Cap Gemini
-
కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలు
సమాజం నుంచి తీసుకోవడమే కాదు.. ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తితో పలు కార్పొరేట్ కంపెనీలు(Corporate Cos) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ప్రజలకు సాయమందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో వలంటీర్లు(Corporate volunteering)గా పాలుపంచుకునేలా ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం, పెయిడ్ లీవ్ ఇవ్వడమే కాకుండా తగు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరింత సమయం సైతం వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న వాటిల్లో ఇన్ఫోసిస్, పీఅండ్‌జీ, క్యాప్‌జెమిని(Cap Gemini), స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్‌యూఎల్, నెట్‌యాప్ తదితర కంపెనీలు ఉన్నాయి.వివిధ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రాజెక్టుల్లో కొన్ని..ఇన్ఫోసిస్జీవవైవిధ్యానికి తోడ్పడేలా ప్రాంతీయంగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కంపెనీ నడుం కట్టింది. ఉద్యోగులంతా కలిసి ఇటీవలే 2,00,000కు పైగా సీడ్‌బాల్స్‌ను తయారు చేశారు. వీటిని దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో అడవుల పెంపకం ప్రాజెక్టుల్లో ఉపయోగించనున్నారు. ఇక ఇన్ఫీ(Infosys)కి చెందిన బీపీఎం విభాగం ప్రాజెక్ట్ జెనిసిస్ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా 78,000 మందికి పైగా విద్యార్థులకు తోడ్పాటు అందించింది. పీఅండ్జీఅంతగా విద్యా సేవలు అందని ప్రాంతాల్లోని బాలలకు చదువును అందుబాటులోకి తెచ్చే దిశగా శిక్షా ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. దీనితో దాదాపు యాభై లక్షల మందికి పైగా చిన్నారులు లబ్ధి పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.క్యాప్జెమినివిద్య, సస్టైనబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. వీటిలో 90,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం 2,43,000 పైగా గంటల సమయం వెచ్చించారు. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాల కోసం వెచ్చించే సమయం వార్షికంగా 20 శాతం మేర పెరుగుతోందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు మాక్ ఇంటర్వ్యూలు .. రెజ్యూమె బిల్డింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం, కెరియర్ విషయంలో మార్గనిర్దేశనం చేయడం మొదలైన మార్గాల్లో ఉద్యోగార్థులకు సహాయం చేస్తున్నారు. జాబ్ మార్కెట్‌కి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకునేలా వారికి తోడ్పాటు అందిస్తున్నారు.ఇదీ చదవండి: విల్మర్ నుంచి అదానీ ఔట్స్టాండర్డ్ చార్టర్డ్నైపుణ్యాలను బట్టి వివిధ సామాజిక సేవా ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడం, కెరియర్‌పరంగా గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. వాటిలో పాల్గొనే ఉద్యోగులకు మూడు రోజుల పాటు పెయిడ్ లీవ్ కూడా ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాలపై ఉద్యోగులంతా కలిసి మొత్తం 1,17,376 గంటల సమయాన్ని వెచ్చించారు. -
టెకీలకు క్యాప్ జెమిని శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని కరోనా సంక్షోభ కాలంలో టెకీలకు శుభవార్త అందించింది. ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగ నియామకాలను కొనగిస్తామని చెప్పింది. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా, క్యాంపస్ ఆఫర్ల ద్వారా సుమారు 8వేల మందిని రిక్రూట్ చేసుకుంటామని బుధవారం తెలిపింది. వివిధ క్యాంపస్‌లతో 8000 కంటే ఎక్కువ ఎల్ఓఐలు ఉన్నాయని, ఇంజనీరింగ్ పరీక్షలపై కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున, పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రెషర్ల నియామకాలు ప్రారంభమవుతాయని చెప్పింది. తమ ప్లాన్లు, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా నియామకాలను కొనసాగిస్తామని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డి చెప్పారు. డిజిటల్, క్లౌడ్, డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారించి ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని సీఈవో తెలిపారు. క్యూ 1 లో 6000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నామనీ వారిలో సుమారు 4వేల మంది నిపుణులు, 2వేల మంది ఫ్రెషర్లున్నారని చెప్పారు. అలాగే క్యూ 2 లో 4వేల మందిని నియమించుకున్నామన్నారు. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా పరీక్షలు ఆలస్యం అయినా ఈ సంవత్సరం కళాశాల గ్రాడ్యుయేట్లకు ఇచ్చే అన్ని క్యాంపస్ ఆఫర్లను గౌరవిస్తామని ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని చెప్పారు. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్) సంస్థలో ప్రస్తుతం10-15ఏళ్ల అనుభవం ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు మేనేజర్లు, అర్టిటెక్ట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు వివరించారు. కంపెనీ ఫ్రాన్స్‌కు చెందినది అయినా తమ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులు భారతీయులేనని ఆయన వెల్లడించారు. కాగా ఫ్రెంచ్ ఐటి మేజర్ క్యాప్ జెమినికీ ప్రపంచంలో 270,000 మంది ఉద్యోగులుండగా, వీరిలో సగం 125,000 మంది ఇండియన్లున్నారు. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) చదవండి : పెట్రోలు పంపులు నిండిపోయాయి: నిల్వ ఎలా? -
క్యాప్‌జెమిని చైర్మన్‌గా శ్రీనివాస్ కందుల
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ క్యాప్‌జెమిని.. భారత కార్యకలాపాలకు చైర్మన్‌గా శ్రీనివాస్ కందులను నియమించింది. ఇంతకుముందు శ్రీనివాస్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సంస్థకు సేవలంచారు. తాజాగా ఆయన స్థానంలో సీఓఓ అశ్విన్ యార్డీని నియమించినట్లు క్యాప్ జెమిని ఒక ప్రకటనలో తెలియజేసింది. బ్రాండ్‌ను మెరుగుపరచటం, కీలక వాటాదారులతో సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటం వంటి బాధ్యతలను ఇక నుంచి శ్రీనివాస్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. మానవ వనరుల సద్వినియోగం పరంగా ఈయనకున్న విస్తృత అనుభవంతో... అత్యున్నత స్థాయి నిపుణుల్ని తయారు చేసే బాధ్యత తీసుకుంటారని తెలిపింది. తమకు భారత్‌లో దాదాపు లక్ష మంది ఉద్యోగులున్నారని, 12 ప్రాంతాల ద్వా రా సేవలందిస్తున్నామని సంస్థ వివరించింది. -
క్యాప్‌జెమిని ఇండియా హెడ్ శ్రీనివాస్ కందుల
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ ఐటీ సర్వీసెస్ సంస్థ క్యాప్‌జెమిని భారత్ కార్యకలాపాల సీఈవోగా శ్రీనివాస్ కందుల నియమితులయ్యారు. ఇంతవరకు సీఈవోగా వ్యవహరించిన అరుణ్ జయంతి ఇక నుంచి గ్రూప్‌కు సంబంధించిన అంతర్జాతీయ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. శ్రీనివాస్ కందుల తన కెరీర్‌ను ఐగేట్‌లో (2007)ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ స్థాయి నుంచి ప్రారంభించారు. క్యాప్‌జెమినిలో ఐగేట్ విలీన ప్రక్రియలో శ్రీనివాస్ కందుల కీలక ప్రాత పోషించారు. -
కుబేరుల ఖిల్లా.. భారత్!
* ప్రపంచంలో 16వ స్థానం * వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2014 వెల్లడి లండన్: భారత్‌లో కుబేరులు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) పెరుగుతున్నారు. 2013లో 3,000 మంది కొత్తగా మిలియనీర్ల క్లబ్లో చేరారని క్యాప్‌జెమిని, ఆర్బీసీ వెల్త్ మేనేజ్మెంట్లు రూపొందించిన నివేదిక తెలిపింది. ఈ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2014 వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..., * 2012లో 1,53,000గా ఉన్న భారత కుబేరుల సంఖ్య గతేడాదిలో 1,56,000కు పెరిగింది. * అధిక సంఖ్యలో కుబేరులున్న 16వ దేశం భారత్. * 40 లక్షల మంది మిలియనీర్లతో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్(23,27,000 మంది కుబేరులు), జర్మనీ(11,30,000), చైనా(7,58,000)లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం కుబేరుల్లో 60 శాతం మంది ఈ నాలుగు దేశాల్లోనే ఉన్నారు. * ప్రపంచం మొత్తం మీద 1.76 కోట్ల మంది కుబేరులున్నారు. వీరందరి సంపద 52.62 లక్షల కోట్ల డాలర్లు. 2016 కల్లా ప్రపంచ మొత్తం సంపద 22% వృద్ధితో 64.3 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుంది. * గత ఏడాదితో పోల్చితే హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 15 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 40 శాతం పెరిగడం విశేషం. * గత ఏడాది ఈక్విటీ మార్కెట్లు పెరగడం, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వివిధ దేశాల్లో సంపద స్థాయిలు పెరిగాయి.