పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో | Upasana And Ram Charan Paris Tour Attend Wedding - Sakshi
Sakshi News home page

Upasana: కూతురు పుట్టిన తర్వాత ఉపాసన ఫస్ట్ టూర్

Published Fri, Sep 8 2023 7:34 PM | Last Updated on Fri, Sep 8 2023 8:21 PM

Upasana And Ram Charan Paris Tour Attend Wedding  - Sakshi

మెగా కోడలు ఉపాసన.. జూన్‌లో కూతురికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ముద్దులొలికే ఆ పాపతో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అలానే కుమార్తె క్లీంకార పుట్టిన తర్వాత పెద్దగా బయట కనిపించని ఉపాసన.. తాజాగా వెకేషన్‌కి వెళ్లింది. అయితే ఓ పెళ్లి కోసమే ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

రామ్ చరణ్-ఉపాసన ప్రస్తుతం తల్లిదండ్రులుగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 2012లో వీళ్లు పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ మధ్యనే పేరెంట్స్ అయ్యారు. పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు. గతంలో టూర్స్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత పారిస్ టూర్ వేశారు. అయితే అది ఓ పెళ్లి కోసమే అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?)

తాజాగా పారిస్‌లో ల్యాండ్ అయిన ఉపాసన.. తమకు అందిన ఇన్విటేషన్‌కి సంబంధించిన ఓ ఫొటో తీసి ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. అయితే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసిన చాలామంది నెటిజన్స్.. వరుణ్‌తేజ్-లావణ్య పెళ్లి పనుల కోసమేమోనని పొరబడ్డారు. కానీ ఇది వేరే ఎవరిదో పెళ్లి అని తెలుస్తోంది. బహుశా ఇది ఫ్రెండ్స్ లేదా బంధువుల మ్యారేజ్ అయ్యిండొచ్చు అనిపిస్తుంది. 

ఇకపోతే జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న మెగా కపుల్ వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠి.. ఈ ఏడాది నవంబరులో పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నాగబాబు ఫ్యామిలీ కూడా కెన్యా వెకేషన్‌లో ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement