పచ్చ రైలు... | attraction makes colony name as train street in uk | Sakshi
Sakshi News home page

పచ్చ రైలు...

Published Sun, Nov 15 2015 11:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

పచ్చ రైలు...

పచ్చ రైలు...

గార్డెనింగ్ చాలామందికి ఇష్టం. పొద్దునే లేచి మొక్కలకు నీళ్లుపడుతూ, వాటిని కత్తిరిస్తూ... గడపడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీలోని రెట్‌ఫోర్డ్‌కు చెందిన 77 ఏళ్ల పెద్దమనిషి చార్లెస్ ఫిషర్‌కు చిన్నప్పటి నుంచి రైళ్లంటే ఇష్టమట. దాంతో  తన ఇంటిముందున్న గార్డెన్‌లో ఇదిగో ఇలా ఓ బుల్లి రైలింజన్‌ను మలిచాడు.

దీనికి కార్డ్‌బోర్డ్‌తో చేసిన కళ్లు, ముక్కు తగిలించాడు. ఇంకేముంది అటుగా వెళ్లే వాళ్లంతా దీన్ని చూసి ముచ్చటపడుతున్నారట. సెల్ఫీలు దిగుతున్నారు కూడా. స్థానిక పిల్లలకైతే ఇది ఎంతో నచ్చేసిందట. అలా చార్లెస్ ఉండే వీధిని కాస్తా ఇప్పుడందరూ 'ట్రెయిన్ స్ట్రీట్' అని పిలుస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement