apollo servers
-
Upasana Konidela: మెగా కోడలి అరుదైన ఘనత.. నెటిజన్ల ప్రశంసల జల్లు!
అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలు, మెగా వారి కోడలు 'ఉపాసన' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా, వైద్య రంగంలో తనదైన సేవచేస్తూ మంచి గుర్తింపు పొందిన ఈమె, రామ్‌చరణ్ సతీమణిగా మరింత పేరు సంపాదించింది. అయితే ఇటీవల ఈమె 'మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23' జాబితాలో ఒకరుగా నిలిచారు. ఆస్కార్ విజయంతో సంబరాలు చేసుకున్న మెగా ఫ్యామిలీకి మరో అరుదైన ఘనత రావడం నెటిజన్లను, మెగా అభిమానులు ఆనందంలో ముంచెత్తుతోంది. చాలా మంది ప్రముఖులు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఉపాసన చేసిన సేవలకుగానూ ఈ అవార్డు లభించినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న వారి జాబితాలో ఉపాసన ఒకరని పలువురు అభినందిస్తున్నారు. అంతే కాకుండా ఉపాసన తల్లి కాబోతున్నట్లు ఇదివరకే అందరికి తెలిసిందే. మొత్తానికి మెగావారి ఇంట ఆనందాలు వెల్లువిరుస్తాయి. ఉపాసన ఎప్పటికప్పుడు సామజిక కార్యక్రమాలలో కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొంటూ తన వంతు సమాజ సేవ చేస్తోంది. ఈమె ప్రస్తుతం అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ.. 'బి పాజిటివ్' అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: మునుపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్: ఇప్పటికే..) చిన్ననాటి నుంచే వ్యాపార మెలకువలను నేర్చుకుంటున్న ఉపాసన 'యు ఎక్స్చేంజ్' అనే సేవా సంస్థ నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలు సేకరించి పేద పిల్లలకు ఇచ్చేవారు. అంతే కాకుండా మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడే పిల్లలకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించేవారు. తరువాత రీజెంట్స్ యూనివర్సిటీ లండన్ నుంచి ఇంటర్నేషనల్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. 2012న మెగాస్టార్ కుటుంబానికి కోడలయ్యింది. Thank u @EconomicTimes for featuring me as one of the Most Promising Business Leaders of Asia 2022-23. pic.twitter.com/fP39b2zQTi — Upasana Konidela (@upasanakonidela) March 23, 2023 -
చేతులు మారింది, యాహూ విలువ రూ.36వేల కోట్లు
హైదరాబాద్: టెక్ సంస్థ యాహూ (గతంలో వెరిజోన్ మీడియా) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థ వెల్లడించింది. యాహూ ఇకపై స్టాండెలోన్ సంస్థగా కొనసాగుతుందని పేర్కొంది. దాదాపు 5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 36,000 కోట్లు) వెరిజోన్ నుంచి యాహూలో మెజారిటీ వాటాలను అపోలోకి చెందిన ఫండ్స్ కొనుగోలు చేశాయి. యాహూలో వెరిజోన్ 10 శాతం వాటాను అట్టే పెట్టుకుంది. యాహూకి ఇది కొత్త శకమని సంస్థ సీఈవో గురు గౌరప్పన్ వ్యాఖ్యానించారు. -
అపోలో హాస్పిటల్స్ నుంచి అపోలో ఫార్మసీ విభజన
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్... తన ఫార్మసీ (ఔషధ విక్రయ శాలలు) రిటైల్ వ్యాపారాన్ని అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ (ఏపీఎల్) పేరుతో వేరు చేయాలని నిర్ణయించింది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఏపీఎల్ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌కు 25.5 శాతం వాటా ఉంటుంది. అలాగే, జీలమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్–1కు 19.9 శాతం, హేమెంద్ర కొఠారికి 9.9 శాతం వాటా, ఇనామ్ సెక్యూరిటీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు 44.7 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఆరోగ్య సేవలు, ఫార్మసీ వ్యాపారాలకు సంబంధించి దీర్ఘకాలిక విధానాన్ని సమీక్షించిన అనంతరం బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. స్పష్టమైన విధానంతో పనిచేసేందుకు వీలుగా ఈ వ్యాపారాన్ని ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేయడానికి ఇది సరైన సమయమని భావించినట్టు తెలిపింది. రూ.10,000 కోట్ల ఆదాయ లక్ష్యం ఐదేళ్లలో 5,000 ఔషధ దుకాణాలు, రూ.10,000 కోట్ల ఆదాయం లక్ష్యంతో ఫార్మసీ విభాగం పనిచేయనున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఈ నిర్ణయంతో డిజిటల్ కామర్స్‌లోకి ప్రవేశించేందుకు వీలు కలుగుతుందని, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఏదన్నది నిర్ణయించుకునే సౌకర్యం వినియోగదారులకు లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 400 పట్టణాల్లో అపోలో ఫార్మసీకి 3,167 దుకాణాలు ఉన్నాయి. కంపెనీ వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ అనంతరం.. ఏపీఎల్‌కు అపోలో హాస్పిటల్స్ ఔషధ సరఫరాదారుగా ఉంటుంది. తాజా నిర్ణయం అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపించదని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
అపోలో డేటా హ్యాక్? నెక్ట్స్ లలిత్ మోదీనే!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ మాల్యా, ప్రముఖ జర్నలిస్టు బర్కా దత్ ల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిళ్ల సర్వర్లు హ్యాక్ చేసిన లెజియన్ హ్యాకర్ల బృందం తాము అపోలో ఆసుపత్రికి చెందిన సర్వర్లను హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఓ రహస్య ఇంటర్వూలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. అపోలోకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం తమ వద్ద ఉందని చెప్పారు. వారికి లభ్యమైన డేటా వివరాలను బయటపెడితే భారతదేశ ప్రజలు ఆందోళనలకు గురయ్యే అవకాశం ఉంటడంతో వాటిని విడుదల చేయడం లేదని తెలిపారు. భారత్ లోని 40 వేల సర్వర్లకు చెందిన గిగాబైట్ల కొద్దీ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. అంతేకాకుండా భారత రాజకీయ నాయకుల వ్యక్తిగత సమాచారం కూడా తమ ఉందని పేర్కొన్నారు. త్వరలో ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీకి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితులైన వారి సమాచారాన్ని కూడా హ్యాక్ చేసినట్లు వెల్లడించారు.