అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలు, మెగా వారి కోడలు 'ఉపాసన' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా, వైద్య రంగంలో తనదైన సేవచేస్తూ మంచి గుర్తింపు పొందిన ఈమె, రామ్‌చరణ్ సతీమణిగా మరింత పేరు సంపాదించింది. అయితే ఇటీవల ఈమె 'మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23' జాబితాలో ఒకరుగా నిలిచారు.
ఆస్కార్ విజయంతో సంబరాలు చేసుకున్న మెగా ఫ్యామిలీకి మరో అరుదైన ఘనత రావడం నెటిజన్లను, మెగా అభిమానులు ఆనందంలో ముంచెత్తుతోంది. చాలా మంది ప్రముఖులు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఉపాసన చేసిన సేవలకుగానూ ఈ అవార్డు లభించినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది.
వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న వారి జాబితాలో ఉపాసన ఒకరని పలువురు అభినందిస్తున్నారు. అంతే కాకుండా ఉపాసన తల్లి కాబోతున్నట్లు ఇదివరకే అందరికి తెలిసిందే. మొత్తానికి మెగావారి ఇంట ఆనందాలు వెల్లువిరుస్తాయి.
ఉపాసన ఎప్పటికప్పుడు సామజిక కార్యక్రమాలలో కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొంటూ తన వంతు సమాజ సేవ చేస్తోంది. ఈమె ప్రస్తుతం అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ.. 'బి పాజిటివ్' అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా ఉన్నారు.
(ఇదీ చదవండి: మునుపెన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్: ఇప్పటికే..)
చిన్ననాటి నుంచే వ్యాపార మెలకువలను నేర్చుకుంటున్న ఉపాసన 'యు ఎక్స్చేంజ్' అనే సేవా సంస్థ నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలు సేకరించి పేద పిల్లలకు ఇచ్చేవారు. అంతే కాకుండా మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడే పిల్లలకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించేవారు. తరువాత రీజెంట్స్ యూనివర్సిటీ లండన్ నుంచి ఇంటర్నేషనల్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. 2012న మెగాస్టార్ కుటుంబానికి కోడలయ్యింది.
Thank u @EconomicTimes for featuring me as one of the Most Promising Business Leaders of Asia 2022-23. pic.twitter.com/fP39b2zQTi
— Upasana Konidela (@upasanakonidela) March 23, 2023
Comments
Please login to add a commentAdd a comment