరు..!
► ఒక్క అడుగు దూరంలో ‘మిషన్’ ► కరీబియన్ క్రికెట్లో కొత్త కళ కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- క్రమశిక్షణ పేరుతో ఏడాది క్రితం ఇద్దరి ఆటగాళ్లపై వేటు... టెస్టు క్రికెట్ పరిస్థితి చూస్తే అధ్వాన్నం... బోర్డుకు, క్రికెటర్లకు మధ్య సు దీర్ఘ కాలంగా తెగని సమస్యలు... డబ్బులు దక్కని పరిస్థితుల్లో టోర్నీకి దూరమయ్యేం దుకు కూడా సిద్ధమైన ఆటగాళ్లు... అంతా గందరగోళం... టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ పరిస్థితి ఇది. అందుకే వ్యక్తిగతంగా చాలామంది టి20 స్టార్స్ ఉన్నా జట్టుగా కరీబియన్ల మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ భారత్‌ను సెమీస్‌లో ఓడించాక ఆ జట్టు మీద మరింత గౌరవం పెరిగింది. చాంపియన్ పాట నాలుగేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్‌తో వెస్టిండీస్ క్రికెటర్లు సందడి చేశారు. అనూహ్యంగా, అంచనాలకు అందకుండా రాణించి ఆ టైటిల్ గెలిచిన కరీబియన్లు ఒక రకంగా క్రికెట్ అభిమానుల్లో గంగ్నమ్ పాటకు క్రేజ్ పెంచారు కూడా. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో 2014లో విఫలమైన స్యామీ సేనపై ఈసారి కూడా టోర్నీ ఆరంభానికి ముందు అంచనాలు లేవు. అసలు ఈ ఏడాది ఈ జట్టు ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడలేదు. జట్టును ప్రకటించడానికి కూడా బోర్డు పలుసార్లు ఆలోచించింది. కాంట్రాక్టు వివాదంతో అసలు తాము వెళ్లమని సీనియర్లంతా బోర్డుతో గొడవపెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. ‘కొన్ని ఘటనలు జరిగి ఉండకపోతే మేం జట్టుగా ఇంతలా కలిసిపోయేవాళ్లం కాదేమో. టోర్నీకి ముందు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. మా జట్టును ఎవరూ గౌరవించలేదు. ఇలాంటి ఘటనలతో అందరం ఒక్కటయ్యాం. ఒకరికోసం ఒకరనే మంత్రం జపించాం. అలాగే మేం సాధించగలం అనే నమ్మకాన్ని ఎప్పుడూ వీడలేదు. అదిప్పుడు ఆటలో కనిపిస్తోంది’ అని కెప్టెన్ స్యామీ ఉద్వేగంగా చెప్పాడు. ఇప్పుడు బ్రేవో పాట ‘చాంపియన్’ వారికి జాతీయగీతంలా మారిపోయింది. మైదానంలో వారి జోష్, సంబరాలు మరే జట్టుకు సాధ్యం కాని విధంగా సాగుతున్నాయి. తమను చిత్తు చేసిన చిన్న జట్టు అఫ్ఘానిస్తాన్‌తో కూడా ఆడిపాడగలగడం కరీబియన్లకే సాధ్యం. ఒకటే లక్ష్యం... మేం ఒక మిషన్‌తో భారత్ వచ్చాం అని పదే పదే స్యామీ చెబుతున్నాడు. ఆ మిషన్ కచ్చితంగా ప్రపంచకప్ టైటిల్. ఇక దీనిని అందుకోవడానికి అడుగు దూరంలో ఉన్నారు. అయితే ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కూడా బలంగానే ఉంది. కానీ ప్రత్యర్థి ఎవరనే ఆలోచన ఎప్పుడూ వెస్టిండీస్‌కు ఉండదు. మా జట్టులో 15 మందీ మ్యాచ్ విన్నర్లే అని పదే పదే కెప్టెన్ చెప్పినా... అందరి చూపూ ప్రతిసారీ గేల్ మీదే ఉంటోంది. ఈ టోర్నీలో గేల్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ గెలిచింది. ముఖ్యంగా సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిలో భారత్‌పై సిమన్స్, రసెల్, చార్లెస్ ఆడిన తీరు... ఆ జట్టులో అందరూ చాంపియన్లే అనే కెప్టెన్ నమ్మకానికి ప్రతీక. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడినా... భారత్‌తో ఆడిన తీరు చూస్తే సరైన సమయంలో గాడిలో పడ్డట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది వెస్టిండీస్ అండర్-19 ప్రపంచకప్ గెలవడం, మహిళల జట్టు కూడా టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం చూస్తే ఇది వెస్టిండీస్ సీజన్‌లా ఉంది. ‘మేం ఒకరకంగా ప్రపంచం అందరితో ఏకకాలంలో పోరాడుతున్నాం. మా విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. టైటిల్ గెలిస్తే మాకు కలిగే ఆనందంతో పోలిస్తే ఏ ఇతర జట్టు గెలిచినా వారికి అంతటి సంతోషం దక్కదు’ అని స్యామీ చెప్పే మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విండీస్ విజ యాన్ని ఆస్వాదించేందుకు ఆ దేశం బయట కూడా పెద్ద సంఖ్యలో జట్టుకు అభిమానులు ఉన్నారు. మరి చాంపియన్ పాట ఫైనల్ తర్వాత కూడా అదే మోత మోగిస్తుందా?. -
జిల్ జిల్ జి‘గేల్’
► అజేయ సెంచరీతో చెలరేగిన కరీబియన్ స్టార్ ► ఇంగ్లండ్‌పై విండీస్ ఘన విజయం టి20 ప్రపంచకప్ విధ్వంసానికి పరాకాష్ట... క్రిస్‌గేల్ ఎప్పుడు టి20 మ్యాచ్ ఆడినా చాలా సహజంగా వినిపించే పదం. ఈసారి అలాంటి విధ్వంసాన్ని మించిన విలయం సృష్టిస్తూ... బంతికే భయం పుట్టిస్తూ... ప్రత్యర్థుల వెన్నులో వణుకు తెప్పిస్తూ... మరోసారి క్రిస్‌గేల్ విశ్వరూపం చూపించాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీతో వెస్టిండీస్‌కు ఘన విజయాన్ని అందించాడు. ముంబై: టి20ల్లో తను ఎంత ప్రమాదకరమో క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 11 సిక్సర్లు) మరోసారి నిరూపించాడు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... పూనకం వచ్చినోడిలా ఇంగ్లిష్ బౌలర్ల భరతం పట్టాడు. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తూ టి20 ప్రపంచకప్‌లో అజేయ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రూట్ (36 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (20 బంతుల్లో 30; 3 సిక్సర్లు), హేల్స్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు), మోర్గాన్ (14 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. 37 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌ను రూట్, హేల్స్ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆదుకున్నారు. దీంతో తొలి పది ఓవర్లలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. మిడిలార్డర్లో బట్లర్, మోర్గాన్ నాలుగో వికెట్‌కు 3.3 ఓవర్లలోనే 38 పరుగులు జత చేశారు. ఓవరాల్‌గా చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే చార్లెస్ (0)ను అవుట్ చేసి ఇంగ్లండ్ ఆరంభంలోనే విండీస్‌కు షాకిచ్చింది. అయితే రెండో ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్‌తో కాస్త కుదురుకున్న గేల్ ఆ తర్వాత తన విశ్వరూపం చూపాడు. సహచరులు మెల్లగా ఆడినా... తను మాత్రం సిక్సర్ల జోరు చూపెట్టాడు. శామ్యూల్స్ (27 బంతుల్లో 37; 8 ఫోర్లు) కూడా వరుస బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి కరీబియన్ జట్టు స్కోరు 55/1గా మారింది. ఆరో ఓవర్లో శామ్యూల్స్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రామ్‌దిన్ (12) నెమ్మదించినా... రషీద్, స్టోక్స్ ఓవర్లలో గేల్ నాలుగు సిక్సర్లు బాదాడు. కానీ వరుస ఓవర్లలో రామ్‌దిన్, డ్వేన్ బ్రేవో (2)లు అవుట్‌కావడంతో విండీస్ కాస్త తడబడింది. అయితే అలీ వేసిన 14వ ఓవర్లో గేల్ వరుసగా మూడు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టి మళ్లీ ఊపు తెచ్చాడు. రస్సెల్ (16 నాటౌట్) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ గేల్‌కు ఎక్కువగా బ్యాటింగ్ ఇవ్వడంతో ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగిపోయారు. 16వ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదిన గేల్.... 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా రామ్‌దిన్‌తో మూడో వికెట్‌కు 46; రస్సెల్‌తో ఐదో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జత చేయడంతో విండీస్ 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) బద్రీ (బి) రస్సెల్ 15; హేల్స్ (బి) బెన్ 28; రూట్ (సి) టేలర్ (బి) రస్సెల్ 48; బట్లర్ (సి) బ్రాత్‌వైట్ (బి) బ్రేవో 30; మోర్గాన్ నాటౌట్ 27; స్టోక్స్ ఎల్బీడబ్ల్యు (బి) బ్రేవో 15; మొయిన్ అలీ రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1-37; 2-92; 3-114; 4-152; 5-175; 6-182. బౌలింగ్: టేలర్ 3-0-30-0; బద్రీ 4-0-34-0; రస్సెల్ 4-0-36-2; డ్వేన్ బ్రేవో 4-0-41-2; బెన్ 3-0-23-1; బ్రాత్‌వైట్ 2-0-16-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) అలీ (బి) విల్లే 0; గేల్ నాటౌట్ 100; శామ్యూల్స్ (సి) విల్లే (బి) రషీద్ 37; రామ్‌దిన్ (సి) రషీద్ (బి) అలీ 12; బ్రేవో (సి) హేల్స్ (బి) టోప్లే 2; రస్సెల్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1-2; 2-57; 3-103; 4-113. బౌలింగ్: విల్లే 3-0-33-1; టోప్లే 2.1-0-22-1; జోర్డాన్ 4-0-24-0; స్టోక్స్ 3-0-42-0; రషీద్ 2-0-20-1; అలీ 4-0-38-1. విశేషాలు ► టి20 ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గతంలో తన పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌లో గేల్ (11 సిక్సర్లు) సవరించాడు. ► టి20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గేల్ (98 సిక్సర్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్-91 సిక్సర్లు) పేరిట ఉండేది. ► టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇది ఎనిమిదో సెంచరీ. ఓవరాల్‌గా టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది 20వ సెంచరీ. ఈ 20 సెంచరీల్లో గేల్, మెకల్లమ్లవి రెండేసి ఉన్నాయి. ► టి20 ప్రపంచకప్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును గేల్ (47 బంతుల్లో) నెలకొల్పాడు. టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది సంయుక్తంగా మూడో వేగవంతమైన సెంచరీ. రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా-45 బంతుల్లో), డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా-46 బంతుల్లో), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా-47 బంతుల్లో) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
పార్ట్నర్స్
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 35 ఎడ్వర్డ్, చార్లెస్ షేర్ బ్రోకర్ వ్యాపారంలో భాగస్వాములు. ఆ రోజు తెల్లవారు జామున ఎడ్వర్డ్ తన ఆఫీస్ తలుపు తెరుచుకుని వచ్చేసరికి అకౌంట్స్ రాస్తున్న చార్లెస్ కనిపించాడు. ‘‘ఈ సమయంలో పని చేస్తున్నావేంటి?’’ ఎడ్వర్డ్ ప్రశ్నించాడు. ‘‘నిద్రపట్టక పెండింగ్ పని పూర్తి చేద్దామని వచ్చాను’’ చార్లెస్ చెప్పాడు. ‘‘చార్లీ! బయట ఆగి ఉన్న కొత్త కారు నీదేనా? నువ్వు నన్ను మోసం చేసి మన కంపెనీ నించి తస్కరించిన డబ్బుతోనే కొన్నావా?’’ ఎడ్వర్డ్ ప్రశ్నించాడు. ‘‘పొద్దున్నే ఈ జోకేంటి?’’ ‘‘నీ గర్ల్‌ఫ్రెండ్ ఉండే అపార్ట్మెంట్ అద్దె కూడా ఆ దొంగిలించిన సొమ్ము లోంచే కడుతున్నావా?’’ ‘‘ఏమిటి నువ్వనేది?’’ ‘‘ఆడిటర్స్ అకౌంట్స్‌ని పరిశీలించి తొంభై ఐదు వేల డాలర్లు దొంగిలించ బడ్డాయని చెప్పారు. సాక్ష్యాధారాలు లేకుండా నేను మాట్లాడడం లేదు. ఓ కొత్త కారు, అపార్ట్మెంట్ అద్దె పోను ఇంకా అరవై వేల డాలర్లు నీ దగ్గర ఉండాలి. మన సంస్థకి తిరిగి ఇవ్వు. లేదా పోలీసులకి ఫిర్యాదు చేస్తాను. ఇవాళ రాత్రి తొమ్మిదిలోగా నువ్వు ఆ డబ్బుతో ఇక్కడికి రావాలి’’... ఎడ్వర్డ్ తన మిత్రుడ్ని హెచ్చరించాడు. ‘‘నా మిత్రుడు ఎంత చెడ్డవాడో! నన్ను పోలీసులకి పట్టిస్తానన్నాడు. ఏదో చిన్న పొరపాటుకి ముప్ఫై ఐదేళ్లు జైల్లో కూర్చోవాలా? స్కూల్ డేస్ నించి మేం ఫ్రెండ్స్. యుద్ధంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు అదంతా మర్చిపోయాడు’’ చార్లెస్ ఆక్రోశించాడు. ‘‘ఏం జరిగింది?’’ అతని గర్ల్‌ఫ్రెండ్ లీనా అడిగింది. ‘‘సంస్థ నించి తొంభై ఐదు వేల డాలర్లు తీసుకున్నాను - అప్పుగానే. అది అతనికి చెప్పకపోతే దాన్ని దొంగతనం అంటున్నాడు’’ చార్లీ నిరసనగా చెప్పాడు. ‘‘మరిప్పుడెలా?’’ పచార్లు చేస్తున్న చార్లీ చిటికె వేసి చెప్పాడు. ‘‘పోలీసులకి ఫిర్యాదు చేయక మునుపే అతన్ని చంపేస్తాను.’’ ‘‘తక్షణం అనుమానం నీ మీదకి వస్తుంది. ఆ డబ్బు ఎక్కడుంది?’’ ‘‘నీ ఖర్చులు, కారు ఖర్చులు పోను అరవై వేల డాలర్లని ఓ చోట దాచాను...’’ ‘‘ఎక్కడ?’’ మళ్లీ చిటికె వేసి చెప్పాడు. ‘‘ఐడియా. నేను ఆత్మహత్య చేసుకుంటాను.’’ ‘‘అది పిచ్చి పని.’’ ‘‘తాత్కాలికంగా కొద్ది రోజులే మరణిస్తాను. ఇంకో దేశం వెళ్లిపోదాం.’’ ‘‘నిజం ఆత్మహత్య నేనొప్పుకోను. కొద్ది రోజులు మాత్రమే మరణించేటట్లయితే సరే. ఎలా చస్తావు?’’ మళ్లీ కొద్దిసేపు పచార్లు చేసి, చిటికె వేసి చెప్పాడు. ‘‘నీళ్ళల్లోకి దూకి. వందడుగులు కిందికి వెళ్లి డైనమైట్‌తో పేల్చుకుని మరణిస్తాను. క్షణానికి ఐదు లక్షల గ్యాలన్ల నీరు వంద అడుగుల లోతున ప్రవహిస్తుంటే శవం దొరకదు. యుద్ధంలో ఇలాంటివి చాలా చేశాను. ఓ గడ్డి బొమ్మకి నా కొత్త సూట్ తొడిగి దాన్ని చంపుతాను.’’ ‘‘కొత్త సూట్ పోయినా, కొత్త జీవితం వస్తుంది’’ లీనా ఆనందంగా చెప్పింది. టేబుల్ ముందు కూర్చుని తన పశ్చాత్తాపాన్ని తెలియచేస్తూ ఎడ్వర్డ్‌కి ఓ ఉత్తరం రాసాడు. ‘‘రాత్రి దీన్ని ఎడ్వర్డ్ ఆఫీస్ టేబుల్ మీద ఉంచితే, మర్నాడు ఉదయం చదువుతాడు. ఇక పోలీసులకి ఫిర్యాదు చేసి ప్రయోజనం లేదని తెలుసుకుని ఆ పని చేయడు.’’ ఆ ఉత్తరంతో ఆఫీస్‌కి వెళ్లి డూప్లికేట్ తాళం చెవితో ఆఫీస్ తలుపు తెరిచి ఎడ్వర్డ్ టేబుల్ మీద పెట్టాడు చార్లీ. అక్కడి నించి సముద్రం దగ్గరికి వెళ్లి, గడ్డి బొమ్మని, దానికి కట్టిన లాండ్రీ బ్యాగ్‌లోని రాళ్లని సముద్రంలోకి తోసే ముందు వాటర్ ప్రూఫ్ అలారం క్లాక్‌ని ఆన్ చేసాడు. దాదాపు పావు నిమిషం తర్వాత సముద్రంలోంచి పెద్ద పేలుడు వినిపించడంతో చుట్టు పక్కల ఉన్నవాళ్లు పరిగెత్తుకు వచ్చారు. దారంతో రెయిలింగ్‌కి కట్టిన ఉత్తరాన్ని వాళ్లు చదివి పోలీసులకి ఫోన్ చేసారు. ‘‘హనీ! నేను పోయాను. పోలీసులు నిన్ను కొద్ది రోజులు నా గురించి ప్రశ్నిస్తారు. వాళ్లకి అనుమానం రాకుండా నువ్వు దుఃఖాన్ని ఎంతో సహజంగా అభినయించాలి. వారం తర్వాత ఆ డబ్బుతో నువ్వు, నేను సౌత్ అమెరికాకి వెళ్లిపోదాం. దొంగ పాస్పోర్ట్స్ గురువారం అందుతాయి’’ అపార్ట్మెంట్కి వచ్చిన చార్లీ తన గర్ల్ ఫ్రెండ్‌కి ఆనందంగా చెప్పాడు. ‘‘ఇక నువ్వు మళ్లీ పుట్టవా?’’ లీనా అడిగింది. ‘‘ఆ అవసరం వస్తే చూద్దాం.’’ ‘‘నువ్వు ఎక్కడ దాక్కుంటావు?’’ ‘‘ఇంకెక్కడ? ఇక్కడే. కాలి బూడిదైన నాకోసం పోలీసులు ఎక్కడా వెదకరు. ముఖ్యంగా ఇక్కడ’’ చెప్పాడు. ‘‘డబ్బెక్కడుంది?’’ ఈ ప్రశ్నకి అతను జవాబు చెప్పలేదు. ‘‘బుధవారం తెల్లవారు జామున విమానం. డబ్బు ఎక్కడ దాచావని అడిగావుగా? మా ఆఫీస్‌లో. పద వెళ్దాం’’... మంగళవారం రాత్రి చార్లీ చెప్పాడు. ఇద్దరూ ఆమె కారుని ఆఫీస్ బయట ఆపి లోపలికి నడిచారు. పిల్లి గడ్డం, మీసాలు, నల్ల కళ్లజోడుతో చార్లీ మారు వేషంలో ఆఫీసు లోపలికి నడిచాడు. అతను సరాసరి ఫైల్ క్యాబినెట్ దగ్గరికి వెళ్లాడు. అందులో దాచిన ఓ కవర్ని బయటికి తీసి అందులోని అరవై వేల డాలర్లని లీనాకి ఆనందంగా చూపించాడు. ‘‘హేండ్సప్’’ బీరువా చాటు నించి చేతిలో రివాల్వర్‌తో వచ్చిన ఎడ్వర్డ్‌ని చూసి చార్లీ నివ్వెరపోయాడు. ‘‘నీకెలా తెలుసు?’’ అడిగాడు. ‘‘లీనా ద్వారా. ఆమె నా గర్ల్‌ఫ్రెండ్ కూడా. నిన్ను క్యాంప్‌కి పంపినప్పుడల్లా మేం కలిసేవాళ్లం.’’ తక్షణం లీనా చార్లీకి ఓ ఇంజెక్షన్ చేసి ఎడ్వర్డని అడిగింది. ‘‘ఇప్పుడు ఇతన్ని ఏం చేద్దాం?’’ ‘‘ఇతను ఎప్పుడో మరణించాడు. నా దగ్గర కావలసినంత డైనమైట్ ఉంది’’ ఎడ్వర్డ్ చెప్పాడు. సముద్రంలో గడ్డి బొమ్మ పేలిన చోట వంద అడుగుల లోతున ఇంకోసారి డైనమైట్ పేలింది. దినపత్రికలో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య గురించి చదివి ఎవరో అలానే మళ్లీ ఆత్మహత్యని చేసుకున్నారని పోలీసులు భావించారు. ఈ సారి శవం తాలూకు ముక్కలు ఒకటి రెండు దొరికాయి. (మైఖేల్ జురాయ్ కథకి స్వేచ్ఛానువాదం) -
పచ్చ రైలు...
గార్డెనింగ్ చాలామందికి ఇష్టం. పొద్దునే లేచి మొక్కలకు నీళ్లుపడుతూ, వాటిని కత్తిరిస్తూ... గడపడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీలోని రెట్ఫోర్డ్కు చెందిన 77 ఏళ్ల పెద్దమనిషి చార్లెస్ ఫిషర్‌కు చిన్నప్పటి నుంచి రైళ్లంటే ఇష్టమట. దాంతో తన ఇంటిముందున్న గార్డెన్లో ఇదిగో ఇలా ఓ బుల్లి రైలింజన్‌ను మలిచాడు. దీనికి కార్డ్‌బోర్డ్‌తో చేసిన కళ్లు, ముక్కు తగిలించాడు. ఇంకేముంది అటుగా వెళ్లే వాళ్లంతా దీన్ని చూసి ముచ్చటపడుతున్నారట. సెల్ఫీలు దిగుతున్నారు కూడా. స్థానిక పిల్లలకైతే ఇది ఎంతో నచ్చేసిందట. అలా చార్లెస్ ఉండే వీధిని కాస్తా ఇప్పుడందరూ 'ట్రెయిన్ స్ట్రీట్' అని పిలుస్తున్నారట.