న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ క్యాప్‌జెమిని.. భారత కార్యకలాపాలకు చైర్మన్‌గా శ్రీనివాస్ కందులను నియమించింది. ఇంతకుముందు శ్రీనివాస్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సంస్థకు సేవలంచారు. తాజాగా ఆయన స్థానంలో సీఓఓ అశ్విన్ యార్డీని నియమించినట్లు క్యాప్ జెమిని ఒక ప్రకటనలో తెలియజేసింది. బ్రాండ్‌ను మెరుగుపరచటం, కీలక వాటాదారులతో సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం వంటి బాధ్యతలను ఇక నుంచి శ్రీనివాస్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. మానవ వనరుల సద్వినియోగం పరంగా ఈయనకున్న విస్తృత అనుభవంతో... అత్యున్నత స్థాయి నిపుణుల్ని తయారు చేసే బాధ్యత తీసుకుంటారని తెలిపింది. తమకు భారత్‌లో దాదాపు లక్ష మంది ఉద్యోగులున్నారని, 12 ప్రాంతాల ద్వా రా సేవలందిస్తున్నామని సంస్థ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment