సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని కరోనా సంక్షోభ కాలంలో టెకీలకు శుభవార్త అందించింది. ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగ నియామకాలను కొనగిస్తామని చెప్పింది. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా, క్యాంపస్ ఆఫర్ల ద్వారా సుమారు 8వేల మందిని రిక్రూట్ చేసుకుంటామని బుధవారం తెలిపింది. వివిధ క్యాంపస్‌లతో 8000 కంటే ఎక్కువ ఎల్‌ఓఐలు ఉన్నాయని, ఇంజనీరింగ్ పరీక్షలపై కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున, పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రెషర్ల నియామకాలు ప్రారంభమవుతాయని చెప్పింది.
తమ ప్లాన్లు, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా నియామకాలను కొనసాగిస్తామని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డి చెప్పారు. డిజిటల్, క్లౌడ్, డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారించి ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని సీఈవో తెలిపారు. క్యూ 1 లో 6000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నామనీ వారిలో సుమారు 4వేల మంది నిపుణులు, 2వేల మంది ఫ్రెషర్లున్నారని చెప్పారు. అలాగే క్యూ 2 లో 4వేల మందిని నియమించుకున్నామన్నారు. కోవిడ్ -19 సంక్షోభం కారణంగా పరీక్షలు ఆలస్యం అయినా ఈ సంవత్సరం కళాశాల గ్రాడ్యుయేట్లకు ఇచ్చే అన్ని క్యాంపస్ ఆఫర్లను గౌరవిస్తామని ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని చెప్పారు. (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్)
సంస్థలో ప్రస్తుతం10-15ఏళ్ల అనుభవం ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు మేనేజర్లు, అర్టిటెక్ట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు వివరించారు. కంపెనీ ఫ్రాన్స్‌కు చెందినది అయినా తమ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులు భారతీయులేనని ఆయన వెల్లడించారు. కాగా ఫ్రెంచ్ ఐటి మేజర్ క్యాప్ జెమినికీ ప్రపంచంలో 270,000 మంది ఉద్యోగులుండగా, వీరిలో సగం 125,000 మంది ఇండియన్లున్నారు. (ఫేస్‌బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం)
Comments
Please login to add a commentAdd a comment